E-Paper
Advertisement

Spy Satellites: అంతరిక్షం నుంచి భారత్‌ పై దొంగ చూపులు.. స్పేస్‌లో మొదలైన ఇండియా- పాక్ వార్..!

Spy Satellites: అంతరిక్షం నుంచి భారత్‌ పై దొంగ చూపులు.. స్పేస్‌లో మొదలైన ఇండియా- పాక్ వార్..!
Advertisement

Spy Satellites: 1961లో పాకిస్తాన్ స్పేస్ ఏజెన్సీని స్థాపించినప్పటి నుంచి 2024 వరకు కేవలం 9 శాటిలైట్లను మాత్రమే ప్రయోగించింది. కానీ గత 16 నెలల్లోనే ఏకంగా 6 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపడం అంటే తెరవెనుక కచ్చితంగా ఏదో జరుగుతోందంటున్నారు. ఈ శాటిలైట్ కక్ష్యలను అమెరికాకు చెందిన అంతరిక్ష నిఘా సంస్థ విశ్లేషించింది. సాధారణంగా గ్లోబల్ మ్యాపింగ్ కోసం ఉపగ్రహాలను పంపుతారు. కానీ PRSC-EO3 ని కేవలం 38 డిగ్రీల వాలులో ఉంచారు. దీనివల్ల ఈ ఉపగ్రహం భూమి చుట్టూ తిరగకుండా.. కేవలం నార్త్ ఇండియా, జమ్మూ కశ్మీర్ మీదుగానే రోజుకు ఐదారు సార్లు పదే పదే తిరుగుతూ నిఘా పెడుతుంది. ఈ శాటిలైట్లు భారత్‌పై, ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, నార్త్ ఇండియా సరిహద్దులపై డేగకన్ను వేసి ఉంచాయి. దశాబ్దాలుగా స్తబ్దంగా ఉన్న పాక్ అంతరిక్ష సంస్థ, చైనా అండతో ఇంత వేగంగా ఉపగ్రహాలను పంపడం డౌట్ ఫుల్‌గా మారింది.

హై-రెజల్యూషన్ ఇమేజెస్..

పాక్ ప్రయోగించిన ఈ 6 ఉపగ్రహాల్లో ఐదింటిని చైనా తన సొంత లాంగ్ మార్చ్ రాకెట్ల ద్వారా, తన భూభాగం నుంచే స్పేస్ లోకి పంపింది. ఈ 6 శాటిలైట్ల నెట్‌వర్క్ సహాయంతో భారత సైనిక స్థావరాలు, సరిహద్దు కదలికలు, నౌకాదళ నౌకల కదలికలను ప్రతి 48 గంటలకు ఒకసారి హై-రెజల్యూషన్ ఇమేజెస్‌తో పాకిస్తాన్ అప్‌డేట్ చేసుకోగలుగుతోంది. చైనాకు చెందిన మిలిటరీ గ్రేడ్ యావ్‌గాన్ గూఢచారి ఉపగ్రహాల డేటాను కూడా పాకిస్తాన్ రియల్ టైమ్‌లో యాక్సెస్ చేస్తోందని రక్షణ నిపుణులు గుర్తించారు.

Advertisement

Also Read: మీనాక్షితో పెట్టుకుని బీజేపీ బ‌ద్నాం! బీఎల్ సంతోష్ రంగంలోకి… ఇదో రాంగ్ స్ట్రాట‌జీ.. !

రహస్య ఆపరేషన్లు..

స్పేస్ లో చైనా, పాకిస్తాన్ కలిసి ఉమ్మడిగా భారత సరిహద్దులపై నిఘా వేసి ఉంచాయి. దీంతో మన సైన్యం సరిహద్దుల్లో చేసే రహస్య ఆపరేషన్లు, క్షిపణి మోహరింపులు శత్రువులకు ముందే తెలిసిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు అమెరికాకు చెందిన GPSని పూర్తిగా పక్కనపెట్టిన పాకిస్తాన్, చైనాకు చెందిన బేదూ మిలిటరీ గ్రేడ్ నావిగేషన్‌ను వాడుతోంది. దీనివల్ల పాక్ క్షిపణులు అత్యంత కచ్చితత్వంతో భారత లక్ష్యాలను తాకుతాయంటున్నారు.

52 కొత్త నిఘా ఉపగ్రహాలు..

Advertisement

ఈ ముప్పును గుర్తించిన భారత రక్షణ మంత్రిత్వ శాఖ కౌంటర్ గా వేగంగా అడుగులు వేస్తోంది. చైనా-పాక్ కూటమికి కౌంటర్‌గా భారత్ దాదాపు 22 వేల 500 కోట్ల ఖర్చుతో స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్ – SBS-3 ప్రాజెక్టును స్పీడప్ చేసింది. దీని కింద సరిహద్దులను నిరంతరం పర్యవేక్షించడానికి 52 కొత్త నిఘా ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. మనపై నిఘా పెట్టే శత్రు దేశాల శాటిలైట్లను స్పేస్ లోనే ట్రాక్ చేయడానికి, భారత రక్షణ శాఖ ఏటా 150 కోట్ల బడ్జెట్‌తో ఒక ప్రత్యేక ప్రైవేట్ స్పేస్ స్టార్టప్‌కు బాధ్యతలు అప్పగించింది. ఫైనల్ గా పాకిస్తాన్ ప్రయోగించినవి అధికారికంగా వ్యవసాయం, విపత్తు నిర్వహణ కోసమే వాడుతున్న శాటిలైట్లు అని చెప్తున్నప్పటికీ, వాటి కక్ష్యలు, చైనా టెక్నాలజీని బట్టి అవి పక్కాగా మిలిటరీ స్పై శాటిలైట్లే అని అంటున్నారు.

Also Read: పిల్లలకు అన్నీ ఇవ్వడం ప్రేమ కాదు.. ఆర్థిక బాధ్యత నేర్పడం ముఖ్యం!

Related News

ఫ్లాప్ షో నుంచి హిస్టారికల్ విక్టరీ దాకా.. 37 రోజుల్లో ఢిల్లీని ఊపేసిన జెన్-జీ తుఫాన్!

ఒరేయ్‌.. నీనింకా చావ‌లేదురా.. అప్పుడే చంపేయ‌కుర్రి…! మీ బ్రే..కింగుల అత్యుత్సాహం చావ..!

బొద్దింక గర్జన-శాశ్వతమేనా ?

జంత‌ర్ మంత‌ర్ టు పార్ల‌మెంట్‌.. తెలంగాణ గ‌ల్లీ నుంచి ఢిల్లీ జెన్‌-జీకి ప్ర‌తిపాద‌న‌..!

కాక్రోచులకు అండగా కాంగ్రెస్‌.. విద్యార్థి ఉద్య‌మాల‌కు వెన్నుద‌న్నుగా ఉంటామంటూ..

ఎప్పుడు త‌గ్గాలో తెలుసుకున్నాడు.. కానీ నెగ్గ‌లేదు! అభిమానుల‌కు మింగుడు ప‌డ‌ని మోడీ నిర్ణ‌యం..

హ‌మ్మ‌య్య‌.. ఊపిరిపీల్చుకున్న టాలీవుడ్‌.. మ‌న సెల‌బ్రిటీలు తేలుకుట్టిన దొంగ‌లు..!

బొద్దింక‌ల చేత‌జిక్కి … చేతులు కాలాక ఆకులు.. బద్నాం చేసిన పంతం..!

Big Stories

Advertisement
×