E-Paper
Advertisement

ఫ్లాప్ షో నుంచి హిస్టారికల్ విక్టరీ దాకా.. 37 రోజుల్లో ఢిల్లీని ఊపేసిన జెన్-జీ తుఫాన్!

ఫ్లాప్ షో నుంచి హిస్టారికల్ విక్టరీ దాకా.. 37 రోజుల్లో ఢిల్లీని ఊపేసిన జెన్-జీ తుఫాన్!
Advertisement

Abhijeet Deepke: వచ్చాడు.. టార్గెట్ కొట్టాడు.. వెళ్తున్నాడు.. సింపుల్ గా ఇదీ సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ఇంట్రో. అమెరికాలో చదువుకుంటూ ఆల్ ఆఫ్ సడెన్ గా ఇక్కడికి వచ్చి ఢిల్లీలో జెండా పాతడమంటే మాటలు కాదు. ఏంటి అభిజిత్ స్పెషల్? ఎలా హీరో అయ్యాడు?

30 ఏళ్ల యువకుడు అభిజిత్ కథ..

Advertisement

ఒక గొప్ప ప్రయత్నం పవర్ ఫుల్ స్పీచ్ తో కాకుండా, బలమైన సంకల్పంతో మొదలవుతుందని అంటారు. అమెరికాలో ఉంటున్న 30 ఏళ్ల యువకుడు అభిజిత్ దీప్కే కథ ఇందుకు ఒక ఉదాహరణ. అతను తన పట్టుదలతో, దేశంలోని అతిపెద్ద విద్యార్థి ఉద్యమాల్లో ఒక ఒకదానికి పునాది వేశాడు. జూన్ 6న అభిజీత్ అమెరికా బోస్టన్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో దిగినప్పుడు, తన వెంట రాజ్యాంగ ప్రతిని అలాగే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆత్మకథను తీసుకువచ్చాడు. ఢిల్లీకి చేరుకున్న వెంటనే, తెల్లవారుజామున అతను X లో రాసిందేంటంటే.. ‘ల్యాండింగ్ పూర్తయింది.. జంతర్ మంతర్ వద్ద మిమ్మల్ని కలవడానికి ఎదురుచూస్తున్నాను. పువ్వులు తీసుకురండి, వాటిని పోలీసులకు ఇవ్వండి. ఇది ప్రేమ, శాంతి కోసం చేసే పోరాటం’ అన్నారు.

నిరసనలో సోనమ్ వాంగ్‌చుక్..

Advertisement

కానీ తొలి రోజు నిరసన పూర్తిగా ఫెయిల్. ఉదయం 10 గంటలకు జంతర్ మంతర్ వద్దకు చేరుకుని, ఐదుసార్లు ఎమోషనల్ గా స్పీచ్ ఇచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. అంతకే ఆ రోజు ముగిసిపోయింది. జనం కూడా తక్కువగానే కనిపించారు. ఈ గేమ్ ముగిసిపోతుందని అంతా అనుకున్నారు. సీన్ కట్ చేస్తే జూన్ 20న జంతర్ మంతర్‌ దగ్గర రెండో దశ ఉద్యమాన్ని షురూ చేశారు. ఈసారి ప్రఖ్యాత విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ యాడ్ అయ్యారు. జూన్ 28న జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష మొదలు పెట్టడం ఈ ఉద్యమానికి చాలా బేస్ పవర్ గా మారిపోయింది.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..

వాంగ్ చుక్ ఆరోగ్యం క్షీణించడం, జులై 19న హాస్పిటల్ లో చేరడం, అక్కడే దీక్ష కంటిన్యూ చేయడం, జులై 20న చలో సంసద్ యాత్ర సందర్భంగా పోలీసులు లాఠీఛార్జ్ చేయడం ఇవన్నీ కథ మార్చేశాయి. ముఖ్యంగా లాఠీఛార్జ్ దేశవ్యాప్తంగా యువతలో ఆగ్రహం తెప్పించాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆన్‌లైన్‌లో ప్రారంభమైన నిరసన పూర్తిగా ఆఫ్‌లైన్‌కు మారింది. ఒత్తిడితో కేంద్రం చర్చలకు దిగి వచ్చింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.

దీప్కేకు ఎలా వర్కవుట్ అయ్యింది..?

కాక్రోచ్ జనతా పార్టీ ఆల్ ఆఫ్ సడెన్ గా పుట్టింది. ఓ కేసు సందర్భంగా సీజేఐ చేసిన కామెంట్ తో ఏకంగా అదే కాక్రోచ్ పేరుతోనే సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేశారు. చాలా తక్కువ టైంలో ఇన్‌స్టాగ్రామ్ 25 మిలియన్ల ఫాలోవర్లను దాటింది. ఎవరికీ సాధ్యం కానిది దీప్కేకు ఎలా వర్కవుట్ అయింది?

ఎవరీ అభిజిత్ దీప్కే..?

మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో ఒక సాధారణ దళిత కుటుంబంలో పుట్టాడు. అభిజీత్ దీప్కే. ఈయన తండ్రిది నిరుపేద బ్యాక్ గ్రౌండ్. అయితే విద్యార్థి దశ నుంచే సామాజిక, రాజకీయ సమస్యలపై ఆసక్తి ఉండేది. అభిజిత్ ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో కూడా పనిచేశారు. అక్కడ మీమ్స్, సెటైర్స్, ఇంకా ఒక కొత్త తరహా డిజిటల్ కమ్యూనికేషన్‌ను డెవలప్ చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం బోస్టన్‌కు వెళ్లాడు. ఈ టైంలోనే కాక్రోచ్ కామెంట్స్ తో మళ్లీ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు.

ప్రభుత్వం కూడా ఊహించని విధంగా విక్టరీ..

అభిజిత్ దీప్కే సాధించిన అతిపెద్ద విక్టరీ కేవలం ఒక మంత్రి రాజీనామా చేయడమే కాదు. ఇవాళ్టి జెనరేషన్ కేవలం సోషల్ మీడియాలో ట్రెండ్‌లను రన్ చేయడమే కాకుండా, అవసరమైతే రోడ్లపైకి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా తమ వాయిస్ వినిపించే సత్తా ఉందని ప్రూవ్ చేశారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఒక యువకుడు చేసిన తొలి నిరసన చాలా డల్ గా కనిపించవచ్చు. కానీ 37 రోజుల తర్వాత, ఆ ఉద్యమం దేశ రాజకీయాల్లో అతిపెద్ద అంశంగా మారింది. బహుశా ఈ కథలో ఇదే అతిపెద్ద మలుపు. జూన్ 6న ఫ్లాప్ షోతో మొదలైన ఈ కథ, బహుశా ప్రభుత్వం కూడా ఊహించని విధంగా జులై 25న ఒక హిస్టారికల్ విక్టరీతో ముగిసింది.

ఇండియన్ జెన్ జీ విజయం..

చెప్పాలంటే ఇది ఇండియన్ జెన్-జీకి అతిపెద్ద, చారిత్రాత్మక విజయం. మోడీ 2014 నుంచి అధికారంలో ఉన్నారు. తనమంత్రివర్గంలో ఒకరిని తప్పించడం అంటే చిన్న విషయం కాదు. ఇలాంటి నిరసనలను మోడీ అస్సలు పట్టించుకోరు. కానీ ఇప్పుడు పట్టించుకోవాల్సి వచ్చింది. అభిజిత్ దీప్కే చేసిన మ్యాజిక్ ఇది.

విక్టరీ కొట్టిన కాక్రోచ్ జనతా పార్టీ..

ఏ గుర్తింపు లేని, కేంద్ర ఎన్నికల సంఘంలో కనీసం రిజిస్ట్రేషన్ కూడా లేని ఒక సోషల్ మీడియా మూవ్‌మెంట్… ఏకంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేత రాజీనామా చేయించే స్థాయికి చేరిందంటే, అది సాదాసీదా ఆందోళన కాదు. అంతకు ముందు ఏ ఉద్యమం కూడా ఇలాంటి రిజల్ట్ తీసుకురాలేకపోయింది. ఈ విషయంలో అభిజీత్ దీప్కే నేతృత్వంలోని కాక్రోచ్ జనతా పార్టీ విక్టరీ కొట్టింది.

అభిజిత్ దీప్కే ఫ్యూచర్ ఏంటి..?

ఆవేశంతో వ్యవస్థను ప్రశ్నించడం ఒక ఎత్తైతే… అదే వ్యవస్థను శాశ్వతంగా మార్చడం ఇంకో ఎత్తు. గతంలో కన్హయ్య కుమార్, హార్దిక్ పటేల్ లాంటి వాళ్లు ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నాలు చేశారు. అవి ముందుకు సాగలేదు. ఒక సునామీలా వచ్చిన ఉద్యమాలు చల్లారిపోయాయ్. మరి కాక్రోచ్ జనతా పార్టీ, లీడర్ గా మారిన అభిజిత్ దీప్కే ఫ్యూచర్ ఏంటన్నదే ఇప్పుడు చర్చ నడుస్తోంది. భారతీయ రాజకీయాల్లో ఆల్టర్నేటివ్ శక్తిగా ఎదగడం అంటే కేవలం ధర్నాలు, సోషల్ మీడియా ట్రెండింగ్‌లు మాత్రమే కాదు. దానికి ఒక స్పష్టమైన సిద్ధాంతం, నిలకడైన వ్యూహం, బలమైన క్షేత్రస్థాయి యంత్రాంగం కావాలి. వీటికి తోడు ఇప్పటికే బలమైన పునాదులతో ఉన్న పార్టీలకు ఇలాంటి ఉద్యమాలను ఎలా కంట్రోల్ చేయాలో వాళ్లకు తెలుసు.

అభిజిత్ చరిత్ర సృష్టిస్తారా..?

యువత కేవలం రోడ్లెక్కి నిరసనలు తెలిపితే సరిపోదు… ఆ నిరసనను చట్టాలు చేసే అధికారంగా మార్చుకోగలిగినప్పుడే దేశంలో నిజమైన మార్పు వస్తుంది. అభిజీత్ దీప్కే ఆ దిశగా అడుగులు వేసి చరిత్ర సృష్టిస్తారా, లేదా గతంలో వచ్చిన యువ నాయకుల్లాగే ఒక ‘ఫ్లాష్ ఇన్ ది పాన్’ లా మిగిలిపోతారా? చూడాలి. ప్రస్తుతం దేశంలో పొలిటికల్ వాక్యూమ్ చాలా ఉంది. బొద్దింకలకు కచ్చితంగా ఆ వ్యాక్యూమ్ ని నింపే శక్తి ఉంది.. కానీ ఆచరణ ఎంత వరకు?

Also Read: రూ.3వేలలోపు బెస్ట్ ఫిట్‌నెస్ వాచ్ కావాలా? దీని కంటే బెస్ట్ ఉండదు

Related News

ఒరేయ్‌.. నీనింకా చావ‌లేదురా.. అప్పుడే చంపేయ‌కుర్రి…! మీ బ్రే..కింగుల అత్యుత్సాహం చావ..!

బొద్దింక గర్జన-శాశ్వతమేనా ?

జంత‌ర్ మంత‌ర్ టు పార్ల‌మెంట్‌.. తెలంగాణ గ‌ల్లీ నుంచి ఢిల్లీ జెన్‌-జీకి ప్ర‌తిపాద‌న‌..!

కాక్రోచులకు అండగా కాంగ్రెస్‌.. విద్యార్థి ఉద్య‌మాల‌కు వెన్నుద‌న్నుగా ఉంటామంటూ..

ఎప్పుడు త‌గ్గాలో తెలుసుకున్నాడు.. కానీ నెగ్గ‌లేదు! అభిమానుల‌కు మింగుడు ప‌డ‌ని మోడీ నిర్ణ‌యం..

హ‌మ్మ‌య్య‌.. ఊపిరిపీల్చుకున్న టాలీవుడ్‌.. మ‌న సెల‌బ్రిటీలు తేలుకుట్టిన దొంగ‌లు..!

బొద్దింక‌ల చేత‌జిక్కి … చేతులు కాలాక ఆకులు.. బద్నాం చేసిన పంతం..!

Big Stories

Advertisement
×