E-Paper
Advertisement

Palnadu: పల్నాడుపై జగన్ ఫోకస్.. వైసీపీ మాస్టర్ ప్లాన్ ఇదేనా!

Palnadu: పల్నాడుపై జగన్ ఫోకస్..  వైసీపీ మాస్టర్ ప్లాన్  ఇదేనా!
Advertisement
Palnadu: రాష్ట్ర రాజకీయాల్లో విశేషమైన పాత్ర పోషించే ప్రాంతం పల్నాడు.. అటువంటి పల్నాడు ప్రాంతంలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీరాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది… అందుకే నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నుంచి ఇప్పటి సీఎం చంద్రబాబు వరకు ఆ ప్రాంతంపై నిరంతరం ఫోకస్ పెడుతూనే ఉంటారు .. అలాంటి చోట తిరిగి పట్టుచాటుకోవడానికి వైసీపీ ఫోకస్ పెడుతోందంట.

ప్రశాంత వాతావరణంలో పల్నాడు

మావోయిజం.. ఫ్యాక్షనిజంలతో అట్టుడికి పోయిన పల్నాడులో గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది రాష్ట్ర విభజన తర్వాత పల్నాడు ప్రాంతం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయింది… ఏపీ రాజధాని కంటే తెలంగాణ రాజధాని పలనాడు ప్రాంతానికి దగ్గర. నరసరావుపేట కేంద్రంగా పల్నాడులో పరిపాలన కొనసాగుతోంది. ఇప్పుడు పల్నాడులో తిరిగి పట్టు సాధించడంపై వైసీపీ ఫోకస్ పెట్టిందంట..

ఎవరి బలం ఎంటో ఎవరి బలహీనత ఎంటో తెలుసుకునే ప్రయత్నం

నరసరావుపేట పార్లమెంటు సెగ్మెంట్‌తో పాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీని యాక్టివ్ చేసేందుకు జగన్ కార్యచరణ రూపొందిస్తున్నారంట… దాన్లో భాగంగానే పార్లమెంట్ ఇన్చార్జి ఎంపిక దగ్గర నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జి వరకు ఇటీవల జగన్ ఐవీఆర్ఎస్ సర్వే కాల్స్ నిర్వహించారంట. ఎవరి బలం ఏంటో ఎవరి బలహీనత ఎంతో జగన్ తెలుసుకున్నానే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నరసరావుపేట లోక్‌సభ సెగ్మెంట్లో వైసీపీకి ఇన్చార్జ్ కరువు

Advertisement

ప్రస్తుతానికి వైసీపీకి నరసరావుపేట పార్లమెంటు సెగ్మెంట్లో ఇన్చార్జి లేని పరిస్థితి.. మొన్నటి ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా, నెల్లూరు సిటీకి చెందిన మాజీ మంత్రి అనిల్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి కొత్త ఇంచార్జ్ కోసం అన్వేషణ కొనసాగుతోంది.. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల , గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కొనసాగుతున్నారు..

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాచర్ల మాజీ ఎమ్మెల్యే

పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులతో సతమతమవుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్‌ని జగన్ నియమించారు.. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యాక్టివ్ అయ్యేందుకు పావులు కడుపుతున్నారు… కేసుల బెడదతో నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో లేకపోయినా పార్టీ క్యాడర్ ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.. పార్టీ క్యాడర్ కు నిత్యం అండగా ఉండే ప్రయత్నంలో పిన్నెల్లి ఉన్నారు. సత్తెనపల్లి, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు కూడా పెద్దగా జరుగుతున్న పరిస్థితి కనిపించట్లేదు. ఇన్చార్జిలు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొంది.. ఈ మూడు నియోజకవర్గాన్ని సెట్ చేసే పనిలో అధిష్టానం పడిందంట

Advertisement

చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి విడదల రజిని వైసీపీ ఇన్చార్జ్‌గా కొనసాగుతున్నారు.. నిత్యం కేసులతో వివాదాలతో రజిని సతమతమవుతున్నారు.. రజనీకి మాత్రం పార్టీ అధిష్టానం అండగా ఉంది కానీ నియోజకవర్గ నేతలు, పల్నాడు జిల్లా వైసీపీ నేతలు అండగా నిలవడం లేదు.. దీంతో ఆమె తనపై వచ్చిన ఆరోపణలు, కేసుల్లో ఒంటరి పోరాటం చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో గ్రూప్ వివాదాల తో విలవిల్లాడిపోతున్నారు.

జిల్లా స్థాయిలో పార్టీని యాక్టివ్ చేసే ప్రయత్నం

జిల్లా కేంద్రం నరసరావుపేట ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలోని అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు నేతలకు నేను ఉన్నానంటూ ధైర్యం, భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఉంటూ జిల్లా స్థాయిలో పార్టీని ఆక్టివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.. మరో నియోజకవర్గం గురజాల. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వారసుడు కాసు మహేష్ రెడ్డి గురజాల వైసీపీ ఇన్చార్జ్‌‌గా ఉన్నారు. మెడికల్ కాలేజీల పునర్నిర్మాణం.. మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్‌లో ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోనే మొదటిసారిగా అధికార పార్టీకి ఇక్కడి నుంచే వైసీపీ పోరాటాన్ని మొదలుపెట్టారు.. మరోవైపు నియోజకవర్గంలో పార్టీ నేతలకి అందుబాటులో ఉంటూ జిల్లా అధ్యక్ష పదవి కోసం రాజకీయకంగా పావులు కదుపుతున్నారు..

రాష్ట్ర భజన తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లో పల్నాడు జిల్లాలోని ఏడు స్థానాలు గాను ఐదు చోట్ల వైసీపీ ఓటమి పాలయింది.. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది .. గత ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. ఆ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఏడు స్థానాల్లో గెలిచి పట్టు నిలుపుకోవాలని వైసీపీ అధినేత జగన్ కార్యచరణ రూపొందిస్తున్నట్లు చెప్తున్నారు.

Story by Apparao, Big Tv

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×