Big Stories

AP Intelligence Chief : బదిలీలు మేలా? చేటా?

- Advertisement -

ఇదే ఇక్కడ హైలేట్. ఈసీ ఈ స్థాయిలో నిర్ణయం తీసుకుంది అంటే.. వీరిపై వచ్చిన ఫిర్యాదుల్లో ఎంత డెప్త్‌ ఉందనేది ఇక్కడ చూడాలి. నిజానికి ఇంటెలిజెన్స్ చీఫ్‌ అంటే సాధారణ పోస్ట్‌ కాదు. అత్యంత కీలకమైనది. అందుకే ప్రభుత్వ పెద్దలు ఇలాంటి పోస్టుల్లో తమకు అనుకూలంగా ఉండేవారిని నియమిస్తారు. ఆఫ్‌కోర్స్‌ అలా ఉండటం వల్ల జరిగే లాభాలేంటో మనం తెలంగాణలో చూశాం. సో అలాంటి కీలక పోస్టును ఈసీ మార్చేసింది. అంటే ఈసీకి చాలా అనుమానాలున్నాయనేది ఇక్కడ అర్థమవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరిని మార్చేయాలంటూ టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈసీకి అనేకసార్లు ఫిర్యాదు చేసింది కూడా మొత్తానికి తాము అనుకున్నది సాధించారు టీడీపీ నేతలు.

- Advertisement -

Also Read: వైసీపీలో వణుకు, ఏపీ నిఘా చీప్‌గా విశ్వజిత్, సీపీగా రామకృష్ణ 

2019లో కూడా సేమ్ ఇలాంటి సీన్సే జరిగాయి. అప్పట్లో ఎన్డీఏ నుంచి బయటికి రావడంతో కేంద్రం నుంచి టీడీపీకి ఎలాంటి సపోర్ట్ లభించలేదు. ఎట్ ది సేమ్‌ టైమ్‌ అప్పటి కీలకశాఖల ఉన్నతాధికారులపై వైసీపీ నేతలు వరుసగా ఫిర్యాదులు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే కీలక అధికారులను మార్చేసింది ఈసీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నుంచి మొదలుపెడితే సీఎస్‌తో సహా కీలక ఐపీఎస్ అధికారులను మార్చేసింది. అంతేకాదు టీడీపీ నేతలు, వారికి సహకరించేవారిపై ఐటీ సోదాలు జరిగాయి. దీంతో టీడీపీ నేతలకు ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌ అస్సలు సాధ్యం కాలేదనే చెప్పాలి. ఫండ్స్‌ ఆగిపోయాయి. సహకరించే అధికారులు లేక టీడీపీ చాలా నష్టపోయిందన్న ప్రచారం జోరుగా కొనసాగింది. ఈ చర్యలన్నింటి వల్ల వైసీపీ మరింత బలపడేందుకు అవకాశం దక్కినట్టైంది.

కానీ ఈ చాన్స్‌ను టీడీపీ తీసుకుంది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం వచ్చిన ప్రతి ఒక్క అధికారిపై ఈసీకి ఫిర్యాదు చేస్తూ వస్తుంది. దీనికి తోడు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో టీడీపీ దోస్తి కట్టింది. సో కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టుగా.. పరిస్థితులు వారికి అనుకూలంగా మారుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రకాశం, పల్నాడు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు ఎస్పీలతో పాటు కృష్ణా, అనంతపురం, తిరుపతి ఎన్నికల అధికారులను ఈసీ బదిలీ చేసింది. ఇక్కడ విజయవాడ సీపీ కాంతి రాణా బదిలీ కాస్త ఇంట్రెస్టింగ్ టాపిక్.

ఎందుకంటే విజయవాడలోనే సీఎం జగన్‌పై రాయి దాడి జరిగింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రాయి దాడి అంశం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇలాంటి కీలకమైన కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో కాంతి రాణాను బదిలీ చేయడం కాస్త ఆసక్తికరం. రాయి దాడికి బాధ్యుడిని చేస్తూ ఈసీ ఈ నిర్ణయం తీసుకుందా? లేక వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చర్యలు తీసుకుందా? అనేది బిగ్ క్వశ్చన్. ఏదేమైనా ఈ బదిలీ ఇప్పుడు రాయి దాడి కేసు దర్యాప్తుపై ప్రభావం చూపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది.

Also Read: నేడు నామినేషన్ వేయనున్న సీఎం జగన్.. దస్తగిరికి భద్రత పెంపు

అయితే ఈ బదిలీల పర్వం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఎందుకంటే బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. 22 మంది అధికారుల పేర్లతో ఓ లిస్ట్‌ను తయారు చేశారు. ఏఏ చోట్ల అధికారులను మార్చాలి.. ఎవరినీ నియమించాలి అనే విషయాన్ని కూడా ఆమె చెప్పడం అప్పుడు పెద్ద దుమారాన్నే రేపింది. అంతేకాదు ఏపీలో ఎన్నికలు సజావుగా సాగాలంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, డీజీపీని బదిలీ చేయాల్సిందే అంటోంది టీడీపీ.. త్వరలో ఈ మార్పులు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది.

నిజానికి ఏపీలోనే కాదు.. మొత్తం దేశ వ్యాప్తంగా అధికారులు రాజకీయ పార్టీల చేతుల్లో కీలు బొమ్మలుగా మారుతున్నారన్న ప్రచారం ఉంది. అందుకే ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే అలాంటి వారిపై ఎలాగైనా విపక్షాలు ఫిర్యాదులు చేస్తాయి. వీటిని సాకుగా చూపి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వారిని బదిలీలు చేస్తుంటుంది ఈసీ.. 2019లో అప్పట్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో బదిలీ చేసింది. ఇప్పుడు 2024లో సేమ్ అదే రీజన్స్‌తో బదిలీలు చేస్తుంది. కాకపోతే ఈసారి జాబితా అంతకంతకు పెరుగుతుండటం కాస్త ఇంట్రెస్టింగ్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News