Big Stories

Mohit new record IPL history: కలలో కూడా అవే.. ఐపీఎల్‌ హిస్టరీలో మోహిత్ రికార్డ్

Mohit new record IPL history: ఐపీఎల్‌లో కొత్త కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ జట్టు పేసర్ మోహిత్‌శర్మ ఐపీఎల్ హిస్టరీలో ఓ కొత్త రికార్డు నెలకొల్పాడు. బుధవారం రాత్రి ఢిల్లీ-గుజరాత్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఇందులో మోహిత్‌శర్మ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

- Advertisement -

కేవలం నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్ తీయకుండా ఏకంగా 73 పరుగులు ప్రత్యర్థికి సమర్పించుకున్నాడు. ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇదీ కూడా ఓ రికార్డే. ఇన్నింగ్స్ చివర్లో చెలరేగిన ఢిల్లీ కెప్టెన్ పంత్‌కు ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు.

- Advertisement -

మ్యాచ్ తర్వాత సరిగా నిద్రపోలేదట గుజరాత్ బౌలర్ మోహిత్‌శర్మ. ముఖ్యంగా పంత్ కొట్టిన షాట్స్ కలలో కూడా అవే కనిపించినట్లు తెలుస్తోంది. మరీ ఇంత దారుణంగా రాత్రి మ్యాచ్‌ ఆడానా? తనలో తాను చర్చించుకున్నట్లు చెబుతున్నారు. 2018లో బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ బౌలర్ బాసిల్ థంపి కూడా నాలుగు ఓవర్లలో వికెట్ తీయకుండా ఏకంగా 70 పరుగులు ప్రత్యర్థికి ఇచ్చారు. ఆ రికార్డును మోహిత్‌శర్మ బద్దలుకొట్టేశాడు.

ALSO READ: కొహ్లీ ఓపెనర్ గా రావాలి.. సౌరభ్ గంగూలి

ఒక్కసారి హిస్టరీలోకి వెళ్తే..

1998-99 మధ్య షార్జా వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో కూడా ఆస్ట్రేలియా ఆటగాడు షేర్‌వార్న్ బౌలింగ్‌ను సచిన్ ఇదే విధంగా బాదేశాడని గుర్తు చేసుకున్నారు ప్రేక్షకులు. సచిన్‌ను ఆపడం కష్టమని, తన తలపై సిక్సర్లు కొడుతున్నట్లు కలలు కూడా వచ్చేవని ఒకానొకద దశలో షేన్‌వార్న్ సైతం చెప్పుకున్నాడు. అదే సీన్ రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రిపీట్ అయ్యిందని అంటున్నారు క్రికెట్ లవర్స్.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News