E-Paper
Advertisement

PhonePe Wallet: ఫోన్ పే వాడుతున్న వారికి బిగ్ అలర్ట్.. వాలెట్ వాడకపోతే వంద రూపాయల జరిమానా..?

PhonePe Wallet: ఫోన్ పే వాడుతున్న వారికి బిగ్ అలర్ట్.. వాలెట్ వాడకపోతే వంద రూపాయల జరిమానా..?
Advertisement

PhonePe Wallet: స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్‌లోనూ ఫోన్ పే యాప్ కచ్చితంగా ఉంటుంది. రోజువారీ డిజిటల్ లావాదేవీలు, యూపీఐ పేమెంట్స్ కోసం దేశంలో కోట్ల మంది ఈ యాప్‌ని వాడుతున్నారు. అలాంటి ఫోన్ పే గురించి.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ నడుస్తోంది. ఫోన్ పే వాలెట్ వాడకుండా వదిలేస్తే.. 3 నెలలకోసారి వంద రూపాయల పెనాల్టీ విధిస్తారనే న్యూస్ వైరల్ అయింది. ఇది చూసి యూజర్లు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. చాలా మంది తమ వాలెట్ అకౌంట్లని కంటిన్యూ చేయాలా? క్లోజ్ చేసుకోవాలా? అనే కన్ఫ్యూజన్‌లో పడ్డారు. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఫోన్ పే సంస్థ స్పష్టం చేసింది.

అపోహ వల్లే ఈ గందరగోళం..

ఇన్‌యాక్టివ్‌ వాలెట్‌లపై ఛార్జీలు విధించనున్నట్లు ఇటీవలే ఫోన్ పే ప్రకటించింది. దీనిపై యూజర్ల సందేహాలకు సమాధానాలిచ్చింది. ఫోన్ పేకు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లు, యూపీఐ లావాదేవీలపై ఇది ఎలాంటి ప్రభావం చూపదని క్లారిటీ ఇచ్చింది. యూజర్ల వాలెట్ బ్యాలెన్స్ సరిపోకపోతే లింక్ చేసిన బ్యాంకు ఖాతాలు, యూపీఐ ద్వారా ఇన్‌యాక్టివ్‌ ఛార్జీలు తీసుకోబోమని తెలిపింది. అలాగే వాలెట్ బ్యాలెన్స్‌ నెగెటివ్‌గా మారదని స్పష్టం చేసింది. ప్రీపెయిడ్ పేమెంట్ సాధనమైన.. పీపీఐ ఫోన్ పే వాలెట్‌కు మాత్రమే ఇవి వర్తిస్తాయని తెలిపింది. ఫోన్ పే ఖాతా, యూపీఐ, ఫోన్ పే వాలెట్ అన్నీ ఒకటేనని యూజర్లలోఉన్న అపోహ వల్లే ఈ గందరగోళం ఏర్పడిందని ఫోన్ పే తెలిపింది. ఇవన్నీ.. వేర్వేరు నిబంధనలకు లోబడి ఉంటాయని తెలియజేసింది.

Advertisement

Also read: Accident: మెహదీపట్నంలో దారుణం.. నర్సును ఢీకొట్టిన ఇన్నోవా కారు..!

3 నెలలకోసారి వంద రూపాయలు

ఫోన్ పే వాలెట్‌లో.. డబ్బులుఉండి, దాన్ని ఏడాది పైగా వాడకుండా వదిలేస్తేనే.. 3 నెలలకోసారి వంద రూపాయలు ప్లస్ జీఎస్టీ చొప్పున కట్ అవుతుంది. ఒకవేళ.. వాలెట్‌లో అసలు డబ్బే లేకపోతే ఎలాంటి ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వ్యాలెట్ బ్యాలెన్స్ నెగటివ్‌లోకి వెళ్లే ఛాన్స్ కూడా లేదని సంస్థ స్పష్టం చేసింది. ఒకవేళ, వ్యాలెట్ నుంచి ఏదైనా ఫీజు కట్ చేయాల్సి వస్తే.. 15 రోజుల ముందే కస్టమర్లకు అలర్ట్ పంపుతామని తెలిపింది ఫోన్ పే. ఈ లోపు యూజర్లు ఓటీపీ వెరిఫికేషన్ గానీ, ఏదైనా చిన్న ట్రాన్సాక్షన్‌తో గానీ వాలెట్‌ని రీ-యాక్టివేట్ చేసుకోవచ్చని తెలిపింది.

Advertisement

Also read: మేలో అమ్మకాల్లో దూసుకెళ్లిన టాప్ టూవీలర్స్.. మళ్లీ టాప్ లో స్ప్లెండర్, యాక్టివా!

Related News

వరి వద్దు.. ఈ సర్కార్‌ నోటి వెంటా ఇప్పుడిక అదే మాట..! కరువు ప్రభావం.. సాగునీటికి కటకట..!

కాసాని జ్ఞానేశ్వర్ రీ-ఎంట్రీ.. నెక్ట్స్ పొలిటికల్ ప్లాన్ ఇదేనా?

పులివెందుల రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. వైఎస్ ఫ్యామిలీ నుంచి మరొకరు రాజకీయాల్లోకి?

దానం నాగేందర్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ట్విస్ట్.. రంగంలోకి బీఆర్ఎస్, బీజేపీ!

రాఖీ సినిమా సీన్ రిపీట్.. చెల్లిని చంపిన భర్తను అతి దారుణంగా చంపిన అన్నయ్య!

బీఆర్ఎస్ ఫాంహౌస్‌లపై కాంగ్రెస్ ఫోకస్.. ఫీల్డ్ విజిట్ నివేదికపై ఉత్కంఠ!

ప్రధాని మోదీపై సెటైరికల్ స్కిట్ వివాదం.. రగిలిపోతున్న బీజేపీ నేతలు!

కత్రినా ట్రోలింగ్ ఎఫెక్ట్.. బిగ్‌బాస్ స్టేజ్‌పై సల్మాన్ ఫైర్!

Big Stories

Advertisement
×