E-Paper
Advertisement

తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర.. సీఎం రేవంత్ రెడ్డి పై భారీ స్కెచ్చేసిన బీఆర్ఎస్!

తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర.. సీఎం రేవంత్ రెడ్డి పై భారీ స్కెచ్చేసిన బీఆర్ఎస్!
Advertisement

KTR Padyatra: కేటీఆర్ పాదయాత్రకు సిద్దమవుతున్నారు. త్వరలోనే షెడ్యూల్ సైతం ప్రకటించే అవకాశం ఉంది. ప్రజాసమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో జాప్యం అంశాలే ఎజెండాగా యాత్ర కొనసాగించబోతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏ ప్రాంతం నుంచి అనేదానిపై మాత్రం త్వరలోనే క్లారిటీ రానుంది.

హామీలపై ప్రత్యేక ఫోకస్..

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజాసమస్యలపై ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ప్రతీ చిన్న తప్పిదాన్ని సైతం నిలదీస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన కేటీఆర్.. ఆ అంశాలపైనే పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. స్థానిక సమస్యలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో ప్రజలు ఆశించిన స్థాయిలో పాలన సాగడం లేదని వ్యతిరేకత ఉందని.. ఈ సమయంలోనే యాత్ర చేపడితే బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అందుకే యాత్రతో ప్రజల ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యాత్రకు శ్రీకారం

Advertisement

ఉమ్మడిరంగారెడ్డి జిల్లాలో పాదయాత్రను చేపట్టబోతున్నారు. అయితే జిల్లాలోని ఏ ప్రాంతం నుంచి ప్రారంభం చేస్తారనేది మాత్రం త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మూడు విడుతలుగా పాదయాత్ర చేస్తారని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యాత్ర ముగిసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముగింపురోజూ భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. అయితే రాష్ట్రంలోని 33 జిల్లాలు కవర్ అయ్యేలా యాత్రకు రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ రెండో విడుత, మూడో విడుత ఉత్తర తెలంగాణ జిల్లాలు కవర్ అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Also Read: హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

మైలేజ్ పెంచుకునేలా ప్లాన్..

Advertisement

వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కు అర్బన్ ప్రాంతంలో గట్టిపట్టుకుంది. ప్రజఆదరణ ఉంది. అయితే రూరల్ ఏరియాలో కొంత కనెక్టివిటీ తక్కువ. గ్రామీణ ప్రజలకు చేరువ అయ్యేందుకు, వారి సమస్యలను యాత్రతో ముఖాముఖీ తెలుసుకొని వారితో మమేకం కావాలని భావిస్తున్నారు. దీంతో గ్రామీణ స్థాయిలోనూ మైలేజ్ పెంచుకోవాలని, పార్టీలోనూ ఇంకా పటిష్టం కావాలని ప్రయత్నాలు షురూచేస్తున్నారు. పార్టీ అంటే కేసీఆర్ ఎలాగో.. రాబోయే కాలంలో పార్టీ అంటే కేటీఆర్ అనే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో పార్టీపై పట్టుపెంచుకోవడం, ప్రజల్లోని వ్యతిరేకతను పార్టీవైపు మళ్లించడం కోసమే పాదయాత్ర చేయాలని నిశ్చయించుకున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

పాదయాత్రలతో అధికారం..

రాజకీయాల్లో ఒక సెంటిమెంట్ ఉంది. ఏ పార్టీ నేత అయితే జనం మధ్యకు వెళ్లి సుదీర్ఘ పాదయాత్ర చేస్తారో, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించడం ఖాయమని చరిత్ర స్పష్టం చేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి పదేళ్ల టీడీపీ పాలనకు చెక్ పెట్టేందుకు ఈ సంస్కృతికి శ్రీకారం చుట్టారు. 2004లో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 2012లో చంద్రబాబు, 2018లో వైఎస్ జగన్ ఇదే వ్యూహంతో సక్సెస్ అయ్యారు. ఇక 2023లో టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో చేసిన పాదయాత్ర ఆ పార్టీని అధికారంలోకి తీసుకురాగా, తెలంగాణలో 2022లో రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెచ్చింది. యూపీలో అఖిలేష్ యాదవ్ సైతం2012లో అధికారంలోకి రాగానే సీఎం అయ్యారు. అయితే కేటీఆర్ సైతం ఇదే గెలుపు సెంటిమెంట్ ను నమ్ముకొని, సక్సెస్ సాధించాలనుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Alao Read: సీజేపీ నిరసనల్లో ఉగ్ర కుట్ర.. 9 మంది అరెస్ట్, తీగలాగితే డొంక

క్షేత్రస్థాయిలో బలోపేతం..

అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో పాలనాపరమైన ఒత్తిళ్లు, అధికార దూరం కారణంగా బీఆర్ఎస్ పార్టీకి, క్షేత్రస్థాయి ప్రజలకు మధ్య కొంత దూరం పెరిగిందనే వాస్తవాన్ని గులాబీ శ్రేణులు గుర్తించాయి. ఇప్పుడు ఆ అంతరాన్ని పూర్తిగా చెరిపేసేందుకు, గ్రామీణ స్థాయితో సంబంధాలను మళ్లీ బలోపేతం చేసుకునేందుకు ఈ యాత్రను ఒక బ్రహ్మాస్త్రంగా కేటీఆర్ భావిస్తున్నారు. అయితే పాదయాత్రతో ఆ ఇమేజ్‌ను పూర్తిస్థాయి ప్రజా నాయకుడిగా మార్చుకోవాలని కేటీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

అసలు ప్లాన్ అదే..?

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న అసంతృప్తి బీఆర్ఎస్‌కు రాజకీయంగా కలిసివవస్తుందని పార్టీ సైతం భావిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత బలం కొంత బలపడింది. అయితే ఈ పాదయాత్రతో నిరాశలో ఉన్న పార్టీ కేడర్‌లో జోష్ పెంచబోతున్నారు. క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన నాయకత్వాన్ని గుర్తించడం, ప్రజల కష్టనష్టాలను, స్థానిక సమస్యలను నేరుగా అర్ధం చేసుకొని అదే ఎన్నికల ఎజెండాగామల్చుకోబోతున్నారు. కేటీఆర్ పాదయాత్రను విజయవంతం చేసి తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీని మళ్లీ నంబర్ వన్ గా, కాంగ్రెస్ కుప్రత్యామ్నాయంగా నిలబెట్టేందుకు సిద్దమవుతున్నారు.

Also Read: ప్రధాని మోదీ వీడియో డిలీట్ పై.. క్లారిటీ ఇచ్చిన మెటా సంస్థ..!

Tags

Related News

మేం తిడితే ఓకే.. ఎవ‌రు తిట్టినా కేసే! మోడీని తిడితే ఊరుకోం.. ఆయ‌న మ‌న ప్ర‌ధాని..!

కేటీఆర్, అర్వింద్ .. ఇద్ద‌రి నోటా ఒకే మాట‌! రేవంత్ టార్గెటెడ్‌గా కామెంట్స్‌.. పార్టీ లైన్ దాటి ప‌ర్స‌న‌ల్ అటాక్‌..!

హైదరాబాద్‌లో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు

బ్లాక్‌మెయిల్ ఎమ్మెల్యేల‌కు ఇదే క‌రెక్టు ధమ్కీ.. ద‌మ్ముంటే రాజీనామాలు చేయండి..!

తండ్రులు సామ్రాజ్యాలు క‌ట్టారు.. కొడుకులు కూల‌గొట్టారు.. ఆ ఇద్ద‌రికీ ‘స‌న్’ స్ట్రోక్స్.. సీఎం యోగం ఉన్న‌ట్టా, లేన‌ట్టా?

ఆ రెండు ఆల‌యాలకు క్షుద్ర‌పూజ‌ల మ‌ర‌క‌.. రాజ‌కీయాల కోసం ఆ రెండు రాష్ట్రాల భ‌క్తుల‌ మ‌నోభావాలు దెబ్బ తీసేలా.. డిఫెన్స్‌లో ప‌డేశారా? సెల్ఫ్ డిఫెన్స్‌లో ప‌డ్డారా?

బ్రిజ్ భూషణ్ అంత సుద్దపూసా.. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా వదిలేదే లేదన్న వినేష్ ఫోగట్!

Big Stories

Advertisement
×