E-Paper
Advertisement

స్క్రాప్ నానోను లంబోర్ఘినిగా మార్చేశాడు.. యువకుడి క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా!

స్క్రాప్ నానోను లంబోర్ఘినిగా మార్చేశాడు.. యువకుడి క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా!
Advertisement

From Tata Nano to Lamborghini Aventador:  కేరళలోని కన్నూర్‌ కు చెందిన 27 ఏళ్ల యువకుడు అద్భుతమైన తన స్కిల్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా లక్షల రూపాయల ఖరీదైన లంబోర్ఘిని కారును కొనడం చాలా మందికి సాధ్యం కాదు. కానీ, సరిన్ అనే యువకుడు మాత్రం పాత టాటా నానో కారును ఉపయోగించి ఇంట్లోనే లంబోర్ఘిని అవెంటడోర్ మాదిరి సూపర్ కారును తయారు చేశాడు. ఈ కారు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతడి క్రియేటివిటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇంతకీ ఎవరీ సరిన్?

సరిన్ వృత్తిరీత్యా టాటూ స్టూడియో రన్ చేస్తున్నాడు. రోజువారీ పనులు ముగిసిన తర్వాత సాయంత్రం, రాత్రి వేళల్లో ఈ ప్రాజెక్ట్‌ పై పని చేసే వాడు. దాదాపు ఏడాదికి పైగా కష్టపడి ఈ కారును పూర్తి చేశాడు. 2025 ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్‌ ను మొదలుపెట్టి, 2026 జనవరి నాటికి పూర్తి చేశాడు.

పాత నానోతో కొత్త లంబోర్ఘిని తయారీ

Advertisement

ఈ ప్రాజెక్ట్‌ కోసం ఒక పాత టాటా నానో కారును తీసుకున్నాడు. స్క్రాప్ మార్కెట్ నుంచి ఆ కారును కొనుగోలు చేశాడు. నానోలో వెనుక భాగంలో ఇంజిన్ ఉండటం వల్ల లంబోర్ఘిని డిజైన్‌ కు దగ్గరగా మార్చేందుకు ఇది ఉపయోగపడింది. అయితే, నానోను లంబోర్ఘిని తరహాలో మార్చడం అంత సులభం కాలేదు. నానో ఎత్తుగా ఉండే చిన్న కారు. కానీ, లంబోర్ఘిని మాత్రం చాలా వెడల్పుగా, తక్కువ ఎత్తులో ఉండే స్పోర్ట్స్ కారు. అందుకే సరిన్ చాలా సార్లు డిజైన్‌లో మార్పులు చేసి చివరకు సరైన ఆకారాన్ని తీసుకొచ్చాడు.

ఈ కారును తయారు చేయడంలో పలు ఇతర కార్ల విడిభాగాలను కూడా ఉపయోగించాడు. వీల్స్‌ ను మారుతి స్విఫ్ట్, బాలెనో కార్ల నుంచి తీసుకున్నాడు. కొన్ని ఇతర భాగాలను ఆల్టో నుంచి తీసుకున్నాడు. కారు బాడీని ఫైబర్‌ తో రూపొందించాడు. హెడ్‌ ల్యాంప్‌ ల కోసం బాలెనో ప్రొజెక్టర్లను ఉపయోగించాడు. ముందు అద్దాలు, కిటికీలను యాక్రిలిక్ షీట్లతో తయారు చేశాడు. అసలు లంబోర్ఘిని లాగే ఈ కారుకు సిజర్ డోర్లు ఏర్పాటు చేశాడు. వెనుక భాగంలో పెద్ద స్పాయిలర్, ప్రత్యేకమైన టెయిల్ ల్యాంప్ డిజైన్‌ ను కూడా రూపొందించాడు. బయట నుంచి చూస్తే ఈ కారు అచ్చం లంబోర్ఘిని లాగే  ఉంటుంది. కారు లోపల హోండా సిటీ డాష్‌ బోర్డ్, స్టీరింగ్ వీల్‌ ను అమర్చాడు. సీట్లు, ఇతర భాగాలను చేతితో తయారు చేశాడు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ లో అతడు బయట డిజైన్‌ పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు.

ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో ఎక్స్ పీరియెన్స్ లేకపోయినా..   

Advertisement

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. సరిన్‌కు ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్‌ లో ఎలాంటి ఎక్స్ పీరియెన్స్ లేదు. ఈ ప్రాజెక్ట్ కోసం వెల్డింగ్, పెయింటింగ్ లాంటి టెక్నిక్స్ స్వయంగా నేర్చుకున్నాడు. ఫ్యాబ్రికేషన్ నుంచి పెయింటింగ్ వరకు దాదాపు అన్ని పనులను తన చేతులతోనే పూర్తి చేశాడు. అయితే, ఈ కారు రోడ్లపై నడపడానికి చట్టబద్ధమైనది కాదు. దీనిని కేవలం ప్రదర్శన కోసం మాత్రమే ఉపయోగించవచ్చు. ప్రైవేట్ ప్రదేశాల్లో,  కార్ షోలలో ప్రదర్శించడానికి అనుమతి ఉంటుంది. షోలకు తీసుకెళ్లాలంటే ప్రత్యేక వాహనంపై తరలించాల్సి ఉంటుంది. ఒక సాధారణ టాటా నానోను లంబోర్ఘినిగా మార్చిన సరిన్ ప్రతిభ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి ప్రశంసలు అందుకుంటోంది. పట్టుదల, సృజనాత్మకత ఉంటే అసాధ్యమేమీ లేదని ఈ యువకుడు మరోసారి నిరూపించాడు.

Read Also: 100 మందికి ఫ్రీగా రాంగ్లర్ కార్లు.. ఫిఫా వరల్డ్ కప్ వేళ జీప్ సంచలన ప్రకటన!

Related News

కొనుగోలుదారులకు టీవీఎస్ షాక్.. ఐక్యూబ్ సహా పలు స్కూటర్ల ధరలు భారీగా పెంపు!

ఇదేందయ్యా ఇది.. స్కూటీ రేటు రూ.లక్ష.. పెండింగ్ చలాన్లు మాత్రం రూ.10 లక్షలు!

కొత్త స్కార్పియో-N వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

టాటా ఎలక్ట్రిక్ కార్లపై సూపర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.3.35 లక్షల తగ్గింపు!

టాటా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై కళ్లు చెదిరే తగ్గింపు!

భారత్‌లో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్లు లాంచ్.. ఇప్పుడు మేడ్ ఇండియా వెర్షన్ లో!

దేశంలో బెస్ట్ 5 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు.. మైలేజీ, ఫీచర్లలో టాప్ మోడల్స్ ఇవే!

భారత్‌ లో ఈవీ స్కూటర్ల అమ్మకాల జోరు, నెంబర్ వన్ ఏదంటే?

Big Stories

Advertisement
×