BigTV English

Etela Rajender: ఈటెల ఆశ నిరాశే..? బండికే ఢిల్లీ పెద్దలు జై

Etela Rajender: ఈటెల ఆశ నిరాశే..? బండికే ఢిల్లీ పెద్దలు జై

Etela Rajender: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం కసరత్తు తుది దశకు చేరుకుందంటున్నారు. పాత కొత్త వివాదంతో చాలా రోజులుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎంపిక వాయిదా పడుతూ వచ్చింది. రేసులో పలువురు సీనియర్లు ఉన్నప్పటికీ బీజేపీ అధిష్టానం మాత్రం మళ్లీ పాత నేతకే అధ్యక్ష పగ్గాలు అప్పజెప్పాలని నిర్ణయించుకుందంట. ఆనేత అధ్యక్ష పదవి తనుకు వద్దని పైకి చెబుతున్నప్పటికీ .. అనుచర వర్గం వద్ద మాత్రం బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారంట. ఇంతకీ ఎవరా నేత? అసలు ఢిల్లీ పెద్దల మనసులో ఏముంది.


తెలంగాణ నూతన బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్?

ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే పాలసీ బీజేపీలో ఉంది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండటంలో బీజేపీ అధ్యక్షుడిగా వేరొకరిని నియమిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పలువరు బిజెపి నేతలు అధ్యక్ష పదవి కోసం అధిష్టానం పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు.


రేసులో ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్, డీకే అరుణ

పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ పదవి ఆశిస్తున్న వారిలో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ముందు వరుసలో ఉన్నారు. కానీ వీరిలో ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావులకు పాత కొత్త ఈక్వేషన్లు అడ్డంకిగా మారాయంట. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి అధ్యక్ష పగ్గాలు ఇవ్వొద్దని, మొదటి నుంచి బిజెపి పార్టీ కోసం పనిచేసిన వారినే అధ్యక్షుడ్ని చేయాలని ఆర్ఎస్ఎస్ నేతలు, బీజేపీ సీనియర్లు ముందు నుంచి పట్టుపడుతున్నారు. ఆ విషయంపై రాష్ట్ర సీనియర్ నేతలు అధిష్టానంపై తీవ్ర వత్తిడి తెస్తున్నారంట.

సీనియర్ల వాదనపై ఈటల రాజేందర్ అసంతృప్తి

బీజేపీ సీనియర్ల వాదనపై ఈటల రాజేందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట. పాత, కొత్త కాకుండా తన రాజకీయ అనుభవం, మంత్రిగా పనిచేసిన అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందని అంటున్నారంట. అధిష్టానం పెద్దల్లో కూడా కొందరు ఈటల రాజేందర్ విషయంలో సముఖంగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సీనియర్లు, సంఘ్ పరివారుల వత్తిడే వారిపై పనిచేస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆ క్రమంలో ఢిల్లీ బాస్‌ల నిర్ణయం కోసం ఈటల శిబిరం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

అధ్యక్ష పదవిపై సుముఖంగా ఉన్న బండి సంజయ్

మళ్లీ పాత అధ్యక్షుడికే తెలంగాణ బిజెపి పగ్గాలు కట్టబెడతారన్న ప్రచారంతో.. బండి సంజయ్ పేరు తెరమీదకు మీదకు వస్తుంది. అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు బండి సంజయ్ పైకి విముఖంగా ఉన్నప్పటికీ అంతర్గతంగా అనుచర వర్గం వద్ద సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో తెలంగాణలో బిజెపి పార్టీని బలోపేతం చేయడంలో బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి బండి సంజయ్ పార్టీని బలోపేతం చేశారు.

బండి సంజయ్ యాత్రకు ప్రధాని మోడీ ప్రశంసలు

బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రశంసించారు. ఢిల్లీలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో బండి సంజయ్‌ని ప్రత్యేకంగా అభినందించారు. అందరూ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను నమూనాగా తీసుకొని పార్టీ బలోపేతానికి కార్యక్రమాలు చేపట్టాలంటూ పార్టీ నేతలకు మోడీ సూచించారు. బండి సంజయ్ తెలంగాణ అధ్యక్ష పగ్గాలు చేపట్టి ప్రజా సంగ్రామ యాత్ర చేసిన తర్వాత పూర్తిగా తెలంగాణలో బిజెపి పరిస్థితి మారిందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైన బీజేపీ

తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో బిజెపి పరిస్థితి బిఫోర్ బండి సంజయ్.. ఆఫ్టర్ బండి సంజయ్ అనే టాక్ కూడా వినిపించింది. పార్టీ బలోపేతానికి బండి సంజయ్ అంతలా పని చేశారని బిజెపి నేతలు చెప్తున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల బిజెపి అధ్యక్ష మార్పు గతంలో అనివార్యమైంది. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమతమైన బీజేపీ .. లోక్‌సభ ఎన్నికల్లోనూ పెట్టుకున్న టార్గెట్ ప్రకారం డబుల్ డిజిట్ సీట్లు సాధించలేకపోయిందన్న అభిప్రాయంతో ఉన్నారంట బీజేపీ పెద్దలు.

Also read: సీఎంతో భేటీ రచ్చ రచ్చ.. అసలు ప్లాన్ ఇదేనా?

స్థానిక సంస్థల ఎన్నికలు దృష్ట్యా ఫోకస్ అవుతున్న బండి పేరు

అందుకే స్థానిక సంస్థల్లో సత్తా చాటుకుని రూట్ లెవల్‌ నుంచి పార్టీకి బేస్ ఏర్పాటు చేసుకోవడానికి తిరిగి బండి సంజయ్‌నే అధ్యక్షుడ్ని చేయాలని భావిస్తున్నారంట. మళ్లీ ఇప్పుడు బండి సంజయ్‌కే అధ్యక్ష పగ్గాలు కట్టబెడతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. దానిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందా ఆయన అనుచర వర్గం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఒకవేళ బండి సంజయ్ కు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే మరి ఈటల రాజేందర్ పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది.

ఈటెల రాజేందర్‌ని ఎలా సంతృప్తి పరుస్తారు?

ఒకవేళ బండి సంజయ్ ను తెలంగాణ బిజెపి రథసారధిగా నియమిస్తే అసంతృప్తితో ఉన్న ఈటల రాజేందర్‌ను బిజెపి అధిష్టానం ఏ విధంగా సంతృప్తి పరుస్తుందన్న చర్చ నడుస్తోంది. ఒక వ్యక్తి ఒకే పదవి పాలసీని బండి సంజయ్ విషయంలో కూడా అమలు చేస్తే.. ఆయన స్థానంలో ఈటల రాజేందర్‌ను కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఢిల్లీ పెద్దలకు పెద్ద పరీక్షే పెట్టినట్లు కనిపిస్తోందంటున్నారు

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×