IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ పూర్తికాగా… ఇవాళ డబుల్ ధమాకా ఉండనుంది. ఆదివారం కావడంతో ఇవాళ రెండు మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. ఇందులో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals ) మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య రెండో మ్యాచ్ ఉంటుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది.
Also Read: Virat Kohli: గ్రౌండ్ లోకి దూసుకు వచ్చిన ఫ్యాన్.. కోహ్లీ కాళ్లపై పడి !
ఉప్పల్ లో SRH మాస్ జాతర
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో తొలి మ్యాచ్ ఆడబోతుంది. హైదరాబాదులోని ఉప్పల్ వేదికగా.. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఉప్పల్ మ్యాచ్ నేపథ్యంలో దాదాపు 2500 మంది పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. కట్టిన చర్యలు తీసుకుంటున్నారు. ఉప్పల్ స్టేడియానికి అభిమానులు వచ్చేలా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు అలాగే మెట్రో సదుపాయాన్ని కల్పించారు.
చెన్నై వర్సెస్ ముంబై ఫైట్
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై మధ్య ఇవాళ సాయంత్రం మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో…. సాయంత్రం 7:30 గంటలకు చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ రెండు జట్లకు ఇదే. ఆదివారం కావడంతో ఈ మ్యాచ్కు విపరీతంగా అభిమానులు రాబోతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన లైవ్ మ్యాచ్లు జియో హాట్ స్టార్ లో ఉచితంగా మనం చూడవచ్చు. అలాగే… స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్లు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా…. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా రైడర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీ అలాగే సాల్ట్ ఇద్దరు అద్భుతంగా రాణించడంతో… మ్యాచ్ గెలిచింది బెంగుళూరు.
Also Read: KKR VS RCB: దుమ్ములేపిన కోహ్లీ, సాల్ట్… RCB ఫస్ట్ విక్టరీ
SRH VS RR TEAMS:
రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ XII: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, శుభమ్ దూబే, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్‌హక్ ఫరూఖీ
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ XII: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, సచిన్ బేబీ/అనికేత్ వర్మ, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, మహమ్మద్ షమీ, రాహుల్ చాహర్/జయ్‌దేవ్ ఉనద్కత్