BigTV English
Advertisement

Rahul Gandhi in parliament : అప్పుడు హగ్.. ఇప్పుడు కిస్.. అట్లుంటది రాహుల్‌తోని..

Rahul Gandhi in parliament : అప్పుడు హగ్.. ఇప్పుడు కిస్.. అట్లుంటది రాహుల్‌తోని..

Rahul Gandhi kiss Smriti Irani(Parliament session live today):

రాహుల్ గాంధీ బాగా రాటు దేలారు. డైనమిక్ పాలిటిక్స్ చేస్తున్నారు. భారత్ జోడో యాత్రతో ఇప్పటికే దేశ్‌కీ నేతా అయ్యారు. సామాన్యులతో కలిసిపోతూ.. అసలుసిసలు సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటే ఏంటో తెలియజేస్తున్నారు. ఎంపీగా వేటు పడినా అదరలేదు బెదరలేదు. న్యాయపోరాటంతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా.. పదునైన విమర్శలతో చెలరేగిపోయారు రాహుల్ గాంధీ.


అమూల్ బేబీ అని విమర్శించిన నోళ్లే.. ఇప్పుడు రాహుల్ నోటికి భయపడుతున్నాయి. మోదీకే షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చే రేంజ్‌కు ఎదిగారు. గతంలో నిండు సభలో ప్రధాని మోదీని హగ్ చేసుకుని.. ఆయన బిత్తరపోయేలా చేశారు. రాహుల్ ఇచ్చిన హగ్ నుంచి తేరుకోవడానికి మోదీకి కొన్ని నిమిషాలు పట్టింది. అంతసేపూ ఆయన మైండ్ బ్లాంక్. రాహుల్ ప్రేమతో ఇచ్చిన హగ్‌నూ రిసీవ్ చేసుకోలేక.. తప్పుబట్టి తన చిన్నమనసును చాటుకున్నారు ప్రధాని మోదీ. ఇంకో సందర్భంలో పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ కన్ను కొట్టడమూ ఆసక్తికరంగా మారింది.

కట్ చేస్తే.. లోక్‌సభలో రాహుల్ మరోసారి మేజిక్ చేశారు. ఈసారి కూడా మాటలతో, చేతలతో. మణిపూర్ ఇష్యూపై అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా.. మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారని.. అయినా మోదీ మౌనం వీడటంలేదని.. ఒక్కసారి కూడా మణిపూర్ వెళ్లలేదంటూ.. రావణాసురుడితో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలే చేశారు రాహుల్. అక్కడితో అయిపోలేదు. గతంలో సభలో ప్రధాని మోదీకి హగ్‌తో షాక్‌ ఇస్తే.. ఈసారి ప్రేమతో ఫ్లయింగ్ కిస్ ఇచ్చి కిరాక్ లేపారు రాహుల్ గాంధీ.


అయితే, గతంలో మాదిరి మళ్లీ కాంట్రవర్సీ స్టార్ట్ చేసింది బీజేపీ. రాహుల్ గాంధీ తనకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ స్మృతి ఇరానీ ఆరోపించారు. సహచర బీజేపీ మహిళా ఎంపీలతో కలిసి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇది అసభ్యకరమైందని.. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని.. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే, లోక్‌సభ ఫూటేజ్‌ ఇదేనంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. అది చూస్తే అసలేం జరిగిందో తెలిసిపోతోంది. రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్టు అందులో కనిపిస్తోంది. అయితే.. ఆయన మరో వైపు చూస్తూ కిస్ ఇచ్చినట్టు ఉంది. ఆ సమయంలో స్మృతి ఇరానీ రాహుల్‌కు ఎదురుగా లేరు.. దూరంగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అంటే, కావాలనే రాహుల్‌ను బద్నామ్ చేసేలా బీజేపీ బ్లేమ్ గేమ్ ఆడుతోందనే విమర్శ వినిపిస్తోంది. ఏదిఏమైనా.. అప్పట్లో హగ్‌తో.. ఇప్పుడు ఫ్లయింగ్ కిస్‌తో రాహుల్ గాంధీ సభలో కాక రేపారు. అట్లుంటది రాహుల్‌తోని.

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Big Stories

×