E-Paper
Advertisement

MLA Raja Singh: కష్టమేనా? రాజాసింగ్ కథ రివర్స్..

MLA Raja Singh: కష్టమేనా? రాజాసింగ్ కథ రివర్స్..

MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తిరిగి బీజేపీలోకి వస్తున్నారా?…. కమలం పార్టీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్ రీఎంట్రీకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. అసలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రాజాసింగ్ మళ్లీ ఎందుకు బీజేపీ వైపు చూస్తున్నారు? బయట రాజకీయ భవిష్యత్తు లేకనే తిరిగి సొంత గూటికి చేరాలనుకుంటున్నారా? అసలు రాజాసింగ్ అడుగులు కలమం వైపు ఎందుకు పడుతున్నాయనేది హాట్ టాపిక్‌గా మారింది.

తిరిగి బీజేపీలోకి రావడానికి రాజాసింగ్ ప్రయత్నాలు
రాజాసింగ్ మళ్ళీ బీజేపీలోకి రావాలని తెగ ప్రయత్నం చేస్తున్నారట.. పార్టీకి రాజీనామా పత్రాన్ని ఇచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్ళీ ఎందుకు తిరిగి రావాలనుకుంటున్నారు అన్నదానిపై హాట్‌హాట్ చర్చలు జుగుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో హిందుత్వవాదనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తిరిగి కమలం పార్టీలో చేరేందుకు రంగం చేసుకుంటున్నట్లు బీజేపీతో పాటు, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోందట. గతంలో కిషన్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేసిన రాజాసింగ్ తాజాగా పార్టీలో చేరుతానని పరోక్ష సంకేతాలు ఇస్తున్నారట. అదే జరిగితే రాజాసింగ్ ను ఆహ్వానిస్తారా?.. లేదా?.. పార్టీలోకి వస్తే నేతలు కలుపుకుని వెళ్తారా? అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న మారింది.

ఈ ఏడాది జూన్ 30న రాజీనామా చేసిన రాజాసింగ్
ఈ ఏడాది జూన్ 30న పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ బీజేపీకి దూరంగా ఉంటూనే.. బీజేపీ నాయకత్వంపై విమర్శలు సంధిస్తున్నారు. అయితే తాజాగా ఆయన తిరిగి సొంత గూటికి చేరబోతున్నట్లు పరోక్ష సంకేతాలు ఇస్తుండటం ఇటు పార్టీలో.. అటు పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, పార్టీలో రాజాసింగ్‌కు సరైన గుర్తింపు…గౌరవం లభించడం లేదనే అసంతృప్తి ఆయనను పార్టికి దూరం చేసిందన్న అభిప్రాయం ఉంది. పార్టీలో కొంతమంది కీలక నేతల పెత్తనం.. ఆజామాయిషీ తనను పార్టీ నుంచి వెళ్లగొట్టేలా చేసిందని రాజసింగ్ అసహనంతో ఉన్నారు. అయితే ఆయనకున్న హిందుత్వ అజెండాతో పాటు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీ అండ లేకపోతే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని రాజాసింగ్ భావిస్తున్నారంట.

కాషాయ పార్టీనే ఏకైక ఆప్షన్‌గా కనిపిస్తుందా?
అందులో భాగంగానే రాజాసింగ్ తిరిగి మళ్ళీ బీజేపీ వైపుకే మొగ్గు చూపుతున్నట్టు ఆయన అనుచరులు అంటున్నారు, అంతేకాదు ఏ పార్టీలోకి వెళ్లాలని అనుకున్నా ప్రస్తుతం ఏ పార్టీలు కూడా హిందుత్వ అజెండాకు ప్రాధాన్యత ఇవ్వకపోతుండటం ఆయనకు ఇబ్బందికరంగా మారిందట. దీంతో రాజాసింగ్‌కు ప్రస్తుతం బీజేపీలో మాత్రమే ఏకైక అప్షన్‌గా మారిందంట. ఏ ఫ్లాట్ ఫారం మీద ఆయన రాజకీయ భవిష్యత్తు లేకపోవడంతో బీజేపీ వైపు చూస్తున్నట్టుగా చర్చ జరుగుతోందట.

పార్టీ నేతలు అమ్ముడుపోయారని ఘాటైన విమర్శ
గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో రాజాసింగ్‌కు ఉన్న విభేదాలు రచ్చ రేపాయి.. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై, ముఖ్యంగా కిషన్ రెడ్డిపై రాజాసింగ్ బహిరంగంగానే ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కాకపోవడానికి నేతలే కారణమని.. పార్టీ అధికారంలోకి రాకుండా నేతలు అమ్ముడు పోతారని కాంట్రవర్సీ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. టేబుల్ తుడిచే వారికే పదవులనీ..రబ్బర్ స్టాంప్ లని తీవ్ర విమర్శలు చేశారు, అలాంటి రాజాసింగ్ ఇప్పుడు తిరిగి బీజేపీ వైపు ఎందుకు చూస్తున్నట్లు అనేది పార్టీ నేతల్లో చర్చకు దారితీస్తుందట. మారిన సమీకరణాల ఎఫెక్టా?.. కారణం ఇంకేదైనా ఉందా?.. లేక బయట భవిష్యత్తు లేకా.. బీజేపీ లేకపోతే తన రాజకీయ ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పడుతుందనే భావన రాజాసింగ్‌లో వచ్చిందా? అన్నప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఏమైందో ఏమో కానీ పార్టీలో చేరాలని.. పాత విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని రాజాసింగ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధిష్టానం పిలుస్తుందని ఆశతో ఆయన ఉన్నారట. జాతీయ నేతలతో చర్చించి అధికారికంగా పార్టీలోకి వస్తాననే పరోక్ష సంకేతాలు ఇస్తున్నారట. రాజాసింగ్ లాంటి మాస్ హిందుత్వ ఫాలోయింగ్ ఉన్న నేత పార్టీలోకి రావడం బీజేపీకి పాజిటివ్‌గా ఉన్నప్పటికీ, రాజాసింగ్ దూకుడు స్వభావం.. క్రమశిక్షణారాహిత్యం, నోటికిదొస్తే ఆది మాట్లాడటం వంటి అంశాలు పార్టీ పెద్దలను ఆందోళనకు గురిచేస్తుందట.. వార్నింగ్ లిచ్చిన కిషన్ రెడ్డి సహా ఇతర కీలక నేతలు రాజాసింగ్ ను ఎంతవరకు కలుపుకుపోతారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

రాష్ట్రంలో బలపడాలని చూస్తున్న బీజేపీకి.. రాజాసింగ్ వంటి ఫైర్ బ్రాండ్ నేత అవసరం ఉందని ఒక పార్టీలో ఒక వర్గంలో చెబుతుంటే.. మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చర్చ జరుగుతోందట. పాజిటివ్, నెగెటివ్ వ్యతిరేకతల మధ్య రాజాసింగ్ అనుకున్నట్లుగా హైకమాండ్ ఆయనకు డోర్లు తెరుస్తుందా.. అనేది కూడా ప్రశ్నార్థకమే. ఒకవేళ తెరిచినా రాష్ట్ర పార్టీలో పంచాయతీలు మరింత పిక్ స్టేజీకి చేరే అవకాశం ఉన్నట్టు టాక్ నడుస్తోంది. ఎందుకంటే గతంలో రాజాసింగ్ ను పార్టీ సస్పెండ్ చేసింది. మళ్లీ ఎన్నికలకు ముందు ఆయన పార్టీలోకి చేరారు. ఆపై మళ్లీ సొంత పార్టీపై విమర్శలు చేసి రాజీనామా చేశారు. ఒక వేళ హైకమాండ్ ఆయన్ను స్వాగతించినా.. రాష్ట్ర నాయకత్వం ఆయన్ను ఆహ్వానిస్తుందా….అక్కున చేర్చుకుంటుందా.. నేతలు ఆయన్ను కలుపుకుని వెళ్తారా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ ఘటన.. వృద్ధురాలు బలి

అంతేకాదు ఒకవేళ రాజాసింగ్ అధికారికంగా కమలం తీర్థం పుచ్చుకుంటే తెలంగాణ బీజేపీలో కొత్త సమీకరణాలతో, కొత్త పంచాయితీలు మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే పార్టీలోకి చేర్చుకున్నాక రాజాసింగ్ కోరుకుంటున్న స్వేచ్ఛ ఏ మాత్రం ఉండదని..గతంలో కన్నా ఇంకా ధారణంగా ఆయనకు ఇచ్చే విలువ తగ్గుతుందన్న చర్చ సైతం నడుస్తోంది. అదే జరిగితే రాజాసింగ్ కామ్‌గా ఉండే టైప్ కాదు. మొత్తమీద పార్టీ ఒక కుటుంబమని, ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉండి, అందులో ఒకరు గొడవపడి బయటకు వెళ్లిపోతే.. కాస్త ముందో , వెనకో అయిన ఇంటికి తిరిగి వెళ్లాల్సిందే అంటూ రాజాసింగ్ చేసిన కామెంట్లను రాష్ట్ర పార్టీ యాక్సెప్ట్ చేస్తుందా.. లేదా అన్నది అటుంచితే, అధిష్టానం నుంచి రాజాసింగ్ కు పిలుపు వస్తుందా..? లేకపోతే ఆ పిలుపును కూడా రాజసింగ్ కు రాకుండా రాష్ట్ర నేతలు అడ్డుకుంటారా..? అన్నది చూడాలి.

Story By Ajay Kumar, Bigtv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×