E-Paper
Advertisement

Vangaveeti Mohana Ranga: ఆ పార్టీలోకి వంగవీటి కూతురు

Vangaveeti Mohana Ranga: ఆ పార్టీలోకి వంగవీటి కూతురు
Advertisement

Vangaveeti Mohana Ranga:  రంగా కుటుంబం నుంచి పాలిటిక్స్ లోకి మరొకరి ఎంట్రీ. ఎస్.. మీరు విన్నది నిజమే. రాష్ట్రమే కాదు.. దేశ రాజకీయాల్లో బెజవాడ అంటే గుర్తుకువచ్చే పేరు వంగవీటి రంగా. ప్రజెంట్ ఆ ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లో అంతలా యాక్టివ్ గా ఎవరూ లేరు. అందుకు కారణం ఏంటి.. త్వరలో పొలిటికల్ జర్నీ ఫ్లైట్ ఎక్కనున్నది ఎవరు? అనేది ఆసక్తిగా మారింది.

ప్రజాజీవితంలోకి రంగా కుమార్తె ఆశాకిరణ్‌

నాలుగు దశాబ్దాలు గడుస్తున్నా… వంగవీటి మోహనరంగా పేరు ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్రగా ఉంది. ఆయన అభిమాన బలం దేశ విదేశాల్లోనూ విస్తరించి ఉంది. అయితే, రంగా కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారు మాత్రం స్థిరమైన విజయాన్ని అందుకోలేకపోయారనే చర్చ ఎప్పుడూ ఉంటుంది. ఈ నేపథ్యంలో, రంగా కుమార్తె ఆశాకిరణ్ ప్రజాజీవితంలోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సోదరుడు రాధా ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్న సమయంలో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం వెనుక బలమైన రాజకీయ ప్రణాళిక దాగి ఉందా? ఆమె అడుగులు ఏ పార్టీ వైపు మళ్లబోతున్నాయి? ముఖ్య నాయకులతో ఆమె భేటీ వెనుక ఉన్న వ్యూహాత్మకత ఏంటనేది ఆలోచించాల్సి విషయం.

రంగా పేరుతో పలు పార్టీల లబ్ది

Advertisement

వంగవీటి మోహనరంగా మరణించిన తర్వాత ఆయన భార్య రత్నకుమారి, ఆ తర్వాత కుమారుడు రాధా రాజకీయాల్లోకి వచ్చి తమ ఉనికిని చాటుకున్నారు. అయితే, రంగా పేరుతో వివిధ రాజకీయ పార్టీలు లబ్ది పొందాయి తప్ప, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం పెద్దగా రాజకీయంగా స్థిరపడలేకపోయారనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో, లేటెస్ట్‌గా వంగవీటి కుటుంబం నుంచి మరో కీలక వ్యక్తి… రంగా కుమార్తె ఆశాకిరణ్ ప్రజాజీవితంలోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. ప్రజా సమస్యలపై తన తండ్రి స్పందించిన తరహాలోనే ఇకపై తాను కూడా స్పందిస్తానని, సమాజ సేవ చేయడానికి ముందుంటానని ఆశాకిరణ్ ప్రకటించారు.

ఏ పార్టీలో చేరకపోయినా ప్రజాజీవితంలోనే

సోదరుడు రాధాతో తనకు ఎలాంటి విభేదాలు లేవు.. ప్రస్తుతానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా …ఏ పార్టీలో చేరకపోయినా తాను ప్రజా జీవితంలోనే ఉన్నానంటూ ఆశాకిరణ్ ప్రకటించటం ఆమె పక్కా పొలిటికల్ ప్రణాళికతోనే వున్నారనే చర్చ జరుగుతుందట. విజయవాడలో వంగవీటి మోహనరంగా విగ్రహానికి ఘన నివాళి అర్పించిన ఆమె పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాల్లో జరుగుతున్న కాపు వనసమారాధనల్లో పాల్గొన్నారు. ఇక్కడ వంగవీటి రాధా ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్‌గా ఉండటం కూడా ఆశాకిరణ్ కు కలిసొస్తున్న అంశంగా కనిపిస్తుందనే టాక్ నడుస్తోందట. ఇప్పటికే ఆమె కాపు నాయకులు, రాజకీయ కురువృద్దులు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యను కలిశారు. ఇది ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.

రాధాకు చెక్‌ పెట్టడమే ప్లానా?

Advertisement

ఆశాకిరణ్ సోదరుడు యాక్టివ్ పాలిటిక్స్‌లో లేకపోయినా.. తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మరో వైపు రాధా రంగా మిత్రమండలి అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర వైసీపీ పార్టీలో ఉండటంతో రాధాకు చెక్ పెట్టేందుకు రంగా తనయురాలు ఆశాకిరణ్ ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకు వచ్చేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుందట. రంగా అభిమానులని ఏకం చేయడం… రాధా రంగా మిత్రమండలిని బలోపేతం చేయడం తన లక్ష్యమని చెబుతున్న ఆశాకిరణ్…తన భవిష్యత్ కార్యచరణ ఏంటో ఫిక్స్ అయ్యానే టాక్ నడుస్తోందట. రాజకీయంగా యాక్టివ్‌ అవుతానని ఆశకిరణ్‌ ప్రకటించడంతో ఆమె ఏ పార్టీలో చేరుతారు అన్నది అపుడే చర్చకు తావిస్తోంది. ఆమె జనసేనలో చేరుతారు అని ఒక వైపు ప్రచారంలో ఉంటే ఆమె వైసీపీలో చేరుతారు అని మరో వైపు ప్రచారంలో ఉంది. అయితే రాజకీయాల గురించి ఇపుడే చెప్పేది లేదని ఆమె అన్నారు. తాను ప్రస్తుతం మిత్ర మండలి తరఫునే పనిచేస్తాను అన్నారు. రాజకీయంగా ఏది ఏమైనా రంగా కుమార్తె ఇక ఫుల్ టైం ప్రజా సేవలో ఉంటాను అని చెప్పడం అయితే ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద చర్చకు తావిస్తోందట.

మిత్ర మండలి తరపునే పనిచేస్తానని స్టేట్‌మెంట్‌

వంగవీటి రంగా మరణించి మూడు దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆయన పేరు విజయవాడ రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. అన్ని పార్టీల్లోనూ రంగాకు అభిమానులు ఉన్నారు. దీంతో ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీ బెజవాడ పాలిటిక్స్‌లో ఎలాంటి ప్రభావం చూపనుందనే చర్చ మొదలైంది. మరోవైపు రాధారంగా మిత్రమండలి సలహా మేరకు నిర్ణయం తన నిర్ణయాలు ఉంటాయని.. వారు సూచించిన పార్టీలో చేరుతానని ఆశాకిరణ్ చెప్పారు. దీంతో ఆమె అడుగులు ఏ రాజకీయ పార్టీ వైపు ఉండబోతున్నాయనే దానిపైనా ఆసక్తి నెలకొంది.

Story by Venkatesh, Big Tv

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×