Bigg Boss 9 Telugu Day 71 : బిగ్ బాస్ సీజన్ 9లో ఎప్పుడూ లేనంతగా ఈ వారం నామినేషన్ల హీటు నడిచింది. క్లోజ్ గా ఉన్నారనుకున్న వాళ్ళే ఒకరిపై ఒకరు నామినేషన్లు వేసుకుని, నమ్మిన వాళ్లకే కాదు ఆడియన్స్ కు కూడా షాక్ ఇచ్చారు. ఇంతకీ ఈ వారం ఎవరు ఎవరిని నామినేట్ చేశారో ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం పదండి.
ఎపిసోడ్ మొదట్లోనే కళ్యాణ్ వల్ల రీతూ, డెమోన్ గొడవ పడ్డారు. 11వ వారం నామినేషన్లను కెప్టెన్ చేతిలో పెట్టారు బిగ్ బాస్. 1, 2 నెంబర్స్ ఉన్న టోకెన్స్ లో ఇచ్చి, ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలన్నది కెప్టెన్ తనూజా నిర్ణయించింది. ఇమ్మాన్యుయేల్ 2 టోకెన్స్ ఇవ్వగా… అతను రీతూని గతవారం కెప్టెన్సీ టాస్క్ లో కన్ఫ్యూజ్ అయ్యావని, కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నావని, గేమ్స్ పరంగా ఎక్కడో వెనకబడిపోయావని నామినేట్ చేశాడు. ‘మరి నువ్వు ఎప్పుడూ కన్ఫ్యూజ్ కాలేదా ఇమ్మూ? నీవల్లే కదా బెలూన్ టాస్క్ లో ఫౌల్ గేమ్ అయ్యింది? నువ్వు అంతబాగా గేమ్ ఆడితే బొమ్మను తీసి మీ మమ్మీకి ఇచ్చి ఉండాల్సింది” అని సూటిగా ప్రశ్నించింది రీతూ. “నువ్వు డెమోన్ బొమ్మ ముట్టుకుంటావా?” అంటూ ఫైర్ అయ్యాడు ఇమ్మూ. తరువాత “భరణి అన్న ఇంతకు ముందు పెట్టినంత ఎఫర్ట్స్ ఇప్పుడు పెట్టట్లేదు అనిపిస్తుంది” అంటూ రెండో నామినేషన్ వేశాడు ఇమ్మూ. “నాకు తగిలిన దెబ్బ నీకు తగిలి ఉంటే నువ్వు ఆడగలవా? పర్ఫార్మెన్స్ అంటే టాస్క్ ఒక్కటే కాదు. 360 డిగ్రీస్ వస్తుంది. ప్రతీ గేమ్ లో నాకు కుదిరినంత వరకు ఎఫర్ట్స్ పెట్టాను” అని చెప్పాడు భరణి. “నాకు కన్పించలేదు అన్నా” అంటూ భరణి కుండ బద్దలు కొట్టాడు ఇమ్ము.
డెమోన్ రీతూను నామినేట్ చేశాడు. “నువ్వు అరవడం వల్ల నా తప్పు లేకపోయినా నాదే తప్పు అని పోట్రెయిట్ అవుతోంది. ప్రతీసారి ఆమె తప్పు లేదు అని నేను స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేస్తే, ట్రస్ట్ లేదు అని చాలా హర్ట్ చేశావ్. ప్రతీసారి నేను నీ మంచే కోరుకున్నా. చాలా బాధ పడుతున్నా” అని ఏడుస్తూ రీతూ కుండ బద్దలు కొట్టాడు. దీంతో రీతూ హార్ట్ కూడా బ్రేక్ అయ్యింది. తరువాత వెళ్ళి రీతూతో అతను మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ “నాతో మాట్లాడొద్దు. నావల్ల అవ్వట్లేదు” అని ఏడుస్తూ గట్టిగా అరిచింది. ఈసారి డెమోన్ కూడా తగ్గకుండా “నావల్ల కూడా అవ్వట్లేదు” అని ఇంకా గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత ‘రీతూ నేను బ్యాక్ స్టాబ్ చేశామని సాయి అన్నప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు?’ అని కళ్యాణ్ ను నామినేట్ చేశాడు.
ఇక భరణి “ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్… టెడ్డి టాస్క్ లో ప్రతీ రౌండ్ లో నువ్వు నాకంటే వెనకాలే ఉన్నావు” అంటూ మొదలుపెట్టాడు. “అంటే నీ ఆరోగ్యం బాగున్నట్టే కదా” అని ఇమ్మూ లాజిక్ లాగాడు. కానీ భరణి “నా పాయింట్ చెప్పనివ్వు. అనారోగ్యం నా మైండ్ కి కాదు శరీరానికి” అని ఫైర్ అవుతూ ఇమ్మూపై రివేంజ్ నామినేషన్ వేశాడు. అలాగే “ఫెయిల్డ్ సంచాలక్” అంటూ రీతూని నామినేట్ చేశాడు భరణి.
తర్వాత కళ్యాణ్ “నా నుంచి నీకు రావలసిన సపోర్ట్ రావట్లేదు అన్నావ్. తనూజాను అడుగు ఏం చెప్పానో. పట్టుకున్నట్టు ఊహించుకుని, అలా అనడం ఆమెదే తప్పు అని నేను ఇప్పుడు చెప్తున్నాను. సాయితో నేను బ్యాక్ స్టాబ్ అనే మాటే అనలేదు” అని డెమోన్ కు క్లారిటీ ఇస్తూ నామినేట్ చేశాడు. రీతూ “నా గేమ్ ను తక్కువ చేసి మాటాడావు. నీవల్ల నా కాన్ఫిడెన్స్ తగ్గుతుంది” అని దివ్యను నామినేట్ చేసింది. “కత్తి పట్టుకోవడం చేతకాలేదు. గేమ్స్ గురించి నువ్వేం మాట్లాడతావు. ఫీల్ అయితే చేశావ్ కదా నామినేషన్” అని ఇచ్చిపడేసింది దివ్య. అలాగే “మైండ్ లెస్ అనడానికి మీరెవరు?” అంటూ సంజనాను నామినేట్ చేసింది రీతూ. తరువాత దివ్య రీతూపై రివేంజ్ నామినేషన్ వేసింది. ఇక సుమన్ శెట్టి కెప్టెన్సీ టాస్క్ లో స్ట్రెయిట్ గా టవర్ పెడితే ఇస్తాను అని చెపలేదు అంటూ కళ్యాణ్ ను నామినేట్ చేశాడు. సంజన వీకెండ్ ఎపిసోడ్ లో ముంచినందుకు, ఫ్యామిలీ వీక్ పోయినందుకు కళ్యాణ్ ను నామినేట్ చేసింది. ఇక చివరగా కెప్టెన్ పవర్ తో తనూజా రీతూని సేవ్ చేసింది. ఈ వారం నామినేషన్లలో డెమోన్, కళ్యాణ్, భరణి, సంజన, ఇమ్మూ, దివ్య ఉన్నారు.
Read Also : ఇంటర్నెట్ సెన్సేషన్ గిరిజ ఓక్ నటించిన ఈ సినిమా చూశారా ? తెలుగులోనూ అందుబాటులో