Kaleshwaram Project: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఒకే ఒక్క ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నాయి. అదే… కాళేశ్వరం. నవంబర్ నెలాఖరులో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై రెండు రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతోతుందిమరి ఈ సభకు బీఆర్ఎస్ నేతలు వస్తారా? వస్తే ఎలాంటి సమాధానం చెప్తారు? అసలు ఈ ప్రత్యేక అసెంబ్లీ ద్వారా కాంగ్రెస్ ఏం నిరూపించాలనుకుంటోంది? బీఆర్ఎస్ కౌంటర్ ఏంటి? అసలు కాళేశ్వరం కథ ఏంటి? వ్యథ ఏంటి? తెలుసుకుందాం
కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు కట్టారు?
అసలు కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు కట్టారు? అంటే తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిజైన్ చేసిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీ-డిజైన్ చేసి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టారు . దీని అంచనా వ్యయం మెదట80 వేల కోట్లుగాప్రాంభమై, చివరకు ఒక లక్ష కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మాణం పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం ఏంటంటే… గోదావరి నది నుంచి వచ్చే నీటిని వివిధ దశల్లో ఎత్తిపోస్తూ, తెలంగాణలోని 13 జిల్లాల్లో దాదాపు 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడం. దాంతో పాటు మరో 18 లక్షల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించడం.
ఊహించని ఒక పెద్ద షాక్..
అంతా బాగుందనుకుంటున్న సమయంలో… అక్టోబర్ 2023లో ఒక పెద్ద ఊహించని షాక్ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెలాంటి మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీలోని 7వ బ్లాక్‌లో పిల్లర్లు ఒక్కసారిగా కుంగిపోయాయి. ఈ ప్రమాదంతో ప్రాజెక్టు భద్రత ఒక్కసారిగా ప్రశ్నార్థకమైంది. కేవలం మేడిగడ్డ మాత్రమే కాదు… ఆ పైన ఉన్న అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీల కింద కూడా బుంగలు పడటం, నీరు లీక్ అవ్వడం వంటి తీవ్రమైన సాంకేతిక లోపాలు బయటపడ్డాయి. దీనివల్ల బ్యారేజీలలో నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పూర్తిగా దెబ్బతింది. రాబోయే కాలంలో గేట్లు వేసి నీటిని ఆపితే… బ్యారేజీలు మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉందనే ఆందోళన మొదలైంది.
రంగంలోకి దిగిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ..
ఈ ప్రమాదం తర్వాత కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించిన నిపుణులు నివేదిక ఇచ్చారు. ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, మరియు నిర్మాణంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని స్పష్టం చేశారు. బ్యారేజీల కింద పునాదులు సరిగ్గా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తేల్చారు. ప్రస్తుతానికి బ్యారేజీల్లో నీటిని అస్సలు నిల్వ చేయవద్దని, గేట్లన్నీ తెరిచి ఉంచాలని కఠినమైన సూచనలు చేశారు. అలాగే జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ కూడా దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టింది.
కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్య యుద్ధం..
మేడిగడ్డ కుంగిన నాటినుండి ఇదే అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పెద్ద యుద్ధం నడుస్తోంది. త ప్రభుత్వం కేవలం ప్రచారం కోసం, కమీషన్ల కోసం లక్ష కోట్ల ప్రజాధనంతో తప్పుడు డిజైన్లతో ప్రాజెక్టు కట్టి, దాన్ని “కూలేశ్వరం” గా మార్చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. భద్రతా కారణాల వల్లే నీటిని లిఫ్ట్ చేయలేకపోతున్నామని, అందుకే ప్రత్యామ్నాయంగా దిగువన ఉన్న దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా ఈ ఏడాది రికార్డు స్థాయిలో దాదాపు 24 టీఎంసీల నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకున్నామని లెక్కలు చూపిస్తోంది. గ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షసాధింపు కోసమే ప్రాజెక్టును వాడుకుంటోందని విమర్శిస్తోంది. మేడిగడ్డ వద్ద పుష్కలంగా నీరున్నా కావాలనే గేట్లు ఎత్తి ఏపికి లాబంచేకూరుస్తు ,మిగిలినవి సముద్రంలోకి వదిలేస్తూ, తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తోందని అంటోంది. చిన్న సాంకేతిక లోపాన్ని సరిచేయడం చేతకాక, నివేదికల పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపిస్తోంది.
అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు..
దీంతోనవంబర్ నెలాఖరులో రెండు రోజులు ప్రత్యేక అసెంబ్లి మావేశాలు పెట్టిప్రధానంగా గత బీఆర్ఎస్ (BRS) హయాంలో జరిగిన నిర్మాణ, డిజైన్ లోపాలను, ప్రాజెక్టు నిర్వహణ వైఫల్యాలను ‘జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్’ మరియు ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA)’ నివేదికల ను అసెంబ్లి సాక్షిగా బహిర్గతం చేయాలనుకుంటోంది.
ప్రతిపక్షాల ప్రచారం..
గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకో, ఆంధ్రప్రదేశ్‌కో పోతున్నాయనే ప్రతిపక్షాల ప్రచారంలో నిజం లేదని మేడిగడ్డ వద్ద నీరు ఉన్నప్పటికీ కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎందుకు ఎత్తిపోయడం (లిఫ్ట్ చేయడం) లేదో సాంకేతికంగా వివరించనుంది. మేడిగడ్డ పంపుల ద్వారా తోడిన నీరు ఎల్లంపల్లికి చేరాలంటే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లను మూసి ఉంచాల్సి ఉంటుంది. అయితే, ఆ బ్యారేజీలలో ఉన్న తీవ్రమైన సాంకేతిక లోపాల వల్ల గేట్లు మూయవద్దని, వాటిని తెరిచే ఉంచాలని NDSA కఠినంగా ఆదేశించిన విషయాన్ని లెక్కలతో సహా నిరూపించనుంది. ఒకవేళ నిపుణుల హెచ్చరికలను దాటి గేట్లు మూస్తే, బ్యారేజీలు పూర్తిగా కొట్టుకుపోయి దిగువన తీవ్ర నష్టం జరుగుతుందనే విషయాన్ని స్పష్టం చేయనుంది.
ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ..
గడిచిన మూడేళ్లుగా కేవలం తాత్కాలిక మరమ్మతులు మాత్రమే చేశామని, ఇకపై కేంద్ర సంస్థల ఇన్-ప్రిన్సిపల్ అనుమతులతో రూ. 4,193 కోట్ల అంచనా వ్యయంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల శాశ్వత పునరుద్ధరణ పనులను 2026 డిసెంబర్ నెలాఖరు నాటికి ప్రారంభించబోతున్నట్లు సభ వేదికగా రోడ్‌మ్యాప్‌ను ప్రకటించ నుంది ఈ సభ ద్వారా ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ… ‘నిపుణుల నివేదికల ప్రకారమే మేము అడుగులు వేస్తున్నాం, ఎక్కడా రాజకీయం చేయడం లేదు, వీలైనంత త్వరగా ప్రాజెక్టును శాస్త్రీయంగా పునరుద్ధరించి రైతులకు శాశ్వత భరోసా ఇస్తాం’ అనే పారదర్శక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది
అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా..?
ఈనేపద్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జరగబోయే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ (BRS) నేతలు, ముఖ్యంగా కేసీఆర్ వస్తారా? అనే ప్రశ్నపై ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది సభను బహిష్కరిస్తే తప్పు ఒప్పుకున్నట్లు అవుతుందని, అందుకే సభకు వచ్చి గట్టిగా పోరాడాలని పార్టీ అంతర్గత సమావేశాల్లో (BRSLP) నిర్ణయించారు అయితే కేసిఆర్ వస్తారా అంటే….కేసిఆర్ తిరిగి ముఖ్యమంత్రిగానే తెలంగాణ అసెంబ్లిలోఅ డుగుపెడతారు అని గతంలో కేటిఆర్ పలుమార్లు స్పష్టంచేసిన నేపధ్యంలో సభకు కేసిఆర్ రాకపోవచ్చు అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.. బీఆర్ఎస్ శాసనసభాపక్షం (MLAs) పూర్తి స్థాయిలో హాజరై, కాంగ్రెస్ ప్రభుత్వంతో గట్టిగా తలపడటం ఖాయంగాకనిపిస్తుంది ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి చర్చలో కీలకం కాబోతారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ ఏం చెప్తుంది..?
అసెంబ్లీలో కాంగ్రెస్ ఏం చెప్తుంది, బీఆర్ఎస్ ఎలా తిప్పికొడుతుంది అనే రాజకీయాల కంటే… తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఒక్కటే. ఎన్ని చర్చలు జరిగినా, ఏ కమిషన్లు నివేదికలు ఇచ్చినా… అంతిమ లక్ష్యం మాత్రం ప్రాజెక్టు పునరుద్ధరణ జరిగి, అది త్వరగా రైతులకు అందుబాటులోకి రావాలి. ఎందుకంటే, కాళేశ్వరం అనేది కేవలం రాజకీయ చదరంగంలో వాడుకునే పావు కాదు. అది తెలంగాణ ప్రజల చెమట, రక్తం, ట్యాక్స్ డబ్బులతో ముడిపడిన ప్రాజెక్టు. లక్షలాది మంది రైతుల సాగునీటికిబరోసా నిచ్చే ప్రాజెక్టు. కాబట్టి రాజకీయాన్ని పక్కనపెట్టి, ప్రజా ప్రయోజనమే పరమావధిగా ఈ ప్రాజెక్టును త్వరగా నిర్మించడమే ఇప్పుడు రాష్ట్రం ముందున్న అసలైన బాధ్యత.
Also Read:రూ.5 కోట్లు ఇస్తావా.. వీడియోలు బయట పెట్టమంటారా..? ఎమ్మెల్సీకి బెదిరింపులు.. సీన్ కట్ చేస్తే!