Tharun Bhascker: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తరుణ్ భాస్కర్(Tharun Bhascker) త్వరలోనే ఈఎన్ఈ రిపీట్ (ENE Repeate)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు . ఈ సినిమా నవంబర్ 19వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తరుణ్ భాస్కర్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన పెళ్లి గురించి అలాగే విడాకుల (Divorce)గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఇటీవల తన మూడవ భార్యకి విడాకులు ఇచ్చినట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విధంగా పవన్ కళ్యాణ్ విడాకుల(Pawan Kalyane Divorce) వార్తలు సంచలనంగా మారిన నేపథ్యంలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కు విడాకుల అంశం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే తరుణ్ భాస్కర్ విడాకుల గురించి మాట్లాడుతూ.. జీవితంలో ప్రతి ఒక్క మనిషికి తోడు అనేది ఎంతో అవసరం అని తెలిపారు.ఇప్పటి జెన్ జీ తరం పెళ్లిని.. సిచ్యువేషన్ షిప్ అని ఏదేదో అంటున్నారు. పెళ్లి అనేది మనం నిర్మించుకున్నదే.. ఇద్దరు ఇష్టపడి కలిసి బ్రతకాలనుకుంటే వారిని అలాగే బ్రతకనివ్వండి.
ఇక పెళ్లి చేసుకుని ఇష్టం లేకపోయినా జీవితాంతం కలిసి బ్రతకాలని, ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా సంతోషం లేకుండా రిలేషన్‌ను కొనసాగించడం సమయం వృధా చేసుకోవడమే. పరస్పర గౌరవంతో విడిపోవడంలో తప్పేం లేదని తరుణ్ భాస్కర్ తెలియచేశారు. ఏదో సమాజం కోసం ఇష్టం లేకపోయినా ఒకరితో మరొకరు మాట్లాడకపోయినా కలిసి బ్రతకాల్సిన అవసరం లేదని సూచించారు. ఇదే అంశం గురించి తాను ఎప్పటికైనా ఒక సినిమా చేస్తానని తరుణ్ భాస్కర్ తెలిపారు.
ప్రతి ఒక్కరికి 40 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి మనశ్శాంతి అవసరమని తెలిపారు. అయితే అది ఎక్కడ దొరుకుతుందో వెతుక్కోవాలని ఈయన సూచించారు. ఇక ఒక మనిషికి వందమంది తెలిసినవారు ఉండడం కంటే మనశ్శాంతిని ఇచ్చేవారు ఒక్కరు ఉంటే చాలు అంటూ మాట్లాడారు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో పలు చర్చలకు కూడా కారణమయ్యాయి. ఇక తరుణ్ భాస్కర్ కూడా ఇదివరకే వివాహం చేసుకొని తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా విడాకులు తీసుకున్న ఈయన తిరిగి మరొక నటి ఈషా రెబ్బా (Eesha Rebba)తో రిలేషన్ లో ఉన్నారు త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు వీరు మాత్రం తమ రిలేషన్ గురించి ఎక్కడ అధికారకంగా కూడా స్పందించలేదు.
Also Read: కోట్లు విలువ చేసే ఇల్లు..అన్నా పిల్లలకు రాసిచ్చిన పవన్…ఎవరికి ఎంతంటే!