EPAPER

Devara Trolling : దేవరపై నెట్టింట ట్రోలింగ్.. మరీ ఈ రేంజ్ లోనా ?

Devara Trolling : దేవరపై నెట్టింట ట్రోలింగ్.. మరీ ఈ రేంజ్ లోనా ?

Social Media Trolling on Devara Trailer: దేవర.. జూనియర్ ఎన్టీఆర్ అప్‌కమింగ్ మూవీ. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్ అయి వ్యూస్‌లో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. మామూలుగానే ఎన్టీఆర్‌ మూవీ అంటే అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. మరి ఆ అంచనాలను దేవర అందుకోగలదా? ఇప్పటికే నెట్టింట్లోకి వచ్చేసిన ట్రైలర్‌పై రియాక్షన్స్‌ ఏంటి?


ఎక్కడో కొడుతుంది శీనా.. ఏంటి ఈ వెటకారం అనుకుంటున్నారా? దేవర ట్రైలర్‌ చూసిన వారంతా లోలోపల ఎక్కడో అనుకుంటున్న మాట ఇది. అందుకే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి విపరీతమైన ట్రోలింగ్‌ మొదలైంది. ఈ నెల 27న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రానుంది ఈ పాన్‌ ఇండియా మూవీ. వీఎఫ్‌ఎక్స్‌ బాలేదంటారు కొందరు. ఆంధ్రావాల టూ అంటారు మరికొందరు. అసలు ఎన్టీఆర్‌ లుకే బాగాలేదంటారు ఇంకొందరు. పాటలు కాపీ అంటారు.. డాన్స్‌ స్టెప్స్‌ కూడా కాపీ అంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. ఇదే ఇప్పుడు ఫిల్మ్స్‌ సర్కిల్‌లో హాట్ టాపిక్. ఇంత నెగటివ్ ట్రోలింగ్‌ మధ్య సినిమా హిట్ అవుతుందా? ఫట్ అవుతుందా? అస్సలు అర్థం కాని సిట్యూవేషన్‌లో ఉన్నారు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్.

ఇక్కడ మరో హైలేట్ విషయం ఏంటంటే.. తెలుగులో కంటే బాలీవుడ్‌లో ఈ మూవీపై ట్రోలింగ్ ఎక్కువగా నడుస్తోంది. నిజానికి దేవర గురించి బాలీవుడ్‌లో ఇంత చర్చ ఎందుకొచ్చింది? ఎందుకింత ట్రోల్‌ చేస్తున్నారు? అనేది కాస్త అర్థం కాని విషయం. దీని గురించి ఓ ఇంట్రెస్టింగ్‌ విషయం ఉంది.. దాని గురించి డిస్కస్‌ చర్చిద్దాం. దానికి ముందు మూవీ బడ్జెట్‌.. బిజినెస్‌పై ఓ లుక్కేద్దాం.


సినిమా ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకుంది. మొత్తం 2 గంటల 58 నిమిషాల డ్యూరేషన్‌ ఉంది. ఇక దేవర మూవీ బడ్జెట్‌ వచ్చేసి రూ.350 నుంచి రూ.400 కోట్లు. ఇందులో హీరో రెమ్యూనరేషన్‌.. అంటే మన ఎన్టీఆర్‌ తీసుకునేది వంద నుంచి 120 కోట్ల మధ్య ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. హీరోయిన్ జాహ్నవీ కపూర్‌ 6 నుంచి 8 కోట్లు చార్జ్‌ చేస్తున్నారు. ఇక్కడే ఆల్‌మోస్ట్‌ సగం బడ్జెట్ అయిపోయింది.

Also Read: ‘దేవర’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ పెరగడానికి కారణం అదేనా?

ఇదంతా పక్కన పెడితే ఇప్పుడీ మూవీ బిజినెస్‌పై కాస్త డౌట్స్ మొదలయ్యాయట. దేవర సిట్యూవేషన్ ట్రైలర్‌కు ముందు.. ట్రైలర్‌కు తర్వాత అన్నట్టుగా ఉంది అని టాక్. ఎందుకంటే చాలా మందికి ట్రైలర్‌ నచ్చలేదు.. అందుకే ట్రోలర్స్‌ ఓ ఆట ఆడుకుంటున్నారు. ఈ మూవీ డైరెక్టర్‌ కొరటాల శివపై కూడా విరుచుకుపడుతున్నారు. నిజానికి కొరటాల లాస్ట్‌ మూవీ ఆచార్యపై కూడా ఇలానే ట్రోలింగ్ జరిగింది. ఈ ట్రోల్‌కు తగ్గట్టుగానే ఆ మూవీ కూడా పాదఘట్టమైంది. మెగాస్టార్ హిస్టరీలో మెగా ఫ్లాప్‌గా మిగిలింది.

ఇక దేవరపై ఇంత నెగిటివిటి రావడానికి ఇంకా అనేక కారణాలు కూడా కనిపిస్తున్నాయి. రాజమౌళి డైరెక్షన్‌లో పనిచేసిన హీరోలకు ఆ తర్వాత హిట్‌ పడటం అంత ఈజీ కాదన్న టాక్ ఉండనే ఉంది. రాజమౌళి హీరోలకు సరైన హిట్ పడాలంటే కనీసం నాలుగైదు సినిమాల సమయం పడుతుంది. ఇప్పటికే ఈ విషయం అనేక సార్లు రుజువు కూడా అయ్యింది. ఇప్పుడీ ట్రెండ్‌ను ఎన్టీఆర్‌ కూడా కంటిన్యూ చేస్తారని వినిస్తోంది. ఎన్టీఆర్‌ డబుల్ యాక్షన్‌ ఇప్పటి వరకు మూడు సార్లు చేశారు. అదుర్స్‌ మినహా ఎప్పుడూ ఇది వర్కౌట్ కాలేదు. తర్వాత కొరటాల.. ప్రస్తుతం మనోడి ఫామ్‌ అంత గొప్పగా లేదు.

ఇప్పుడు ఇందాక పక్కన పెట్టిన ట్రోలర్స్‌ విషయానికి వద్దాం. దేవర ట్రైలర్‌ నిజంగానే అంతగా ఆకట్టుకోలేదని టాక్. కానీ ఈ రేంజ్‌లో ట్రోల్ అవ్వాల్సినంత అవసరమైతే కనిపించడం లేదు. కానీ జరుగుతుంది. అందుకే ఇప్పుడు కొన్ని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఇవి నిజమైన ట్రోల్సా? లేక ఎవరైనా వెనకుండి నడిపిస్తున్నారా? ఎందుకీ క్వశ్చన్‌ రెయిజ్ అవుతుంటే.. ఈ మధ్య ఒక హీరోను టార్గెట్‌ చేసుకొని ట్రోల్స్‌ చేయడం కామన్‌గా మారింది. అందుకే దేవరపై నెగటివ్ ఇంప్రెషన్‌ తీసుకురావడినికి తెర వెనక కొన్ని శక్తులు పనిచేస్తున్నట్టు కనిపిస్తోందన్న ప్రచారం ఉంది. దీనికి తోడు పొలిటికల్ రీజన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి బాలీవుడ్‌లో కూడా నెగటివ్ ట్రోలింగ్ స్టార్‌ చేసింది కూడా ఓ బ్యాచ్ అని ప్రచారం జరుగుతోంది. నార్త్‌లో ట్రోల్ చేస్తున్న అకౌంట్స్‌ అక్కడివా? లేక మన తెలుగువా అనే అనుమానాలు కూడా లేకపోలేదు.

Also Read: ఆచార్య 2.. దేవర స్టోరీ ఇదే..?

అంతేకాదు మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంతకంటే ఎక్కువ ట్రోల్ చేస్తామని శపథాలు చేస్తున్నారు మరికొందరు ట్రోలర్స్. ఇదంతా ఎవరిపై కోపమనేది అర్థం కావడం లేదు. ఇలా డీఫేమ్‌ చేయడానికి కూడా డబ్బు ఖర్చు చేస్తున్నట్టు కనిపిస్తోంది ప్రస్తుతం. అయితే ట్రోలర్స్‌కు కావాల్సిన స్టఫ్‌ను అందిస్తుంది దేవర టీమ్. ఇంతవరకు ఎలాంటి ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. ఆఖరికి ఎన్టీఆర్‌ కూడా ఈ మూవీపై కాస్త ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు. అయితే మేకర్స్‌ మాత్రం సినిమాపై కాస్త నమ్మకంగానే ఉన్నారు. కానీ ఈ నెగటివ్ టాక్ మాత్రం సినిమాకు అంత మంచిది కాదనే చెప్పాలి.

ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. తెలుగు స్టేట్స్‌లో ఎన్టీఆర్‌కు డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ట్రోల్స్‌కు సరైన సమాధానాలు మాత్రం ఇవ్వడంలో కాస్త వెనకపడ్డారనిపిస్తోంది. అయితే ఈ ట్రోల్స్‌ను.. ఈ పంచాయితీని మూవీ లవర్స్‌ పట్టించుకుంటారా? అనేది అసలు ప్రశ్న. ఎందుకంటే ఒక్కసారి మూవీపై పాజిటివ్ టాక్ వచ్చిందంటే.. దాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. నార్త్‌ కంటే మన సౌత్‌లోనే సినిమా పిచ్చొళ్లు ఎక్కువ.. బిజినెస్‌ కూడా భారీగా జరిగేది ఇక్కడే. మన దగ్గర చిన్నవి, పెద్దవి కలిపి ఏడాదికి 400 నుంచి 500 సినిమాలు వస్తాయి. నార్త్‌లో మిగిలిన అన్ని రాష్ట్రాలు కలిసినా.. 150 సినిమాలు కూడా రావు. అందుకే సినిమాపై పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. అయితే కాస్త అటు ఇటుగా ఉంటే మాత్రం.. ఇక ఈ ట్రోలర్స్‌ను ఆపడం కష్టమే. ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా వస్తున్న ఎన్టీఆర్. అభిమానులను అలరిస్తారా? ఏడిపిస్తారా? చూడాలి.

Related News

Baba Siddique Murder: బిష్ణోయ్ కులదైవానికి సల్మాన్ బలి..

What is the THAAD: థాడ్ అంటే ఏంటి? ఇది వాడితే ఏ దేశమైనా నాశనమేనా?

JC Prabhakar Reddy: వాటా ఇవ్వాల్సిందే.. దుమారం రేపుతున్న జేసీ మాటలు..

Harish Rao: నెంబర్ 2 నేనే..!

Vijayasai Reddy EVM: ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి విజయ్‌సాయిరెడ్డి ట్వీట్.. 2019లో టాంపరింగ్ సాధ్యం కాదని చెప్పిన జగన్!

CID Takes TDP Attack Case: సిఐడీ చేతికి టీడీపీ ఆఫీసుపై దాడుల కేసులు.. విచారణ వేగవంతం

PAC Chairman Arikepudi: పీఏసీ చైర్మన్ పదవిపై హరీష్ రావు రాజకీయాలు.. గట్టి కౌంటర్ కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్‌బాబు

Big Stories

×