India China agree to ‘fully abide’ by bilateral agreements: దేశ రక్షణ సహా పలు ఇతర అంశాలలో ప్రధాని మోదీ తీసుకునే కీలక నిర్ణయాలలో కీలక పాత్ర వహించే వ్యక్తిగా అజిత్ దోవల్ కు మంచి గుర్తింపు ఉంది. మోదీ అప్పట్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్ ను పూర్తిగా భారత్లో విలీన చేయడంలుో ఆయన పాత్ర ఎంతో ఉందని చెబుతారు. అయితే ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తో భేటీ అయ్యారు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఈ కీలక సమావేశం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా చైనా భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సరిహద్దుల్లో కూడా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ చర్చనీయాంశం అయింది. కాగా ఇద్దరి మధ్య చర్చలు సన్నిహిత వాతావరణంలో జరిగినట్లు తెలుస్తోంది.
ఇరు దేశాల మధ్య సామరస్యం
ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకునేలా కృషి జరగాలని ఇరు దేశాల రాయబార ప్రతినిధులు కోరుకున్నారు. బ్రిక్స్ దేశాల ఎన్ఎస్ఏల సదస్సు సందర్భంగా వీరిరువురూ భేటీ అయ్యారు. రష్యా పర్యటన ముగించుకుని గురువారం సాయంత్రం అజిత్ దోవల్ చైనాకు వచ్చారు. అక్కడ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు సామరస్య పూర్వకంగా జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా వాస్తవాధీన రేఖ గురించే ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. సాధ్యమైనంత తొందరలో ఈ సమస్యకు పరిష్కారం చూడాలని ఆ దిశగా ప్రయత్నాలు జరగాలని వివాదాస్పద ప్రదేశాలలో బలగాలు ఉపసంహరించుకోవాలని కోరాయి.
4 వేల కి.మీ. భూమి ఆక్రమణ
ఇటీవల కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇప్పటికే నాలుగువేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనా ఆక్రమించుకుందని చైనా ని డీల్ చేయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని అన్నారు. చైనా ఆక్రమించుకున్న భూమి దాదాపు ఢిల్లీ విస్తీర్ణం అంత ఉంటుందని ఆరోపించారు. అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రితో జరిపిన కీలక భేటీతో చైనా, భారత మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని అందరూ భావిస్తున్నారు.