E-Paper
Advertisement

9 నెలల్లో రూ.132 కోట్ల ఆస్తి నష్టం.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!

9 నెలల్లో రూ.132 కోట్ల ఆస్తి నష్టం.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
Advertisement

Senior Actress Kavitha:ప్రముఖ సీనియర్ నటీమణి కవిత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం చిత్రాలతో సౌత్ ఇండియా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె.. తెలుగు సీనియర్ స్టార్ హీరోల చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. 1976 లో వచ్చిన ‘ఓ మంజు’ అనే తమిళ చిత్రంలో మంజు పాత్రలో నటించి మొదటి సినిమాతోనే కుమారి కవితగా ఘన విజయం అందుకున్న ఈమె.. ఆ తర్వాత అదే ఏడాది ‘సిరిసిరిమువ్వ’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

సినిమాలు , సీరియల్స్ తో ఊహించని పాపులారిటీ..

అడవి రాముడు, న్యాయవాది , విశ్వనాథ్, ఇద్దరూ అసాధ్యులే, వెంకటేశ్వర వ్రత మహత్యం, శారదా రాముడు, నకిలీ మనిషి, అల్లుడు పట్టిన భారతం, చుట్టాలున్నారు జాగ్రత్త, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, పెద్దరికం, ప్రెసిడెంట్ పేరమ్మ ఇలా పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా తన సినీ కెరియర్ లో ఎన్నో చిత్రాలలో నటించి ఆకట్టుకున్న ఈమె.. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు సీరియల్స్ లో కూడా కీలక పాత్రలు పోషించి మెప్పించింది.

9 నెలల్లో 132 కోట్లు కోల్పోయాం – సీనియర్ నటీమణి కవిత.

Advertisement

అలాంటి కవిత ఇప్పటికీ పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. తొమ్మిది నెలల్లో ఏకంగా 132 కోట్ల రూపాయలను కోల్పోయాం అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న కవిత ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. ” ఒక ఏడు సంవత్సరాల క్రితం నా భర్త తన బిజినెస్ లో తొమ్మిది నెలల్లోనే ఏకంగా రూ.132 కోట్లు నష్టపోయారు. పాండిచ్చేరి లో ఆయిల్ బిజినెస్ చేసే వాళ్ళు. అయితే ఒక నాలుగు సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ డౌన్ అయింది. ఈ విషయాలు ఏవి కూడా ఆయన మాకు ఎవరికీ చెప్పలేదు. నా సినిమాల బిజీ కారణంగా నేనెప్పుడూ కూడా ఆయన బిజినెస్ లో జోక్యం చేసుకోలేదు.

నా భర్త కోమలోకి వెళ్ళిపోయారు – కవిత

ఆ నష్టాన్ని చూసి తట్టుకోలేక ఒక్కసారిగా కింద పడిపోయారు. ఆ సమయంలో మాటలు లేవు. హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకెళ్తే.. బ్రెయిన్ హెమరేజ్(మెదడులో రక్తస్రావం) అన్నారు. బ్రతకరు.. చుట్టాలు ఎవరైనా చూడాల్సిన వాళ్లు ఉంటే అందర్నీ పిలవండి అని చెప్పారు. అయితే నేను మాత్రం ఆయన బ్రతికే ఉంటారు ..ఏం కాదు..నేను ఎవరిని పిలవను అని చెప్పాను. కానీ ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. 11 రోజులపాటు కోమాలోనే ఉన్నారు. నేను ఒక్కదాన్నే హాస్పిటల్లో ఉన్నాను. పిల్లలు కూడా రానన్నారు. మా నాన్న ఎలా ఉన్నారో అలాగే మాకు కావాలి అని చెప్పారు. ఇక సాయి కి చెప్పలేని పరిస్థితి.. దీని గురించి చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం నాలో కలిగింది.

Advertisement

also read:మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు.. శివ పై వర్షిణి ఫైర్!

కరోనా ప్రాణం తీసుకెళ్ళిపోయింది – కవిత

కానీ భగవంతుడు దయతో ఆయన క్షేమంగా ఇంటికి వచ్చారు” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా బిజినెస్ కారణంగా ఆ రేంజ్ లో నష్టపోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి. ఇకపోతే ఆ భయానక సందర్భం నుండి బయటపడ్డ కవిత భర్త దశరథరాజు 2021లో కరోనా కారణంగా మరణించారు. భర్త మరణించిన కొన్ని రోజులకే కుమారుడు కూడా చనిపోవడం ఆమె జీవితంలో కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. ఇకపోతే కవిత దశరాథరాజు దంపతులకు ముగ్గురు పిల్లల అన్న విషయం అందరికీ తెలిసిందే.

Related News

రాధిక ఆప్టేపై బాలయ్య ఫాన్స్ ఫైర్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ నిర్మాతానా.. కోలీవుడ్ ప్రమోటరా? తమిళ సినిమాలపై ఆ నిర్మాతకు అంత మోజు ఏంటో!

ఆ సినిమా చూసి రంపం వాడిన రాప్తాడు నిందుతుడు.. ఇదేం దరిద్రం రా బాబు!

మెగా ఫ్యామిలీలో పెళ్లి సంబరాలు షురూ… సాయి ధరమ్ తేజ్ పెళ్లి వేదిక ఫిక్స్?

గురూజీ – వెంకీ మ్యాజిక్ వర్కౌట్ కాలేదా? ఏకంగా అన్ని కోట్లు నష్టమా?

ప్రాణభయంలో బిగ్ బీ..బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ సాయంతో ఫ్యాన్స్ కు అభివాదం!

నాకు ఆ పాటకు సంబంధం లేదు.. యూటర్న్ తీసుకున్న జిమ్ జిమ్ తార సింగర్!

Big Stories

Advertisement
×