BigTV English

NTR: టిల్లుగాడి కోసం టోనీ వస్తున్నాడు..

NTR: టిల్లుగాడి కోసం టోనీ వస్తున్నాడు..


NTR: సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. డీజే టిల్లు కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 29న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. భారీ విజయంతో పాటు రికార్డు కలక్షన్స్ కూడా రాబడుతుంది.

దాదాపు వారం రోజుల్లో 96 కోట్లు సంపాదించి 100 కోట్ల క్లబ్లో చేరడానికి రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా ఇప్పటికే అభిమానులతో పాటు ఎంతోమంది సెలబ్రిటీలను కూడా మెప్పించింది. ఇప్పటికే చిరు ఈ సినిమాను చూసి అభినందించారు. ఈ నేపధ్యలోనే మేకర్స్ టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ ను నిర్వహించనున్నారు. ఇక ఈ సక్సెస్ మీట్ కు తారక్ గెస్ట్ గా రానున్నాడు. ఏప్రిల్ 8న ఈ సక్సెస్ మీట్ నిర్వహించనున్నట్లు మేకర్స్ తెలిపారు.


ఇప్పటికే టిల్లు స్క్వేర్ సినిమాను తారక్ చూసినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ టైమ్ లో తారక్ టిల్లు డైలాగ్ అట్లుంటది మనతోని చెప్పి ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా ఆ సినిమాతనకెంతో ఇష్టమని కూడా తెలిపాడు. ఇక ఈ సక్సెస్ మీట్ కు దేవర రావడంతో అభిమానులు సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరుతుంది అని తెలుస్తుంది. మరి ఈ సక్సెస్ మీట్ లో తారక్ ఎలాంటి స్పీచ్ ఇస్తాడో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×