Keerthi Bhat:సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన వారిలో కీర్తి భట్ ఒకరు..ఈ బుల్లితెర నటి బిగ్ బాస్ ద్వారా మరింత ఫేమస్ అయింది. ఇక బిగ్ బాస్ లోకి వెళ్లే ముందే తాను దత్తత తీసుకున్న పాప చనిపోవడంతో పాటు ప్రియుడు కూడా బ్రేకప్ చెప్పడంతో హౌస్ లో ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవుతూ ఎంతోమంది ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.అయితే అలాంటి కీర్తి భట్ ఒక అనాధ అనే విషయాన్ని స్వయంగా ఆమెనే కొన్ని ఇంటర్వ్యూలలో బయటపెట్టింది. అయితే కీర్తి భట్ తనకు పిల్లలు పుట్టరు అనే విషయం కూడా తెలియజేసింది.ఇక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక కీర్తి భట్ కు ఎక్కడలేని ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. డబ్బులు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలు, సీరియల్స్ లో అవకాశాలు రావడంతో చాలా పాపులర్ అయిపోయింది. ఇక గత ఏడాది విజయ్ కార్తీక్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది.
ఎట్టకేలకు ప్రియుడి మోసాన్ని బయటపెట్టిన కీర్తి భట్..
అయితే ప్రియుడు మోసం చేయడంతో ఆమె కష్టాలను అర్థం చేసుకొని మరో వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇక చాలామంది అమ్మాయిలకు పిల్లలు పుట్టరంటే వారిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. కానీ విజయ్ మాత్రం పిల్లలు పుట్టరని తెలిసినా కూడా కీర్తి భట్ ని ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. అయితే అలాంటి కీర్తి భట్ తన మాజీ ప్రియుడు ఎలాంటి వాడో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. కీర్తి భట్ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఏ చిన్న విషయం దాచినా కూడా దాగదు. అలా నేను నా మాజీ ప్రియుడి చేతిలో మోసపోయాను. ఆయన కూడా ఇండస్ట్రీలో ఉన్నవాడే. అయితే ఇప్పటివరకు నేను ఆయన గురించి ఎక్కడా కూడా చెడుగా చెప్పలేదు. కానీ ఆయన మాత్రం నా గురించి పూర్తిగా బ్యాడ్ చేసాడు. నేను వక్ర మార్గంలో వెళ్లలేదు కాబట్టి ఇప్పటికీ చేతినిండా అవకాశాలు రావడంతో పాటు మంచి లైఫ్ ని లీడ్ చేస్తున్నాను. లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నాను. కానీ ఆ వ్యక్తి నాపై చెడుగా ప్రచారం చేస్తూ చెడుదారిలో నడుస్తున్నాడు.
నన్ను చాలా బ్యాడ్ చేశారు -కీర్తి భట్
కాబట్టి ఇప్పటికి ఆయన రెమ్యూనరేషన్ 12 వేలే ఉంది. నేను పెంచుకున్న పాప నాకే పుట్టిందని డీఎన్ఏ టెస్ట్ చేయిస్తానని కొంతమందితో చెప్పారట. ఈ విషయం నాకు మొన్నే తెలిసింది. అంతేకాదు నేను ఆ వ్యక్తిని డబ్బులు ఇవ్వమన్నానని , డబ్బుల కోసం వేధించానని కూడా చెప్పుకున్నాడట. 12వేలు సంపాదించే వ్యక్తి దగ్గర లక్షలు సంపాదించే నేను ఎక్కడి నుండి తీసుకుంటాను. అయినా కూడా ఆయన గురించి నేను చెడుగా చెప్పడం లేదు. నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చిన విజయ్ కార్తీక్ కి కూడా ఆయన గురించి చెడుగా చెప్పలేదు. ఎవరి లైఫ్ వారిది.బ్రేకప్ అయ్యాక ఆయన లైఫ్ ఆయన చూసుకున్నాడు. నా లైఫ్ నేను చూసుకున్నాను. కానీ మళ్లీ నా లైఫ్ లోకి తొంగి చూస్తూ నన్ను బ్యాడ్ చేయాలని చూడడం ఆయనకే మంచిది కాదు. కలిసి వున్నప్పుడు నేను ఆయనతో హ్యాపీగా ఉన్నాను.వాళ్ళ ఇంటికి వెళ్లి భోజనం చేశాను. కానీ ఆ తర్వాత చెడు ప్రచారం చేస్తే బాగోదు. నాకు బ్రేకప్ చెప్పి వెళ్లిపోయిన ఆయన లైఫ్ బాగుపడకూడదు అని నేను ఆయన్ని ద్వేషించను. నా కుటుంబం నన్ను వదిలేసి రోడ్డు మీద అనాధలా నిలబెట్టినా నేను బాధపడలేదు.ఎందుకంటే కర్మ ఎవర్ని వదిలిపెట్టదు. నన్ను ఎలా చేశారో వారికీ అదే గతి వస్తుంది. ప్రస్తుతం నా లైఫ్ చాలా బాగుంది అంటూ కీర్తి భట్ తన మాజీ ప్రియుడి నిజస్వరూపం మొత్తం బయటపెట్టింది