BigTV English

IPL 2025: కష్టాల్లో SRH..ప్లే ఆఫ్స్ కి చేరాలంటే ఇది ఒక్కటే ఛాన్స్ !

IPL 2025: కష్టాల్లో SRH..ప్లే ఆఫ్స్ కి చేరాలంటే ఇది ఒక్కటే ఛాన్స్ !

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ {SRH} పరాజయాల పరంపర కొనసాగుతోంది. గత సీజన్ లో ఫైనలిస్ట్ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించే ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. ఈ సీజన్ లోని తొలి మ్యాచ్ లోనే 286 పరుగులు చేసి ఈ సీజన్ ని ఘనంగా ప్రారంభించింది సన్రైజర్స్. కానీ అప్పటినుండి జట్టు బ్యాటింగ్ నిరంతరం విఫలం అవుతూనే ఉంది.


Also Read: Ashwin YouTube channel: CSK లో ముసలం.. నూర్ అహ్మద్ పరువు తీసిన అశ్విన్ యూట్యూబ్ ఛానల్

హైదరాబాద్ జట్టు {IPL 2025} వరుసగా నాలుగు మ్యాచ్లలో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఆదివారం రోజు గుజరాత్ టైటాన్స్ తో ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో సమిష్టిగా విఫలమైన సన్రైజర్స్ హైదరాబాద్.. ఏడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఇలా పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో భారీ విజయాన్ని నమోదు చేసి, ఆ తర్వాత లక్నో, ఢిల్లీ, కలకత్తా, గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయాలను చవిచూసింది.


ఇప్పటివరకు ఆడిన మొత్తం ఐదు మ్యాచ్లలో.. నాలుగు పరాజయాలతో {SRH} పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున కొనసాగుతోంది. అయితే జట్టులో బ్యాటింగ్ వైఫల్యమే ఈ నాలుగు మ్యాచ్లలో హైదరాబాద్ పతణాన్ని శాచించింది. ట్రావీస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ ఘోర వైఫల్యం హైదరాబాద్ విజయ అవకాశాలను దెబ్బతీస్తోంది. మరోవైపు చెత్త బౌలింగ్ కూడా జట్టుకు తీవ్ర నష్టం చేస్తుంది. జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం, అనుభవం కలిగిన ప్యాట్ కమీన్స్, మొహమ్మద్ షమీ వికెట్లు పడగొట్టలేకపోవడం హైదరాబాద్ పతనాన్ని శాసిస్తోంది.

ఇప్పుడు లీగ్ దశలో సన్రైజర్స్ హైదరాబాద్ కి మిగిలిన 9 మ్యాచ్లు అతి కిలకం. జట్టు ప్లే ఆప్స్ కి చేరాలంటే వీటిలో కనీసం 8 విజయాలు అవసరం. ఇది సాధించగలిగితేనే 18 పాయింట్లతో టైటిల్ పోరులో నిలవగలుగుతుంది సన్రైజర్స్. ఒకవేళ మరో రెండు మ్యాచ్లు కూడా ఓడిపోతే.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. మరోవైపు నెట్ రన్ రేట్ కూడా దయనీయ స్థితిలో ఉండడంతో విజయం మాత్రమే కాదు.. పరుగుల తేడాతో గెలవడం కూడా కీలకం అవుతుంది.

 

అయితే ఈ స్థితి నుండి బయట పడాలంటే టాప్ ఆర్డర్ బ్యాటర్లు ముందుకు రావాలి. బ్యాటర్లు భారీ స్కోర్లు సాధించినట్లయితే బౌలర్ల పై ఒత్తిడి తగ్గి వారు తమ రీతిలో రాణించగలుగుతారు. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ నెట్ రన్ రేట్ తక్కువగా {-1.629} ఉండడంతో తదుపరి మ్యాచ్లలో దీన్ని కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ మరో 3 మ్యాచ్లలో ఓడితే మాత్రం.. అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంది నిష్క్రమిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు కూడా జట్టు వైఫల్యాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×