BigTV English

MLAs Home Tour Videos: ఎందుకంత తాపత్రయం? హోం టూర్ల పేరుతో కూటమి నేతల ఇంటర్య్వూలు, ఈ లాజిక్ ఎలా మిసయ్యారు?

MLAs Home Tour Videos: ఎందుకంత తాపత్రయం? హోం టూర్ల పేరుతో కూటమి నేతల ఇంటర్య్వూలు, ఈ లాజిక్ ఎలా మిసయ్యారు?

హోం టూర్లు.. ఇప్పుడు టీడీపీలో ఈ హోం టూర్ వీడియోల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ ఏంటి..? ఆ రాజకీయ పార్టీలో హోం టూర్ల గురించి చర్చ ఎందుకు జరుగుతుంది.. ? సెలబ్రిటీలు.. సినిమా స్టార్లు.. లాంటి వాళ్లు చేయించుకునే హోం టూర్ వీడియోల గురించి టీడీపీ వర్గాల్లో ఎందుకు చర్చ అని అనుమానం కలగడం సహజమే. అయితే కొందరు నేతలు సెల్ఫ్ ఎక్స్‌పోజర్ కోసం ఇస్తున్న ఇంటర్వ్యూలతో ఈ హోం టూర్లపై ఇప్పుడు టీడీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోందన్నది.. నిజ్జంగా నిజం.


చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, కళ్యాణ దుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, టీటీడీ బోర్డు మెంబర్, బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ … వంటి వారు ఇటీవల కాలంలో.. తాము పదవుల్లోకి వచ్చిన తర్వాత కొన్ని యూ ట్యూబ్ ఛానెళ్లకు హోం టూర్లు అంటూ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందులో వారి జీవితం గురించి.. వారి రాజకీయ ప్రస్థానం గురించి కొంత ఉంటే.. వారు కట్టుకున్న ప్యాలెస్‌లు మరిపించే విలాసవంతమైన భవనాల్లో వైభోగాలను వివరిస్తూ ఆ యూ ట్యూబ్ ఛానెల్ యాంకర్ ఇల్లంతా చుట్టేసి వస్తారు.

ఇంటి గేట్ మొదలుకుని.. బెడ్రూం, బాత్రూంల వరకు ఆయా ఎమ్మెల్యేలు ఎంత విలాసవంతమైన జీవనం గడుపుతున్నారోననే విషయాన్ని చక్కగా వివరిస్తారు. పైగా రాజకోటలా ఉంది.. ప్యాలెస్సును తలపిస్తోంది.. బంగారం కుర్చీనేనా.. బాత్రూం ఇంత అద్భుతంగా ఉంటుందా.. నివాసంలో మినీ బార్ రాజసం, ఇంట్లోనే దేవాలయం నిర్మించేసుకున్నారు.. హోం థియేటర్ల రాజ భోగాలు, దుబాయ్ లాంటి దేశాల్లో ఉండే ఇళ్ల లాంటి భవనాలు అంటూ చక్కగా.. అందంగా వర్ణిస్తున్నారు. ఇంటి నిర్మాణ శైలిని.. ఎన్నాళ్లపాటు కష్టపడి ఈ ఇంటిని నిర్మించారో.. పునాదులు మొదలుకుని.. మెట్ల నిర్మాణం వరకు.. లిఫ్ట్ మొదలుకుని.. ఇంటిరీయర్స్ డెకరేషన్ వరకు మొత్తం చక్కగా, అందంగా ఆ ఎమ్మెల్యేలను పక్కనే నిలబెట్టుకుని.. వారి నుంచే ఆ ఇంటికి సంబంధించిన సమాచారాన్ని వారి నోటితోనే చెప్పించేస్తారు. ఇదీ హోం టూర్ల కథా కమామిషు.


మాజీ మంత్రి రోజా తన మంత్రిగా ఉన్నప్పుడు హోం టూర్ ఇంటర్య్వూ ఇచ్చారు. అప్పట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రోజా నగరిలో తన ఇల్లు నిర్మింప చేసుకున్నారు. అయితే దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి . ఆ క్రమంలో ప్రస్తుతం హోమ్ టూర్లు పేరుతో బయటికి వచ్చిన వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు పులివర్తి నాని , అమిలినేని సురేంద్ర , గురజాల జగన్మోహన్, బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి వీరంతా రాజకీయాల్లోకి రాకముందే వ్యాపారాల్లో బిగ్ షాట్స్.. తమ అభిరుచులకు అనుగుణంగా ఎమ్మెల్యేలు కాక ముందే ఇళ్లు నిర్మించుకున్నారు.

అయితే ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఎంపికైన తర్వాత వాటిని ప్రజలకు చూపించాల్సిన అవసరం ఏమొచ్చిందో అన్న చర్చ జరుగుతుంది. పులివర్తి నాని క్వారీలతోపాటు ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ లో ముందు నుంచి ఉండేవాడు. అదేవిధంగా సురేంద్ర అతిపెద్ద కనెక్షన్ కంపెనీ యజమాని , దీంతో పాటు సురేంద్రబాబు తన వద్ద పనిచేసే వేలాది మంది ఉద్యోగులకు సొంతంగా ఇల్లు నిర్మించి ఇచ్చారు. భాను ప్రకాష్ రెడ్డి ముందు నుంచే ట్రాన్స్‌పోర్ట్ రంగంలో ఉన్న వ్యక్తి . గురజాల జగన్మోహన్ బెంగళూరులో రియల్ ఎస్టేట్ కంపెనీ తో పాటు గ్లోబల్ స్కూల్ కూడా నడుపుతున్న బిగ్ షాట్. ఆ విధంగా వారు సంపాదించుకుని కట్టుకున్న ఆస్తులు ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్స్‌పోజ్ చేసుకోవడం ఎందుకు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న చర్చ జరుగుతుంది.

ప్రజా ప్రతినిదులగా ఎంపిక అయిన తర్వాత అరు నెలల కాలంలో వీరు తమదైన అభివృద్ది చేసి చూపించారు. పులివర్తి నాని అయితే చంద్రగిరి నియోజకవర్గంలో ఎంఎల్ ఎగా ఎంపికైన రోజు రహదారుల మీద శ్రద్ద పెట్టి గుంతలు పూడ్పించారు. నియోజకవర్గంలో విచ్చల విడిగా ఉన్న గంజాయి సంస్కృతికి చెక్ పెట్టించాడు. దీంతో పాటు దీర్ఘకాలిక సమస్యల పట్ల శ్రద్ద పెట్టారు. ఇక కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు స్వంత ఖర్చులతో డిఎస్ సి కోచింగ్ సెంటర్ పెట్టారు. సుమారు వెయ్యిమంది అభ్యర్థులు ఉచితంగా ప్రిపేర్ అవుతున్నారు. వారికి వసతి , భోజనాలు కూడా సమకూర్చారు.

గురజాల జగన్‌మోహన్ ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత సొంత ఖర్చులతో అన్న క్యాంటిన్లు నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలికంగా చిత్తూరులో ఉన్న హై రోడ్ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. బిజెపి నేత భానుప్రకాష్‌రెడ్డి టిటిడిలో గత ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన అక్రమాలపై పోరాడారు. దీంతో పాటు ప్రస్తుతం కూడా టిటిడిలోని సమస్యలను పాలక మండలితో పాటు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృష్టి చేస్తున్నారు. తాజాగా శ్రవణం లాంటి సమస్యను పరిష్కారించారు. వీటన్నింటి ప్రజలకు చెప్పుకుంటే రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుంది కాని… తమ ఇళ్లను చూపించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న చర్చ జరుగుతుంది.

ఓ ప్రజా ప్రతినిధిని ఎన్నుకున్నారంటే.. ప్రజలకు అందుబాటులో ఉండాలని.. చాలా సింపుల్ గా ఉండాలని ప్రజలు భావిస్తారు.. కార్యకర్తలు ఆశిస్తారు. సదురు ఎమ్మెల్యేలకు ఆస్తి ఉండొచ్చు.. కానీ దాన్ని ఈ స్థాయిలో ఎలివేట్ చేసుకోవడం ఎందుకనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ తరహాలో తమ దర్పాన్ని.. రాజభోగాలను ప్రజలకు తమంతట తామే చూపించుకోవడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. హోం టూర్లు చేయించుకున్న ఓ ఎమ్మెల్యేని యాంకర్ అడిగిన ప్రశ్న ఏంటంటే.. మీకు 60-70 కార్లు ఉన్నాయట కదా.. అని అడిగితే.. అబ్బే అంత లేదు.. 12-13 కార్లు ఉన్నాయని చెప్పారు సదురు ఎమ్మెల్యే. స్పాట్ ఇంకో ఎమ్మెల్యే అయితే.. ఏకంగా బెంగళూరులో తన ఇంటిని చూపించేశారు.. ఇక మరో ఎమ్మెల్యే అయితే తెల్లవారుఝామునో.. లేక అర్థరాత్రి పూటో హోం టూర్ వీడియోకు.. ఇంటర్వ్యూకు అనుమతి ఇచ్చారు. ఇలా వీడియోలు చేయించుకోవడం.. తీయించుకోవడం తప్పేమీ కాకపోవచ్చు.. కానీ ఇవే రేపు రాజకీయాల్లో వారి ఎదుగుదలకు.. పార్టీకి ఇబ్బందిగా మారే ప్రమాదం లేకపోలేదనే భావన వ్యక్తమవుతోంది.

ఇదే సమయంలో అదే యూ ట్యూప్ ఛానల్ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఇంటిని హోం టూర్ వీడియో చేసింది. ఆ ఎమ్మెల్యే ఇల్లు చాలా సాదాసీదాగా.. సామాన్యుని జీవితానికి చాలా దగ్గరగా ఉంది. వాస్తవానికి ప్రస్తుతమున్న టీడీపీ ఎమ్మెల్యేలు గతంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల కంటే బాగా పనిచేస్తూ ఉండొచ్చు.. ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు. ఆ ఎమ్మెల్యేలు చేసే మంచి పనుల గురించి.. ఆ ఎమ్మెల్యే పడే కష్టం గురించి ఎంతగా చర్చ జరుగుతుందో లేదో తెలీదు కానీ.. ఇలాంటి హోం టూర్ల గురించి చాలా పెద్ద ఎత్తునే చర్చ జరుగుతుంది. మంచి పనుల కంటే.. అక్కర్లేని విషయాల గురించే ఎక్కువగా చర్చ జరుగుతుందనేది అందరికీ తెలిసిన సంగతే.

ఈ విధంగా టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య కంపారిజన్ ప్రజల్లోకి వెళ్తే.. ఎమ్మెల్యేలుగా ఉన్న తమ గురించి.. తమ పార్టీ గురించి.. పార్టీ ఎంచుకున్న అభ్యర్థుల గురించి ఏమనుకుంటారోననే ఆలోచన లేకపోతే ఎలా అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. తమ తమ నియోజకవర్గాల్లో వాళ్లు చేసిన అభివృద్ధి పనుల గురించి.. వాళ్లు చేసిన మంచి కార్యక్రమాల గురించి చెప్పుకుంటే అదో విధానం.. ఇలా డాబు దర్పాన్ని ప్రదర్శిస్తూ చేయించుకున్న వీడియోలు హోం టూర్ల పేర్లతో జనంలోకి వెళ్తే.. రాజకీయంగా నష్టమే తప్ప.. లాభం ఎంత మాత్రమూ ఉండదని అంటున్నారు. పైగా ఇంత డబ్బుందని సాటి వారికి ఈర్ష్య అసూయలు కలుగుతాయి.. అది ఎన్నికల్లో వ్యతిరేకతను పెంచడానికి కారణమవుతాయి. రాజకీయ ఎదుగుదలకు అడ్డంకిగా మారే అవకాశం లేకపోలేదు.

Also Read: ఏపీలో ఆరుగురు మంత్రులపై వేటు.. లోకేష్, పవన్‌తో రాయబారాలు మొదలుపెట్టిన నేతలు.. ఎవరువాళ్లు, ఏమైంది

సదరు ప్రజా ప్రతినిధి చేసే మంచి పనులు గురించి చర్చ జరగాలే తప్ప.. ఆ ప్రజా ప్రతినిధి అంతటి విలాసవంతమైన ఇంటిలో ఉన్నారనే చర్చ రాజకీయంగా పైసాకు పనికి రాని వ్యవహరం. ఈ తరహా వీడియోలు తీస్తామనే అప్రోచ్ అయ్యే వారి విషయంలోనూ కుట్ర కోణం లేకపోలేదనేది ఇంకొందరి అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ ఇంతటి ధనవంతులకు.. డబ్బున్నవాళ్లకు టిక్కెట్లు ఇస్తోంది.. వైసీపీ మాత్రం సామాన్యులకే టిక్కెట్లు ఇస్తోందనే విషయాన్ని ప్రజల్లోకి నెమ్మదిగా ఇంజెక్ట్ చేయడానికే ఈ తరహా ఇంటర్వ్యూలను చేయిస్తున్నారేమోననే చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఒక వేళ వాళ్లు అనుకున్నట్టు ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేకున్నా.. తమ దర్పాన్ని ప్రదర్శించుకునేలా ఇలాంటి వీడియోలు చేయించుకోవడం అవసరమా? అని సదరు ఎమ్మెల్యేలే ఆలోచించుకోవాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×