AP Helmet New Rule: ఏపీలో ఇక అలా కుదరదు. రయ్.. రయ్ మంటూ బైక్ పై దూసుకెళ్లే రోజులు పోయాయి. అది కూడా హెల్మెట్ లేకుండా మీ ఇష్టారీతిన వెళ్లడం ఇక కుదరని పని. అలా చేస్తే ఇక తిప్పలే అంటున్నారు ఏపీ పోలీసులు. ప్రమాదాల నివారణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ఏపీ హైకోర్టు సీరియస్ కాగా, పోలీసులు కూడా అదే రీతిలో చర్యలకు సిద్దమవుతున్నారు.
ఇటీవల ఏపీలో రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రోడ్డు ప్రమాదాలలో కూడా ఎక్కువగా యువత మృతి చెందుతున్న విషయాన్ని కూడా ఉన్నత న్యాయస్థానం ప్రస్తావించింది. అది కూడా హెల్మెట్ ధారణ పాటించక పోవడంతోనే, ప్రమాదాలలో మృతుల సంఖ్య ఎక్కువగా పెరుగుతుందన్న అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం కూడా స్పందించి పోలీసులకు పలు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
అది కూడా ఇప్పటి నుండి బైక్ నడిపే వ్యక్తి మాత్రమే కాకుండా, బైక్ పై వెనుకగా కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధారణ పాటించేలా చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. ఈ నిబంధన పక్కాగా అమలు చేయాలన్న సంకల్పంతో పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగేందుకు సిద్దమవుతున్నారట. అలాగే రవాణా శాఖ అధికారులు కూడా యువతను ప్రమాదాలపై చైతన్య పరిచేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
Also Read: ED Notice to Vijaysaireddy: విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు, సారీ బిజీ అంటూ..
ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా వాహనాలను నడపాలని, లేనియెడల జరిమానాల భారం మోయాల్సిందేనని ప్రభుత్వం కూడా హెచ్చరిస్తోంది. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వాహనదారులు సైతం సహకరించాలని సంబంధిత అధికారులు సైతం కోరుతున్నారు. ఇప్పటి నుండి ఏపీలో ఇష్టారీతిన వాహనాలను నడపడం కుదరదని, వాహనదారులు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు. ఏదిఏమైనా న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది.. ప్రమాదాలలో యువత మృత్యువాత చెందడంపైనే కాబట్టి, ఇప్పటికైనా హెల్మెట్ ధారణ పాటిద్దాం.. ప్రమాదాల సమయంలో మన ప్రాణాలను కాపాడుకుందాం!