E-Paper
Advertisement

కాంగ్రెస్ సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్.. నెక్ట్స్ ప్లాన్?

కాంగ్రెస్ సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్.. నెక్ట్స్ ప్లాన్?
Advertisement

BRS Strategy: స్వేచ్చ బ్యూరో: ప్రభుత్వ వైఫల్యాలపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యిరోజుల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు, డిక్లరేషన్ల వైఫల్యాలపై ఎత్తిచూపేందుకు సిద్ధమవుతుంది. శాసనసభ సమావేశాలకంటే ముందే విమర్శలకు పదునుపెట్టింది. కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రధానప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఇప్పటికే వారం రోజుల కార్యచరణ సైతం ప్రకటించింది. అంతటి ఆగకుండా ట్రబుల్ షూటర్ హరీష్ రావు ప్రతి అంశాన్ని ఆధారాలతో సహా మీడియా ముందు చూపుతూ తప్పిదాలను ఎత్తిచూపుతున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున బెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీలోనూ 22ఏ, రాయదుర్గం భూముల స్కాం,ఆజామాబాద్ భూముల అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడిపెంచేందుకు గులాబీ సిద్ధమవుతుంది. వర్షాకాల సమావేశాలు వేడిని రగుల్చేందుకు బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది.

సర్కార్‌పై మైండ్ గేమ్..

తెలంగాణ రాజకీయ రంగస్థలంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ దూకుడు పెంచింది. రాబోయే శాసనసభ సమావేశాలను వేదికగా చేసుకుని, అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్ని వైపులా నిలదీసేందుకు పక్కా వ్యూహాన్ని రచించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంతో పాటు భూముల వ్యవహారంలో జరుగుతున్న అక్రమాలను ప్రధాన ఆయుధాలుగా మలుచుకుంటూ సర్కార్‌పై ‘మైండ్ గేమ్’ షురూ చేసింది. ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్త నిరసనలకు గులాబీ అధినాయకత్వం పిలుపునిచ్చింది. సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇప్పటికే నేతలకు సైతం ఆదేశాలు ఇచ్చింది. కార్యక్రమ వివరాలను సైతం ప్రకటించింది.

రాత్రికి రాత్రే..

Advertisement

అయితే ఈ నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లో 22ఏ పై ప్రధానంగా పట్టుబట్టేందుకు సిద్ధమవుతుంది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతభూమి ఈ 22ఏ కింద నిషేధిత జాబితాలో పండిందనే వివరాలను సేకరిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాప్రా, బోడుప్పల్ తదితర ప్రాంతాల్లో ఉన్న పట్టా భూములు, ఇళ్ల స్థలాలను రాత్రికి రాత్రే నిషేధిత భూముల జాబితా (22A) కింద చేర్చడంపై గులాబీ దళం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బాధితుల నుంచి సమాచారం సేకరించడంతో పాటు, ఏయే ప్రాంతాల్లో ఏ సర్వే నంబర్లను చేర్చారో వివరాలను భారాస ఇప్పటికే నిశితంగా సేకరించింది.

Also read: బెల్లంపల్లి మున్సిపాలిటీలో పనిచేయని చెత్త ట్రాలీలు.. పట్టించుకోని అధికారులు

పెద్ద ఎత్తున వసూళ్లు..

Advertisement

22ఏ కింద బెదిరించి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు బోడుప్పల్, కాప్రా తో పాటు పటాన్ చెరువు నియోజకవర్గం, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని భూముల వివరాలను సేకరించారు. పటాన్ చెరువు నియోజకవర్గంలోనే 50వేల ఎకరాలు 22ఏ జాబితాలో నమోదైందని వెల్లడించారు. వారం రోజులు ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు. 22ఏ జాబితా నుంచి తొలగించకపోతే సంగారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇదే అంశంపై అసెంబ్లీలో చర్చకు పట్టుపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నంటిని ఎత్తిచూపబోతున్నారు.

ట్రబుల్ షూటర్ దూకుడు..

ట్రుబల్ షూటర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే దూకుడు పెంచారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97 తో పాలిటెక్నిక్ విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని ఆధారాలతో సహ వివరించారు. రాయదుర్గం భూములు, సింగరేణి స్కాం, ఇసుక స్కాం, సోలార్ పవర్ స్కాం, సివిల్ సప్లయి, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, టిమ్స్ ఆసుపత్రి, నిరుద్యోగుల అంశం, ఇరిగేషన్ కృష్ణాజలాలు, దేవాదుల-ఎల్లంపల్లి పంపులు ఆన్ చేయకపోవడం, పంట బోనస్, పింఛన్ల పెంపుపై గళం, విద్యుత్ కోతలు.. లాగ్ బుక్స్ పరిశీలన, గురుకులాల్లో మౌలిక వసతులు, క్రైం రేటు పెంపు తదితర అంశాలన్ని ఆధారాలతో సహ వివరిస్తున్నారు.

కొరకరాని కొయ్యగా..

ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ప్రభుత్వం ఏదైనా అంశంతో ముందుకు పోదామనుకున్న సమయంలోనే దాంతో జరిగే నష్టాలను ఎత్తిచూపుతున్నారు.తాజాగా అజామాబాద్ ఇండస్ట్రియల్ భూముల వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. 500కోట్ల భూమిని 87కోట్లకే విక్రయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని విమర్శలను పదునుపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ల్యాండ్ అమ్మకం చేస్తున్నారని , ఆ భూమి వివరాలను సైతం పక్కా ఆధారాలతో వెల్లడించారు. ప్రభుత్వ భూముల అమ్మకంతో జరిగేనష్టాలను సైతం ప్రజలకు వివరిస్తున్నారు.

Also read: నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

రోడ్డుపై నిరసనలు.. సభలో గందరగోళం

కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం కాకుండా, సెప్టెంబర్ 2 నుంచి వీధులెక్కి నిరసనలు తెలిపేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. బయట నిరసనలతో వాతావరణాన్ని వేడెక్కించి, ఆ వెంటనే ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లోనూ అదే స్థాయిలో ప్రెజర్ పెంచాలని వ్యూహరచన చేస్తున్నారు. అంతేకాదు రైతు, ఉద్యోగ, నిరుద్యోగ, 22ఏ, భూములపై తీర్మానాలకు పట్టుబట్టాలని, ఒక్కొక్కరు ఒక్కో అంశంపై మాట్లాడాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం సూచనలు చేసినట్లు సమాచారం. గతంలో మంత్రులుగా శాఖలకు పనిచేసిన అనుభవం ఉన్నవారు ఆయా శాఖలపైమాట్లాడేందుకు సన్నద్ధమవుతున్నారు.

రాజకీయ సమీకరణాలు

సభలో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే, 22ఏ భూముల అక్రమాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం రాబట్టే వరకు వెనక్కి తగ్గేది లేదని గులాబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతిపక్షం అనుసరిస్తున్న ఈ దూకుడుతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. శీతాకాల సమావేశాలు వేసవిని తలపించనున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఈ దాడిని ఏ విధంగా తిప్పికొడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also read: హిమాలయాల్లో పగిలిన మంచు కొండ.. 2,500 మందికి పైగా గల్లంతు!

Tags

Related News

హిమాలయాల్లో పగిలిన మంచు కొండ.. 2,500 మందికి పైగా గల్లంతు!

పుంగనూరులో టీడీపీ ఇంచార్జి మార్పు కలకలం.. వేదికపైనే కన్నీటి పర్యంతమైన చల్లా బాబు!

రాఖీ పండుగకు వచ్చి.. శవమైన హైదరాబాద్ ఇంటీరియర్ డిజైనర్!

బెల్లంపల్లి మున్సిపాలిటీలో పనిచేయని చెత్త ట్రాలీలు.. పట్టించుకోని అధికారులు

కరీంనగర్ జిల్లాలో గజదొంగలు హల్‌చల్.. జంకుతున్న స్థానికులు!

కరువు నేలకు కృష్ణా జలాలు.. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో మారనున్న రూపురేఖలు!

అక్రమ బంధం పెట్టిన ఘోర వినాశనం.. ఇంటిపై పెట్రోల్ పోసిన బాధితులు!

Big Stories

Advertisement
×