E-Paper
Advertisement

రాఖీ పండుగకు వచ్చి.. శవమైన హైదరాబాద్ ఇంటీరియర్ డిజైనర్!

రాఖీ పండుగకు వచ్చి.. శవమైన హైదరాబాద్ ఇంటీరియర్ డిజైనర్!
Advertisement

Manuguru Gang: హైదరాబాద్‌లో ఇంటీరియర్‌ డిజైనర్‌గా పనిచేస్తున్న శివ అనే యువకుడు రాఖీ పండుగ కోసం సొంతూరు మణుగూరుకు వచ్చాడు. కానీ ఇది తనకు చివరి పండుగ అవుతుందని అతను ఎప్పుడూ ఊహించి ఉండడు. తన దగ్గర పనిచేసే కార్మికుడు సతీశ్‌ సోదరిని ఇంతకుముందు MK గ్యాంగ్‌ వేధిస్తుండగా.. శివ అడ్డుకుని వారిని హెచ్చరించాడు. అప్పటి నుంచే ఆ గ్యాంగ్‌కు శివపై పగ పెరిగింది.

30 మంది గ్యాంగ్‌ సభ్యులు..

శివ ఊరికి వచ్చాడని తెలుసుకున్న గ్యాంగ్‌.. కసితీర్చుకునేందుకు కుట్ర పన్నింది. మాట్లాడుకుందామనే నెపంతో ఏరియా స్టోర్‌ గ్రౌండ్స్‌కు అతడిని పిలిపించారు. అప్పటికే 30 మంది గ్యాంగ్‌ సభ్యులు అతడి కోసమే ఎదురుచూస్తూ మాటేసి ఉన్నారు. శివ అక్కడికి చేరుకోగానే ఒక్కసారిగా అతడిపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. కనికరం లేకుండా పిడిగుద్దులతో దాడి చేశారు.

కొన్ని గంటల్లోనే..

Advertisement

శివను కాపాడేందుకు వెళ్లిన అతని స్నేహితులను కూడా ఆ గ్యాంగ్‌ వదల్లేదు. అయితే మరింత తీవ్రంగా గాయపడిన శివ.. అక్కడికక్కడే గ్రౌండ్‌లో కుప్పకూలి ప్రాణాలొదిలాడు. రాఖీ కట్టించుకోవాలని ఎంతో సంతోషంగా వచ్చిన తమ్ముడు .. కొన్ని గంటల్లోనే శవమై మిగిలాడని అతడి అక్కచెల్లెళ్లు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also read: తెలంగాణలో 22A రచ్చ.. సామాన్యుడి ఆస్తి హక్కులపై బీజేపీ పొలిటికల్ వార్!

ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తా..

Advertisement

ఖాన్ దాన్ అని పేరు పెట్టుకుని మణుగూరును అగ్నిగుండంగా మార్చేస్తున్నారు కొందరు రౌడీ మూకలు. కాలనీల్లో ఆడపిల్లలపై ఈవ్‌టీజింగ్‌లు ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తామనే బెదిరిస్తున్నారు. పిల్లలు ఆడుకోవాల్సిన ఆటస్థలాన్ని మత్తు పదార్థాలు, మద్యం తాగే రౌడీ గ్రౌండ్‌గా మార్చేసి అరాచకం సృష్టిస్తున్నారు.

రక్షణ ఇవ్వండని..

డ్రగ్స్ మత్తులో కళ్ళు మూసుకుపోయిన రౌడీలు.. పాత రౌడీ షీటర్ల అండ చూసుకుని రెచ్చిపోతున్నారు. రౌడీయిజాన్ని ప్రశ్నించిన వృద్ధ తల్లిదండ్రులకు మరణశాసనం రాస్తున్నారు. మా బిడ్డను పొట్టనపెట్టుకున్నారు. రేపు మమ్మల్ని కూడా చంపేస్తారని. తమకు రక్షణ ఇవ్వండని ఆ వృద్ధాప్యపు కళ్లు రాలుస్తున్న కన్నీళ్లు ప్రతీ ఒక్కరి గుండెలను పిండేస్తున్నాయి.

కన్నీటి చిత్రం..

సోదరుడి చేతికి రాఖీ కట్టాలనుకున్న ప్రేగు బంధాల కల.. కన్నీటి చిత్రంగా మారిపోయింది. ఒక అమాయకుడి ప్రాణం బలిగొన్న ఈ గ్యాంగ్‌వార్‌పై పోలీసులు ఎంతవరకు కఠిన చర్యలు తీసుకుంటారో.. మణుగూరు వాసులకు నిజమైన భద్రత ఎప్పుడు వస్తుందో చూడాలి.

Also read: బెల్లంపల్లి మున్సిపాలిటీలో పనిచేయని చెత్త ట్రాలీలు.. పట్టించుకోని అధికారులు

Tags

Related News

ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు షాకింగ్ న్యూస్.. చిక్కుల్లో వెబ్ సైట్..?

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

నామినేటెడ్ పదవుల పంపిణీలో ఢిల్లీ హవా.. అసంతృప్తిలో కాంగ్రెస్ లీడర్లు!

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

లక్నో మర్డర్ మిస్టరీ.. మోడల్ శ్రద్ధా దూబే హత్య కేసులో పూర్తి వివరాలివే?

ఓట్ల చోరీకి మోదీ సూత్రధారి.. అమిత్ షా పాత్రధారి: విపక్ష కూటమి నేతలు ఫైర్!

తెలంగాణ ఉన్నత విద్యకు మరణశాసనంగా మారిన జీవో.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో సంచలనం?

విశాఖ మేయర్ రేసులో ఉన్న మొత్తం లీడర్స్ వీళ్లే.. ఇదిగో ఫుల్ లిస్ట్?

Big Stories

Advertisement
×