BigTV English

TDP Membership: సభ్యత్వం- రాద్ధాంతం.. ఇరకాటంలో పడిన టీడీపీ

TDP Membership: సభ్యత్వం- రాద్ధాంతం.. ఇరకాటంలో పడిన టీడీపీ

తెలుగుదేశం పార్టీకి కోటి మంది సభ్యత్వం

ఈ దేశంలోనే అన్ని రాజకీయ పార్టీల కంటే ఆదర్శంగా ఉండాలనేది.. తెలుగుదేశం నాయకత్వం ఆలోచన. అందుకోసమే.. ఏ పార్టీకి లేనివిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంతో టీడీపీ రికార్డ్ సృష్టించింది. ఇండియాలో మరే పొలిటికల్ పార్టీకి లేని విధంగా.. టీడీపీ కోటి మంది సభ్యత్వం కలిగి ఉంది. అయితే.. కోటి మంది టార్గెట్‌తో.. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందనే టాక్ నడుస్తోందట. వార్డు, గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, పార్లమెంట్ స్థాయిల్లో.. భారీగా సభ్యత్వాల నమోదు టార్గెట్లు పెట్టింది అధినాయకత్వం. ఈ టార్గెట్ రీచ్ అయ్యేందుకు.. మిగతా పార్టీలకు చెందిన మద్దతుదారులకు కూడా తెలుగుదేశంలో సభ్యత్వం నమోదు చేశారట.


టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఎవరికి పడితే వారికి సభ్యత్వం ఇచ్చారా?

పార్టీ హైకమాండ్ దృష్టిలో పడటానికో, లేక నాయకుల మెప్పు పొందేందుకో గానీ.. టార్గెట్ కంప్లీట్ చేసేందుకు.. స్థానిక నాయకులు ఎవరికి పడితే వారికి సభ్యత్వాలు ఇచ్చిన పరిస్థితి ఉందట. ఇదే ఇప్పుడు తంటాలు తెచ్చిపెడుతోందనే చర్చ సాగుతోందట. ఇందుకు.. ఇటీవల పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటనే బిగ్ ఎగ్జాంపుల్ అంటున్నారు. పల్నాడులో జగన్ పర్యటనలో.. తెలుగుదేశం సభ్యత్వం కలిగిన రవితేజ అనే యువకుడు పట్టుకున్న ప్లకార్డు.. ఏపీ రాజకీయాలను అనుకోని మలుపు తిప్పింది. ప్లకార్డులో ఉన్న పుష్ప సినిమా డైలాగ్.. వివాదాస్పదంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వ్యవహారం పైనే హాట్ డిబేట్ నడుస్తోంది. ఆ ప్లకార్డులు, ప్లెక్సీలే.. ఏపీ పాలిటిక్స్‌లో టెంపరేచర్‌ని పెంచాయి.

వైసీపీ రివర్స్ ఎటాక్‌తో ఇరకాటంలో పడిన టీడీపీ

2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్పా.. రప్పా అంటూ పుష్ప డైలాగ్ ఉన్న ప్లకార్డులపై.. నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆ ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి చుట్టే రాజకీయమంతా తిరుగుతోంది. అతను టీడీపీకి చెందిన వ్యక్తి అంటూ.. అతని తెలుగుదేశం మెంబర్‌షిఫ్ కార్డును వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో.. వివాదం మరింత ముదిరింది. టీడీపీ సభ్యత్వం ఉన్న కార్డును.. సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో మరింత అగ్గి రాజుకుంది. ఆ వివాదాస్పద ప్లెక్సీ పట్టుకున్నది టీడీపీ సభ్యుడేనని వైసీపీ నేతలు చెప్పడంతో.. టీడీపీ ఇరకాటంలో పడింది. కానీ.. వైసీపీ వాదనను తెలుగుదేశం నేతలు కొట్టిపారేస్తున్న పరిస్థితి నెలకొంది. సభ్యత నమోదు టార్గెటే ఇప్పుడు టీడీపీని ఇబ్బందులపాలు చేసిందనే టాక్ పార్టీలో వినిపిస్తోందట.

Story By Anup, Bigtv Live

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×