E-Paper
Advertisement

TDP Silence: పులులన్నీ ఎక్కడ? గుంటూరు టీడీపీ సీనియర్ల మౌనం వెనుక మర్మమేంటి?

TDP Silence: పులులన్నీ ఎక్కడ? గుంటూరు టీడీపీ సీనియర్ల మౌనం వెనుక మర్మమేంటి?
Advertisement

TDP Silence: వైసీపీ నాయకులు నేరుగా చంద్రబాబు, లోకేష్‌పై వ్యక్తిగత విమర్శలు, బూతులతో రెచ్చిపోతుంటే టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులు చోద్యం చూస్తుండటంపై పార్టీలో వారిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీలో సీనియర్లకు కొదవలేదు. వారిలో ఒకరేమో డెల్టా టైగర్‌ని అంటారు.. ఇంకొకరేమో పల్నాడు పులినని చెప్పుకుంటారు.. కానీ ఈ పులులన్నీ ఇప్పుడు ఎక్కడ..? ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వినిపిస్తున్న ప్రశ్న. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు బూతుల వ్యవహారం పెద్ద దుమారం రేపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు అంబటిపై ఫైర్ అయి ఎక్కడికక్కడ అంబటిపై కేసులు పెట్టారు. కానీ మన పులులు దాక్కున్నాయా? అని జిల్లా తెలుగు తమ్ముళ్లు చర్చించుకోవాల్సి వస్తోందంట.

వరుస కేసుల్లో అంబటి అరెస్ట్

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వరస కేసులు నమోదు అయ్యాయి. అంబటిని పోలీసులు అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్‌కు పంపారు. తనపై నమోదైన మొదటి రెండు కేసుల్లో బెయిల్ అంబటికి బెయిల్ వచ్చింది. ఇక ఆయన బయటకు వస్తారనుకునే లోపే సంక్రాంతి లక్కీ డ్రా కేసు మెడకు చుట్టుకుంది. ఆ కేసుకు సంబంధించి పోలీసులు కోర్టుకు హాజరుపరిచే సమయంలో ‘పుష్ప’ సినీ మ్యానరిజంతో అంబటి ..తగ్గేదేలే.. అన్నట్లు హావభావాలు ప్రదర్శించడం వివాదాస్పదమైంది. తర్వాత లక్కీ లాటరీల కేసులో ఆయనకు కోర్టు మళ్లీ రిమాండ్ విధించింది.

అంబటి వ్యాఖ్యలపై సెటైర్లు

Advertisement

అలా రాజమండ్రి జైల్లో 18 రోజులు జైలు జీవితం గడిపిన అంబటి ఎట్టకేలకు ఈ నెల 18న విడుదలయ్యారు. అయినా ఆయన వైఖరిలో మార్పురాలేదు. జైలు నుంచి విడుదలయ్యాక మీడియాతో మాట్లాడిన ఆయన మరోసారి తన అహంకారం ప్రదర్శించారు. తాను చాల రిచ్ అని.. అయినా జైలు భోజనం తనకు నచ్చకపోయినా తినాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. తనకు జైలు కూడా తినిపించారని అంబటి చెప్పడంపై నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు. 18 రోజలు జైలు భోజనం చేసినా ఆయన కొంచెం కూడా చిక్కిపోలేదని, ఆయన ఫిట్‌నెస్ అలాగే మెయిన్‌టెయిన్ చేయాలని, ఇంట్లో కూడా జైలు భోజనం చేసే అవకాశాలు పరిశీంచాలని తెగ ట్రోల్ చేస్తున్నారు.

అంబటి అరెస్ట్‌పై జగన్ ఆగ్రహ ర్యాలీ…

ఇక 18 రోజుల జైలు జీవితాన్ని బాగా ఎంజాయ్ చేశానంటున్న అంబటి.. దాన్ని తాను శిక్షగా భావించనని, జైలు జీవితం తనలో పట్టుదల మరింత పెంచిందని .. అదేదో ఘనకార్యంలా చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా జైల్లో పెడితే భయపడతానని చంద్రబాబు, లోకేశ్ అనుకున్నారని, కాని అంబటి రాంబాబుకు భయమంటే ఏంటో తెలియదని గర్వంగా వెల్లడించారు. అలాంటి అంబటికి ఏదో అన్యాయం జరిగిపోయిందని.. కాపు నేతపై చంద్రబాబు కక్ష సాధిస్తున్నారంటూ వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ పెద్ద ర్యాలీ చేసి మరీ విమర్శలు చేశారు. జగన్ విమర్శలు, అంబటి ఎపిసోడ్లో టీడీపీ నేతల తరఫున ఎవరు స్పందించారనే విషయం ఇప్పుడు పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యల తర్వాత ఆయన ఇంటి దగ్గర నిరసన వ్యక్తం చేసినప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన నేతలెవరు పాల్గొన్నారని పార్టీ పెద్దలు ఆరా తీశారంట.

గుంటూరు టీడీపీలో నేతల వైఖరి పై చర్చ

Advertisement

అంబటికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళన చేసిన సమయంలోఉమ్మడి గుంటూరు జిల్లాలో పులులు అని చెప్పుకునే ఒక్కనేత కూడా కనిపించ లేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బీసీ మహిళ గళ్లా మాధవి, ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎస్సీ నేత రామాంజనేయులుతో పాటు బీసీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు మాత్రమే ఆందోళనల్లో పాల్గొన్నట్లు పార్టీ పెద్దలకు తెలిసింది. నిజానికి ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేతలంతా గుంటూరులో లేదా హైదరాబాద్లో ఉంటారు. డెల్టా టైగర్ అని చెప్పుకునే ఆలపాటి రాజేంద్రప్రసాద్, ధూళిపాళ్ల నరేంద్ర, పల్నాడు టైగర్ అనిపించుకునే యరపతినేని శ్రీనివాస్, తామే పార్టీ.. మాదే పార్టీ అని గొప్పగా చెప్పుకునే ప్రత్తిపాటి పుల్లారావు, భాష్యం ప్రవీణ్ వంటి కమ్మ సామాజికవర్గం నేతలంతా గుంటూరులోనే ఎక్కువగా ఉంటారు. కాని ఆందోళనల్లో మాత్రం పాల్గొనలేదు.

అధినేతపై దూషణలు.. కానీ నేతల మౌనం ఎందుకు?

ఇంకా చెప్పాలంటే.. అంబటి బూతులతో రెచ్చిపోయిన రోజున వారంతా పెన్షన్ పంపిణీ కోసం తమ తమ నియోజకవర్గాల్లో బీజీగా ఉన్నారంట. అయితే ఘటన జరిగిన రోజు సాయంత్రానికి దాదాపుగా అందరూ గుంటూరు చేరుకున్నారని పార్టీ అధిష్టానికి నివేదిక అందిందంట అయితే వీళ్లల్లో కనీసం ఒక్కరు కూడా ఆ రోజు ఇంటి నుంచి రోడ్ల మీదకు రాలేదని.. అధినేతను బూతులు తిట్టినా కూడా.. కనీసం వారికి చీమ కూడా కుట్టినట్లు కూడా లేదని ఆ నివేదికలో స్పష్టంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

సీనియర్ నేతల వైఖరిపై ప్రశ్నల వర్షం

అంబటి నివాసం దగ్గరకు ఆఘమేఘాల మీద వచ్చిన వారంతా బీసీ కార్యకర్తలు, దళిత దండోరా వర్గానికి చెందిన వాళ్లే . గుంటూరు సిటీలో ఉన్న పార్టీ సీనియర్ నేతలంతా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారనే విషయం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. వారిలో ఆలపాటి, ప్రత్తిపాటి మంత్రి పదవులు కూడా అనుభవించారు. సీనియర్ ఎమ్మెల్యేలు యరపతినేని, దూళ్లిపాళ్ల పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి పదవులు కావాలి కాని.. పార్టీకి, కార్యకర్తలకు అండగా ఎందుకు నిలబడరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయట. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం తెర వెనుక వ్యాపార సంబంధాలేనా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

సీనియర్ల సైలెన్స్‌పై పార్టీ పెద్దల ఆగ్రహం

కొంతమంది నేతలైతే.. ఇలా ధర్నాలు, ఆందోళనలకు వెళితే.. సొంత పార్టీ నేతలని కూడా చూడకుండా కేసులు పెడతారని.. అదంతా అవసరమా అని గమ్ముగా ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. దీనిపై ఇప్పుడు ఆయా నేతలంతా ఎవరి కారణాలు వాళ్లు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంట. కొందరూ గుంటూరులో అందుబాటులో లేనంటున్నారట. ఇంకొకరు మాత్రం.. తాను ప్రయాణంలో ఉన్నాను.. అసలేం జరిగిందో కూడా తెలియదు అని బుకాయిస్తున్నారట. ఎన్నికల ముందు వరకు మా పార్టీ అని గొప్పగా చెప్పుకున్న సీనియర్ నేతలు.. ఇప్పుడు మాత్రం.. నాకెందుకు వచ్చిందిలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు అధినేత దృష్టికి వచ్చిందట. తొలిసారి ఎన్నికైన గల్లా మాధవి, రామాంజనేయులు వంటి బీసీ, ఎస్సీ నేతలు చూపించి తెగువను సీనియర్లు ఎందుకు చూపించలేదని పార్టీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారట.

గుంటూరు టీడీపీ సీనియర్ల వ్యవహారం హాట్‌టాపిక్

మొత్తం వ్యవహారం అధిష్టానం దృష్టికి రావడంతో, కారణాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని పార్టీ పెద్దలను లోకేష్ ఆదేశించినట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రస్తుత ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేల వ్యవహారతీరు హాట్ టాపిక్‌గా మారింది. మరి సీనియర్ నేతల వ్యవహారతీరు వారికి సెల్ఫ్‌గోల్‌గా మారుతుందా? లేకపోతే అధిష్టానం వారిని చూసి చూడనట్లు వదిలేస్తుందో? చూడాలి.

Story by: Apparao, Big Tv

Related News

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

ఫిఫా ఫైనల్ కురుక్షేత్రం.. 16 ఏళ్ల కల నెరవేరిన వేళ.. కన్నీళ్లతో మెస్సీ వీడ్కోలు!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

Big Stories

Advertisement
×