Telangana BJP: దీర్ఘకాలిక వ్యాధిలా తెలంగాణ బీజేపీలో కొత్త పాత నేతల రగడ కొనసాగుతున్న నేపధ్యంలో…. పల్లెల్లో ‘కమలం’ వికసించిందా..? ఢిల్లీ పెద్దలు ఇచ్చిన టార్గెట్‌ను పంచాయతీ ఎన్నికల్లో గల్లీ నేతలు రీచ్ అయ్యారా..? పంచాయతీ రణరంగంలో ‘కాషాయ పరివారుల’ లెక్కలు పక్కాగా వర్కవుట్ అయ్యాయా..? అసలు ఆ పార్టీ పెద్దలు పెట్టిన టార్గెట్ ఏంటి? కాషాయ శ్రేణులు ఎంత వరకు రీచ్ అయ్యాయి?
గ్రామ పంచాయతీల అభివృద్ధికి వెచ్చిస్తున్న నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివే…కేంద్రం ఇచ్చే నిధులతోనే గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గ్రామ పంచాయతీలు కుంటుపడ్డాయనే ప్రధాన ఎజెండాతో సర్పంచ్ ఎన్నికల బరిలో దిగిన బీజేపీ మరోసారి బొక్కబోర్లా పడిందనే టాక్ ఆ పార్టీతో పాటు, పొలిటికల్ సర్కిల్లో నడుస్తోందట. రాష్ట్రానికి పదేళ్లలో కేంద్రం ఇచ్చిన పది లక్షల కోట్ల నిధులు, రామ రాజ్యం వంటి అంశాలు తెలంగాణ పల్లెల్లో పని చేయలేదా అన్న చర్చ నడుస్తుందట.
ఈ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఇండిపెండెంట్ల సంఖ్యను కూడా కమలం పార్టీ దాటకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 90 తో 90 స్థానాలు సాధిస్తామన్నారు… సాధించలేకపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ అన్నారు..సింగిల్ డిజిట్ కి పరిమితమయ్యారు. కనీసం గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఇండిపెండిట్ ల సంఖ్యను క్రాస్ చేయలేకపోవడం ఆ పార్టీ వైఫల్యానికి నిలువుటద్దం పడుతోందంటున్నారు.
గత ఎన్నికల్లో ఎమ్మేల్యే, ఎంపీ సీట్లు ఎవరికిచ్చినా…ఏ నేతలకిచ్చినా….కేంద్ర,రాష్ట్ర నాయకత్వాల ఆదేశాలతో గ్రామ పంచాయితీ స్థాయిలో కమలం పార్టీ నేతలు, శ్రేణులంతా కష్టపడి …చిత్తశుద్ధితో పనిచేసిన గౌరవప్రధంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లను గెలిపించుకున్నాయి. అదే నాయకత్వాలు గ్రామ స్థాయిలో సర్పంచ్ లను గెలిపించుకోవడంలో విఫలం అయ్యాయన్న విమర్శలు ఉత్పన్నమవుతున్నాయట. అందుకు ప్రధానంగా కొత్త, పాత నేతల పంచాయితిలే కారణమన్న టాక్ సైతం నడుస్తోందట.
ఈ సర్పంచ్ ఎన్నికల్లో కొత్త నేతలు తప్పితే పాత నేతలు ఎవరు సహకరించలేదనేది పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుందట. కరీంనగర్ లాంటి జిల్లాలో ప్రత్యర్థి పార్టీలకు ఫండింగ్ ఇచ్చి సొంత పార్టీ అభ్యర్థులనే ఓడించేందుకు ప్రయత్నం చేశారన్న తీవ్ర ఎలిగేషన్స్ ఇప్పుడు ఆ పార్టీలో రచ్చ రేపుతున్నాయట. తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ మినహాయిస్తే మెజారిటీ జిల్లాల్లో భారీగా పార్టికి డ్యామేజ్ జరిగింది. అంతేకాదు గెలిచిన ఎంపీ లలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహాయిస్తే మిగతా 6గురు ఎంపీలు ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త నేతలే.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మోల్యే దంపాల్ సూర్యనారణ గుప్తా మినహాయిస్తే మిగతా 6 గురు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త నేతలే. మరి.. పాత నేతల హవా ఎక్కడున్నట్టు అనే చర్చ నడుస్తుందట. పాత నేతలు గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయినట్టు… అదిసరే కనీసం సర్పంచ్ ఎన్నికల్లో ఎందుకు నెగ్గలేకపోయారు..? తమ హవా ఎందుకు చూయించలేకపోయారు..? అన్న ప్రశ్నలు ఆ పార్టీ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయట.
పల్లెల్లో కమలం వికసించిందా.. లేదా అన్నది అటుంచుతే.. ఆ పార్టీ నాయకత్వాలు అంతర్మధనం చేసుకుంటాయా… లేదా అన్నది చర్చినీయంశంగా మారింది. బీజేపీ నేతృత్వంలో నడిచే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు గ్రామీణంలో పనిచేయలేదనే టాక్ జోరుగా నడుస్తుందట. దీంతో బీజేపీలో కొత్త పాత నేతల రగడ కొనసాగుతున్న పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలు మరో రచ్చను సార్ట్ చేశాయనే గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయట. సర్పంచ్ లను గెలిపించాం.. ఇది మా పనితనం… మీ పనితనం ఏమైంది…. విమర్శలు కాదు పనితనం కావాలంటూ పాత నేతలకు కొత్త నేతలు సవాల్ విసురుతున్నారట. బీజేపీలో నయా నేతల నయా ట్రెండ్ మొదలయిందానే చర్చ నేతల మధ్య నడుస్తుందట. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో నయా నేతల ఎత్తుగడలు ఫలించాయనే మాటలు పార్టీ నేతల మధ్య వినిపిస్తున్నాయట. సరికొత్త వ్యూహాలతో సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటి, పార్టీలో పాత నేతలకు సవాల్ గా మారుతున్నారానేది పొలిటిక్ సర్కిల్స్ నడుస్తున్న చర్చ.
12702 గ్రామపంచాయితీలో బీజేపీ గెలిచింది పట్టుమని 700 స్థానాలు .. అందులో కూడా సవాలక్ష సందేహాలు ఇప్పుడు ఆ పార్టీనీ తొలుస్తున్నాయి. బీజేపీ గెలిచిన సర్పంచ్ ల లిస్ట్‌లో నిర్మల్ టాప్ లో ఉంది. తన ఇలాకాలో హైయెస్ట్ సర్పంచులను నెగ్గి బీజేపీలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి టీమ్ చరిత్ర సృష్టించింది. సెకండ్ ప్లేస్ లో ఆదిలాబాద్ నిలిచింది. నేతల అంతర్గత కుమ్ములాటల వల్ల కరీంనగర్లో పార్టీకి భారీగా డ్యామేజ్ జరిగిందనే టాక్ పార్టీలో నడుస్తుందట. పాలమూరు డీకే అరుణ ఇలాకాలో బీజేపీ అభ్యర్థులు అక్కడక్కడా అనూహ్య విజయాలు సాధించారు . ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించడంలో విఫలం అయిన నిజామాబాద్, మెదక్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డిల్లో బాధ్యులు పాతనేతలేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట.
నిత్యం కొత్త నేతలు అంటూ నిత్యం వారిపై దుమ్మెత్తి పోసే పాత పరివారులకు, మాటలు కోటలు దాటినా…కాళ్లు బీజేపీ ఆఫీస్ గడప దాటని పాతనేతలకు ఈ సర్పంచ్ ఎన్నికల్లో కొత్త నేతల టీమ్ వర్క్ ఫలితాలు గట్టి సమాధానం ఇచ్చాయనేది టాక్. ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు గ్రౌండ్ లెవల్లో ఎక్కడ కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పదవులు ఇచ్చింది పార్టీ ఆఫీస్ లల్లో కూర్చోవడానికేనా అనే ప్రశ్నలు ఎదురువుతున్నాయట. గ్రౌండ్ లెవల్లో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయరాన్న విమర్శలు సైతం ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నాయట.
మొత్తం మీదా పంచాయితీ ఎన్నికల్లో పాత నేతలు ఘోరంగా విఫలం అయ్యారనే చర్చ కొత్త నేతల వర్గాల్లో నడుస్తోందట. అయితే ఈ ఎన్నికల్లో పాత నేతలు విఫలం అయ్యారా లేదా అన్నది అటుంచితే.. ఈ సర్పంచ్ ఎన్నికలు కేవలం టీజర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది అంటూ డైలాగులు పేలుస్తున్నారట కొత్త నేతలు. అంతేకాదు రాబోయే ఎంపిటిసి, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం ట్రైలర్ చూపిస్తామంటున్నారట. కొత్త నేతల్లో మొదలైన సర్పంచ్ ల విజయాల ‘జోష్’.. రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ పీఠాలను నెగ్గేంతవరకు వెళ్తుందా….లేక మధ్యలోనే చల్లబడుతుందా అనేది అసక్తికరంగా మారింది.
Story by Ramireddy, Big Tv