BigTV English
Advertisement

CM YS Jagan Counter To Pawan : మూడు పెళ్లిళ్లా? మూడు రాజధానులా? జనసేనానికి జగన్ కౌంటర్

CM YS Jagan Counter To Pawan : మూడు పెళ్లిళ్లా? మూడు రాజధానులా? జనసేనానికి జగన్ కౌంటర్

CM YS Jagan Counter To Pawan : మంగళగిరి జనసేన సమావేశంలో పవన్ కల్యాణ్ వైసీపీ నేతలను మాటలతో చీల్చి చెండాడారు. కాలి చెప్పు తీసి చూపించి మరీ.. తాట తీస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. నో డైలాగ్స్.. ఇక యుద్ధమేనంటూ సవాల్ చేశాడు. నా కొడకల్లారా… అంటూ పక్కా పోకిరీ స్టైల్ లో.. బూతులు మాట్లాడే వైసీపీ నేతలకు వారికి అర్థమయ్యేలా.. వారి భాషలోనే డైలాగ్ డైనమైట్స్ పేల్చారు. ముందెప్పుడూ లేనివిధంగా.. బుధవారం నాటి పవన్ స్పీచ్ ఏపీలో కాక రేపుతోంది. వైసీపీని ఉలిక్కిపడేలా చేసింది.


మామూలుగా అయితే.. పవన్ వ్యాఖ్యలపై పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేశ్, అంబటి రాంబాబు లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్లు కౌంటర్లు వేయడం కామన్. కానీ, ఈసారి జనసేనాని కొమరం పులిలా విరుచుకుపడటంతో.. నేరుగా వైసీపీ అధినేత, సీఎం జగనే రంగంలోకి దిగాల్సి వచ్చింది. జనసేనాని మాటలపై, మూడు పెళ్లిళ్ల మేటర్ పై జగన్ పంచ్ లు, సెటైర్లు వేశారు. చెప్పులు చూపిస్తూ.. బూతులు తిడుతూ.. కొందరు వీధి రౌడీలను మించిపోయారంటూ.. పరోక్షంగా పవన్ కల్యాణ్ ను కార్నర్ చేశారు జగన్. చంద్రబాబే పవన్ తో ఇలా మాట్లాడిస్తున్నారనే అర్థం వచ్చేలా.. దత్త పుత్రుడితో ఏం మాట్లాడిస్తున్నారో చూస్తున్నారుగా అంటూ జగన్ విమర్శించారు. పనిలో పనిగా.. పవన్ మూడు పెళ్లిళ్ల డైలాగ్ పైనా జగన్ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. ఎన్టీఆర్‌ జిల్లా అవనిగడ్డలో జరిగిన రైతుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ జనసేనానిపై వీర లెవెల్లో విరుచుకుపడ్డారు.

తాను చట్టప్రకారం విడాకులు తీసుకొని మూడు పెళ్లిళ్లు చేసుకున్నా.. కావాలంటే మీరూ చేసుకోండి ఎవరు వద్దన్నారు.. అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను సీఎం జగన్ తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని చెబుతుంటే.. కాదు కాదు, మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని కొందరు అంటున్నారంటూ పవన్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇలాంటి సందేశాలతో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారంటూ జగన్ ప్రశ్నించారు. వాళ్లు అలా మాట్లాడడం మొదలుపెడితే.. మన ఆడవాళ్ల మానప్రాణాలు, అక్కాచెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి? ఒక్కసారి ఆలోచించండి అంటూ సీఎం జగన్‌ ప్రజలకు పిలుపు ఇచ్చారు.


Tags

Related News

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ బైపోల్‌.. బీఆర్ఎస్‌కు కవిత గండం

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Big Stories

×