BigTV English

Meridian Hotel Issue: మెరీడియన్ హోటల్ వివాదం.. వైసీపీతో కూటమి నేతలు డీల్..?

Meridian Hotel Issue: మెరీడియన్ హోటల్ వివాదం.. వైసీపీతో కూటమి నేతలు డీల్..?

తిరుపతిలోని కపిల తీర్థం సర్కిల్ అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం.. తిరుమలకు వెళ్ళే భక్తులు.. తిరుపతికి వచ్చే వాహానాలతో పాటు మదనపల్లి , రాయచోటి, అనంతపురం , బెంగుళూరు వెళ్ళే వాహానాలతో నిరంతరం ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. అక్కడ ట్రాఫిక్ ను నియంత్రించడానికి పోలీసులు అష్టకష్టాలు పడుతుంటారు. ఇక సోమవారంతో పాటు శివరాత్రి పర్యదినాలు, కార్తీక మాసం ,అమావాస్యలాంటి రోజులలలో అయితే మరింత ఇబ్బందిగా ఉంటుంది. రోడ్డు దాటుకోవడానికి అష్ట కష్టాలు పడాల్సి ఉంటుంది.

అలాంటి ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఉంటే రహాదారి విస్తరణకు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే గరుడ వారధి దిగిన తర్వాత అక్కడ ఎక్కువుగా వ్యాపార అవకాశాలు ఉండటంతో వైసీపీ హయాంలో అక్కడ హోటల్స్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. నగర పాలక సంస్థ అవసరాలకు కేటాయించిన స్థలం కూడా కావడంతో వాటిలో స్మార్ట్ సిటి నిధులతో నిర్మాణం ప్రారంభించారు. సుమారు రెండున్నర కోట్లు వ్యయంతో నిర్మాణం చేసారు. నిర్మాణ సమయంలోనే పుట్ పాత్ లను సైతం అక్రమించారు. రెండున్నర కోట్ల వ్యయంతో విలాసవంతమైన హోటల్ తో పాటు వివిధ రకాల దుకాణాలు వచ్చేటట్లు నిర్మించారు.


తిరుమలలో తమ వ్యవహారాలు చక్క పెట్టే వ్యక్తికి మాజీ ఎమ్మెల్యే ఆ హోటల్‌ను కేటాయించారు. నెలకు రెండున్నర లక్ష అద్దె ప్రాతిపాదికన లీజుకు ఇచ్చారు. నగర పాలక సంస్థ కేటాయించిన స్థలమే కాకుండా పక్కనున్న ఖాళీ స్థలాన్ని అక్రమించి నిర్మాణాలు చేసిన అటు నగరపాలక సంస్థ కాని తుడా కాని పట్టించుకోలేదు. సామాన్యుడు రహాదారి వారిన బైక్ నిలిపితే అడ్డగొలుగా పైన్ లు వేయడంతో పాటు బైక్ ను స్టేషన్ కు తరలించే పోలీసులు.. ఆ హోటల్ యాజమాన్యం అడ్డగోలుగా రహాదారిని పార్కింగ్ గా మార్చుకున్నా కనీసం పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలోని ఓ ప్రజా ప్రతినిధి ఇందులో వాటా దారుడిగా అప్పట్టో ప్రచారం జరిగింది.

Also Read: చక్రం తిప్పిన జగన్.. వైసీపీలోకి శైలజానాథ్..?

ప్రభుత్వం మారిన తర్వాత కూటమిలోని టిడిపి నాయకులు హోటల్స్ అక్రమణలపై చర్య తీసుకోవాలని ఫిర్యాదులు చేసారు. అసలు అంతడబ్బు ఎందుకు ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. అయితే కూటమిలోని మిత్రపక్షం సహాకారంతో ఇప్పుడు హోటల్ నిర్వహణ జరుగుతుందని అంటున్నారు. దానికితోడు గతంలో హోటల్ భాగస్వాములుగా ఉన్నవారు తిరుమలలో వైసిపి తరపున చక్రం తిప్పి ప్రస్తుతం టిడిపి గూటిలో చేరడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తికి హోటల్ బాధ్యతలు అప్పగించారంట. ఈ మధ్య కాలంలో రాష్ట స్థాయిలో పదవి పొందిన ఓ నాయకుడు తాను అంతా చూసుకుంటానని హామీ ఇవ్వడంతో ప్రస్తుతం హోటల్ వైపు అధికారులు తొంగి చూడటం లేదంట.

తిరుపతిలో విశాఖ శారద పీఠాధిపతి అనుమతులు తీసుకున్న దాని కంటే ఎక్కువ నిర్మాణాలు చేసాడని అతని లీజులు రద్దు చేశారు. అలాగే ఇక్కడ కూడా జరిగిందని హోటల్ లీజులు రద్దు చేయాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా తిరుమలకు వెళ్ళే టర్నింగ్ లో హోటల్ ఉండటం వల్ల వాహాన దారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పటి కైనా కూటమి ప్రభుత్వ పెద్ద లు దీనిపై విచారణ నిర్వహించి హోటల్ అక్రమణలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదాయం పంచుకుందామని వైసీపీనేతలు ఇచ్చిన అఫర్ ను కూటమి నేతలు అంగీకరించడంతో చర్యలు తీసుకోవడం లేదని కూటమి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆ కుమ్మక్కు తతంగం బయటపడితే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాయి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×