KTR trolling fear: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడీగా సాగుతున్నాయా? అధికార పార్టీ ఎత్తులకు విపక్షం బీఆర్ఎస్ చిత్తు అవుతోందా? అనుభవ నాయకుల ముందు బీఆర్ఎస్ సభ్యులు బోల్తా పడుతున్నారా? కేసీఆర్ లక్షణాల్లో ఒక్కటీ కూడా కేటీఆర్‌కు రాలేదా? కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారసులెవరు? కేటీఆర్.. కవిత, హరీష్‌రావు ఈ ముగ్గురిలో ఎవరు? అనేది పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. తానంటే తాను అంటూ ముగ్గురి నేతల మధ్య గేమ్ మొదలైంది. ఇంతకీ కేసీఆర్ వారసత్వ లక్షణాలు ఎవరికి పుష్కలంగా ఉన్నాయి. ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతోంది.
రైతుల సమస్యలు చర్చించాలంటూ మంగళవారం నల్లని వస్త్రాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అంతేకాదు చేతికి సంకెళ్లు కూడా వేసుకొచ్చారు. ఎందుకు అలా వచ్చారనేది కాసేపు పక్కనబెడదాం. కాబోయే ముఖ్యమంత్రి అంటూ అభిమానులతో పిలుపించుకుంటున్న కేటీఆర్, నేతల ఆందోళనలో కనీసం కనిపించలేదు.
ఎక్కడో వెనుక ఉన్నారు కేటీఆర్. ఆయన ఎందుకల్లా బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. ఆందోళన చేసిన నేతల్లో చిన్నపాటి చర్చ మొదలైంది. నాయకుడు అనేవాడు ముందు ఉండి నడిపించాలి. కానీ మంగళవారం అసెంబ్లీ బయట ఆందోళనలో సీనంతా రివర్స్ అయ్యింది. ఎమ్మెల్యేలు చేతికి సంకెళ్లు వేసిన నిరసన తెలుపుతుంటే, కేటీఆర్ వెనుకలో కనిపించారు.
ALSO READ: నార్సింగి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ పై ఫేక్ ప్రచారం.. హెచ్ఎండీఏ స్పందన ఇదే!
చేతికి బేడీలు వేసుకుంటే రేపటి రోజున ట్రోలింగ్ చేస్తారని కేటీఆర్ భయపడ్డారట. ఫార్ములా ఈ-రేస్ స్కామ్‌లో రేపో మాపో అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం సాగుతోంది. ఇప్పుడు బేడీలు వేసుకున్న ఫోటోలతో రేపటి రోజున లేని పోని విధంగా రచ్చ చేస్తారని భావించి దూరంగా ఉన్నారని అంటున్నారు.
మీడియా ముందుకొచ్చేసరికి కేవలం కేటీఆర్ మాట్లాడుతారని అంటున్నారు. మిగతా నేతలకు ఆ ఛాన్స్ ఇవ్వరని కొందరు నేతల మాట. సింపుల్‌గా చెప్పాలంటే సైన్యాన్ని ముందు పెట్టి పోరాటం చేయడం అన్నమాట. పురాణాల్లో కూడా దేవతలకు-రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు ఇలాగే జరిగిందని గుర్తు చేసుకుంటున్నవాళ్లూ లేకపోలేదు.
మరోవైపు సంధ్య థియేటర్ ఘటనలో అల్లుఅర్జున్ అరెస్టుపై ఎవరి వాదనతో ఏకీభవి స్తున్నారు? అనే ప్రశ్నకు సోషల్ మీడియా వేదికగా పోల్ నిర్వహించారు. అందులో కేటీఆర్‌కు కేవలం 33 శాతం రాగా, సీఎం రేవంత్ రెడ్డికి 66శాతం ప్రజలు మద్దతు ఇచ్చారు. ఈ లెక్కన ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలను దాదాపుగా సమర్థించినట్టే.
తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏర్పడి నుంచి ఇప్పటివరకు తీసుకుంటున్న వాటిపై కొందరు పోల్ నిర్వహించారు. మాగ్జిమమ్ ప్రభుత్వం తీసుకున్నవాటికే దాదాపు నెటిజన్స్ మద్దతు పలికారు. ఈ విషయంలో కేటీఆర్ వెనుకబడిపోయారని అంటున్నారు. బహుశా వెనుక ఉండి కేటీఆర్ ఆందోళన చేయడమే దీనికి కారణంగా చెబుతున్నారు. మొత్తానికి టిల్లన్న ఏ అంశం ఎత్తుకున్నా బూమరాంగ్ అవుతోందని కొందరు గులాబీ శ్రేణులు గుసగుసలాడు కోవడం కొనమెరుపు.