BigTV English

India VS America: భారత్‌పై 500 శాతం పన్ను.. ట్రంప్ ప్లాన్ అదేనా!

India VS America: భారత్‌పై 500 శాతం పన్ను.. ట్రంప్ ప్లాన్ అదేనా!

అమెరికన్ సెనెటర్లు.. గ్రాహం, బ్లూమెంటల్..

ట్రంప్ పైనా ఆధార పడి ఉన్న రష్యన్ బిల్లుఅమెరికన్ సెనెటర్లు.. గ్రాహం, రిచర్డ్ బ్లూమెంటల్.. ఇద్దరూ వేర్వేరు పార్టీల వారు. వీరిలో గ్రాహం రిపబ్లికన్ కాగా.. బ్లూమెంటల్ డెమొక్రాట్. ఈ ఇద్దరూ కలసి.. చేసిన ప్రతిపాదన ఏంటంటే.. రష్యా నుంచి ఇంధనం కొంటున్న భారత్, చైనావంటి దేశాల దిగుమతులపై 500 శాతం పన్ను వేయాలని సూచించారు. ఈ ద్వైపాక్షిక బిల్లు ద్వారా ఉక్రెయిన్ తో రష్యా చేస్తున్న యుద్ధానికి చెక్ పెట్టాలని చూస్తున్నారట. ఇదెక్కడి వింత విడ్డూరమో అర్ధం కావడం లేదంటున్నారు కొందరు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.


ఈ బిల్లు పేరు శాంక్షనింగ్ రష్యా చట్టం- 2025

ఈ ఇద్దరు సెనెట్లు ప్రవేశ పెట్టిన బిల్లు పేరేంటో తెలుసా.. శాంక్షనింగ్ రష్యా చట్టం- 2025. ఇంతకీ దీని అసలు ఉద్దేశమేంటని డీటైల్డ్ గా చూస్తే.. రష్యా చమురు ఇతర ఇంధన ఉత్పత్తులను భారత్, చైనా ఎక్కువగా కొంటున్నాయని. ఇలా రష్యన్ ప్రాడక్ట్స్ కొనే దేశాలపై ఒత్తిడి పెంచాలని ట్రై చేస్తోంది యూఎస్. రష్యా నుంచి చమురు ఉత్పత్తులతో పాటు యురేనియం సైతం కొనుగోలు చేసే దేశాల దిగుమతులపై 500 శాతం పన్ను విధించేలా చూస్తోంది అమెరికా.

రష్యాపై మరే దేశమూ ఆధారపడకూడదు- యూఎస్

ఇందుకు అమెరికన్లు చేస్తున్న సూత్రీకరణ ఏంటంటే.. ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యాపై ఈ ప్రపంచంలో మరే దేశం ఆధార పడకూడదు. దానికి తోడు ఉక్రెయిన్ తో యుద్ధం చేయాలని చూసే రష్యాను శిక్షించడానికి ఇంతకు మించిన మార్గం లేదని భావిస్తోంది యూఎస్. అందుకే ఈ భారీ సుంకం అంటోంది. ఇప్పటికే 26 శాతం సుంకాలనే ఎక్కువగా భావిస్తోన్న భారత్ కి ఇక్కడి ఎగుమతి దారులకూ ఈ ఐదు వందల శాతం సుంకం ఏంటో అర్ధం కాక జుట్టు పట్టుకుంటున్నారు.

2024 భారత్ ముడి చమురు దిగుమతుల్లో 35 శాతం రష్యాదే

ఈసరికే ఈ భారీ సుంకాల బిల్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలకు కారణమవుతోంది. రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్టయినప్పటి నుంచీ రష్యా చమురు చౌకగా కొనడం వల్ల భారత్ ఎంతో లాభ పడుతోంది. 2024లో భారత్ మొత్తం ముడి దిగుమతుల్లో 35 శాతం రష్యా చమురుదే కీలక పాత్ర. ఇది మాస్కోకి ఎంతో ఉపయోగకరంగా మారింది.

భారత్ రష్యా ఆయిల్ కొనడం ప్రపంచానికే మేలు- భారత్

అయితే ఈ విషయంలో భారత్ ఒక క్లారిటీ ఇస్తోంది. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్ దీప్ సింగ్ పురి.. దీనిపై మరో సారి స్పందించారు. రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల తాము ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు ఎంతో మేలు చేశామన్నారాయన. లేదంటే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటేవని అన్నారు కేంద్ర మంత్రి.

లేకుంటే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఆకాశమంటేవి

రష్యన్ ఆయిల్ ని ఆంక్షల పరిధిలోకి ఎప్పుడూ తీసుకురాలేదు. కేవలం దాని ధరపై మాత్రమే పరిమితి విధించారు. ప్రపంచ చమురు సరఫరా గొలుసు ఎలా ఉంటుందన్న వాస్తవం చాలా మందికి తెలుసు. రష్యా నుంచి డిస్కౌంట్లో వచ్చిన చమురును భారత్ కొనడం వల్ల ప్రపంచ మార్కెట్లకు మేలు జరిగిందే తప్ప.. కీడు జరగలేదన్నారు కేంద్ర మంత్రి. లేకుంటే చమురు ధరల మోత మారుమోగేదని అన్నారు కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి.

రష్యా రోజుకు 9 మిలియన్ బ్యారళ్ల చమురు ఉత్పత్తి

సాధారణంగా రష్యా రోజుకు 9 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ముడి చమురు ఉత్పత్తి దారుల్లో మాస్కో ఒకటి. ఆంక్షల కారణంగా ఇందులో 9 మిలియన్ బ్యారెళ్ల సరఫరా ఒక్కసారిగా ఆగిపోతే.. ప్రపంచ వినియోగంలో పదిశాతం తగ్గించుకోవల్సి ఉంటుంది. అది కరెక్టు కాదు. అప్పుడు సరఫరా తగ్గడంతో బ్యారెల్ ధర 120 నుంచి 130 డాలర్లకు పెరుగుతుందని వివరించారు భారత పెట్రోలియం మంత్రి. ఎనర్జీ మార్కెట్ ను అర్ధం చేసుకోలేని వారే.. ఇలా మాట్లాడతారని అన్నారాయన.

ట్రంప్ పైనా ఆధార పడి ఉన్న రష్యన్ బిల్లు

అయితే ప్రస్తుతం భారత్ పై విధించనున్న ఈ సుంకాలకు సంబంధించిన బిల్లు కేవలం అమెరికన్ కాంగ్రెస్ పై మాత్రమే కాదు.. అధ్యక్షుడు ట్రంప్ కూడా కన్విన్స్ కావల్సి ఉంది. ఆయన నిర్ణయాలపై కూడా ఆధార పడి ఉందని అంటున్నారు నిపుణులు.

తమ టార్గెట్ ని తామే ఎలా క్రాస్ చేస్తారు? దీనిపై ట్రంప్ రియాక్షనేంటి?

ఐదు వందల శాతం సుంకం అంటే ఒకటికి ఐదు వందల రెట్లు ఎక్కువ. ఒక వంద రూపాయల మన వస్తువు.. మనం అమెరికాకు పంపితే.. ఐదు వందల రూపాయలు పన్ను విధిస్తే దాని విలువ అమాంతం ఆరు వందలకు పెరుగుతుంది. ఆపై రవాణా, ఆదాయం ఇతర ఖర్చులు అదనం చేసుకుంటే ఇక్కడ వంద వస్తువు అక్కడ వెయ్యి రూపాయల మేర అమ్మాల్సి వస్తుంది. దీంతో ఈ వస్తువులనగానే భయపడి పోతారు. దీంతో ఎగుమతులు తగ్గిపోతాయి. తద్వారా.. భారత ఆదాయాన్ని అమాంతం తగ్గించడమే అవుతుంది. మరి ఇదే యూఎస్.. వచ్చే ఐదేళ్లలో భారత్ తో 500 బిలియన్ డాలర్ల వాణిజ్యం పెంచాలని చూస్తోంది. మరిదెలా సాధ్యం. తమ టార్గెట్ ని తామే ఎలా క్రాస్ చేస్తారు? దీనిపై ట్రంప్ రియాక్షనేంటి? ఇతర పర్యావసనాలేంటి? ఇప్పుడు చూద్దాం.

ఇది పూర్తిగా నా ఎంపిక- ట్రంప్

ఇంత భారీ సుంకాలను విధించాలని మీరు ఆలోచిస్తున్నారా? అని ట్రంప్ ని అడిగినపుడు. ఇది పూర్తిగా నా ఎంపిక అన్నారాయన. తీవ్రంగా పరిశీలిస్తున్నాం అని క్యాబినేట్ సమావేశంలో మీడియాతో అన్నారు ట్రంప్.

ట్రంప్ ని నిరాశ పరుస్తోన్న రష్యా- ఉక్రెయిన్ వార్

రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతూ ఉండటం.. ఈ ప్రాంతంలో వివాదం ఇంకా కొనసాగుతూనే ఉండటంతో.. అమెరికా అధ్యక్షుడ్ని తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఉక్రెయిన్ కి సాయం చేస్తామన్న తర్వాత

అలాగని రష్యా- ఉక్రెయిన్ వార్ ఏమంత తగ్గలేదు. మరింత పెరిగింది. రష్యా బుధవారం ఉక్రెయిన్ పై మరింత పెద్ద డ్రోన్ దాడి చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ కి సైనిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిన తర్వాత ఈ భారీ దాడి జరగటం గమనార్హం.

రష్యన్ ప్రభుత్వ సంస్థలు, కంపెనీలే కాదు.. 

ట్రంప్ కి అత్యంత సన్నిహితుడు రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహం ఏప్రిల్లో ప్రతిపాదించారీ రష్యా నిషేధ చట్టం. రష్యన్ మూల ముడి చమురు, సహజ వాయువు, యురేనియం, పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దేశాలపై విస్తృతమైన ఆంక్షలను ప్రతిపాదించిందీ బిల్లు. అయితే ఈ బిల్లు రష్యన్ ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు, అధికారులను కూడా శిక్షిస్తుంది. జరిమానాలు విధిస్తుంది.

ఈ బిల్లుకు వ్యక్తిగతంగా మద్ధతిచ్చిన ట్రంప్

జూన్ 30న ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తన ప్రతిపాదనకు వ్యక్తిగతంగా మద్ధతునిచ్చారని అన్నారు లిండ్సే గ్రాహం. ఇది అతి పెద్ద ముందడుగు కాబోతుందని అన్నారాయన. ఈ చట్టం రష్యా అధ్యక్షుడితో అమెరికా అధ్యక్షుడు చేసే చర్చల్లో మరింత ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు సెనెటర్ గ్రాహం.

2022లోనే రష్యాపై ఆంక్షలు విధించిన యురోపియన్ దేశాలు

2022లో రష్యన్ చమురుపై ఆంక్షలు విధించాయి యురోపియన్ దేశాలు. అప్పటి నుంచే భారత్ ఈ చమురు విస్తృతంగా కొనడం ప్రారంభించింది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ ప్రకారం.. మే నెలలో భారతదేశం రష్యన్ శిలాజ ఇంధనాలు కొన్న రెండో అతి పెద్ద దేశం. సుమారు 4. 2 బిలియన్ యూరోల విలువైన దిగుమతులు చేసుకుంది. ఇందులో 72 శాతం ముడి చమురే ఉంది.

వాణిజ్యం డబుల్ చేయాలనుకుంటోన్న భారత్- యూఎస్

ఒక పక్క చూస్తే.. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు నడుస్తున్నాయి. భారత్- అమెరికా మధ్య జరిగే వాణిజ్య విలువ వచ్చే ఐదేళ్లలో డబుల్ చేయదలుచుకుంటున్నాయి ఇరు దేశాలు.. ఈ క్రమంలో ఇలాంటి పన్ను పోటు ఏంటి? అన్నదొక ప్రశ్న. అయితే ఇటీవల వాషింగ్టన్ పర్యటన సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ బిల్లుపై స్పందించారు. ఈ పరిణామ క్రమాలను భారత్ సునిశితంగా పరిశీలిస్తోందని అన్నారు. అమెరికన్ సెనెట్ ఏం చేస్తుందో, ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీస్కుంటారో చూడాలని అన్నారాయన.

బిల్ స్పాన్సర్ గ్రాహం కి పూర్తిగా వివరించాం- భారత్

ఈ ప్రతిపాదన తీస్కురావడంలో కీలక పాత్ర పోషించింది గ్రాహం కాబట్టి.. ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. ఇంధన భద్రతపై మా ఆందోళన ఏంటన్నది గ్రాహంకి తెలియ చెప్పామనీ అన్నారాయన.

ట్రంప్ నిర్ణయమే కీలకం కానుంది- గ్రాహం

అయితే ఈ బిల్లు ఇప్పుడు ఎక్కడ ఆగిందంటే.. ఓటింగ్ కోసం ప్రవేశ పెట్టాల్సి ఉంది. దీని ద్వారా అయినా.. రష్యా దూకుడు తగ్గించి దానని కంట్రోల్ చేయాలన్నది యూఎస్ ఆలోచనగా తెలుస్తోంది. ఇదొక సాధనంగా అమెరికా భావిస్తోంది. అంతే కాదు వచ్చే రోజుల్లో అతి పెద్ద పురోగతి కాబోతుందని కూడా అంటున్నారు. అయితే ట్రంప్ దే నిర్ణయంగా చెబుతున్నారు.

రష్యాపై తాము వేసే బంకర్ బస్టర్ ఇదే- గ్రాహం

ఒక రకంగా చెబితే ఇది తాము రష్యాపై వేయనున్న బంకర్ బస్టర్ బాంబులాంటిదని అన్నారు సెనెటర్ గ్రాహం. ఈ బిల్లుకు తనతో కలిపి 84 మంది కో స్పాన్సర్లున్నారని అంటున్నారు సెనెటర్ గ్రాహం. ఈ బిల్లు తప్పక పాసవుతుందని అంటున్నారీయన.

బిల్లు పాసైనా 180 రోజుల సమయముంది- నిపుణులు

గ్రాహం వ్యాఖ్యలపై రష్యన్ అధికార ప్రతినిథి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. అమెరికన్ సెనెటర్ గురించి రష్యాకు బాగా తెలుసునని.. ఆయన ప్రకటనలేవీ తాము పరిగణలోకి తీసుకోమని అన్నారు. ఒక వేళ బిల్లు పాసైనా సరే దీన్ని అమలు చేయడానికి 180 రోజుల గడువుందని చెబుతున్నారు.

అమెరికన్ వ్యాపారులు, వినియోగదారుల ఖర్చు పెరిగే ఛాన్స్

అయితే ఈ బిల్లు ఆమోదిస్తే.. భారత్ తో పాటు.. చైనా, టర్కీతో పాటు అనేక ఆఫ్రికన్ దేశాలతో అమెరికన్ వాణిజ్యం, దౌత్య సంబంధాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. దీంతో అమెరికాకు వెళ్లే ఎగుమతులు భారీగా తగ్గనున్నాయి. కొన్ని కొన్ని దేశాల నుంచి అమెరికాకు రావల్సిన వస్తువులు నిలిచిపోతాయి. అంతే కాదు అమెరికన్ వ్యాపారులతో పాటు వినియోగదారుల ఖర్చులను కూడా పెంచుతుంది. ఇదంతా కూడా అమెరికన్ ప్రెసిడెంట్ పరిగణలోకి తీస్కోవల్సి ఉందని అంటారు నిపుణులు.

ఇది పాసయ్యే బిల్లు కాదంటోన్న కొందరు

యూఎస్ తో ఇప్పటి వరకూ కొనసాగించిన పొత్తులను కొన్ని దేశాలు వదులుకునే అవకాశముంది. గ్లోబల్ సౌత్ లో ఆంక్షలను వెస్ట్రన్ ఓవర్ రీచ్ గా భావించే అవకాశమేర్పడనుంది. ప్రపంచం రెండుగా చీలినా ఆశ్చర్యం లేదు. రష్యన్ పవర్ యూఎస్ బిజినెస్ మధ్య సెలెక్షన్ మొదలువుతుంది. తమకు అమెరికా వద్దనుకునేవారు కొత్తగా తయారవుతారు. దీంతో కొన్ని దేశాలు ఢిల్లీ, మాస్కో, బీజింగ్ పై తమ దృష్టి సారించవచ్చు. యూఎస్ లోని ఎలక్ట్రానిక్, టెక్స్ టైల్స్, ఫార్మా రంగాల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచవచ్చని అంటున్నారు.

Related News

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

Congress: గుత్తా లేఖల వెనక సీక్రెట్ ఏంటి?

AP Politics: టీడీపీలో సంస్థాగత మార్పులపై రచ్చ!

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొత్తం స్క్రిప్టా… మరీ ఇంత మోసమా?

AP Politics: జనసేన మీటింగ్ సక్సెస్ అయ్యిందా?

Telangana BJP: సీక్రెట్‌గా షోకాజ్ నోటీసులు.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది?

Big Stories

×