Gundeninda GudiGantalu Today episode july 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి ప్రెగ్నెంట్ అనుకోని ప్రభావతి సంబరపడిపోతూ ఉంటుంది.. నా కోడలు కడుపుతో ఉందని హడావిడి చేస్తుంటుంది. ఈ విషయాన్ని కామాక్షి తో కూడా పంచుకుంటుంది. ఆమె వస్తు మామిడి కాయల బుట్టని తీసుకొస్తుంది.. మామిడికాయలను చూసినా ప్రభావతి మీనా అని పిలిచి లోపల పెట్టమని అరుస్తుంది. బయటకు వెళ్లిన వాళ్ళు ఇంకా రాలేదు ఏంటి అని ప్రభావతి కంగారు పడుతూ ఉంటుంది. కామాక్షి ఇంట్లోకి వస్తుంది. అన్నయ్యగారు మీరు తాతయ్య కాబోతున్నారు వదినా నువ్వు బామ్మ కాబోతున్నావు అంటూ గంపెడు మామిడికాయలు తీసుకొని వస్తుంది.
కామాక్షి తెచ్చిన మామిడికాయలు కింద పడటంతో వాటి మీద కాలు పెట్టిన మీనా జారిపోతుంటే బాలు పట్టుకుంటారు. అది చూసిన అందరూ అక్కడ కాస్త సిగ్గుపడతారు. హాస్పిటల్ కి వెళ్ళిన రోహిణి ప్రెగ్నెంట్ కాదన్న విషయాన్ని ప్రభావతికి చెప్తుంది. కామాక్షి శృతి గురించి అసలు నిజాలు చెప్పడంతో ప్రభావతి టెన్షన్ పడుతుంది. రవి శృతి తన ఇంటికి రారని ప్రభావతి బాధపడుతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రవి శృతిలో ఎక్కడ సురేంద్ర ఇంట్లోనే ఉండిపోతారు అని ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా చేయడంవల్ల తనకు ఆస్తి రాదని ఎలాగైనా శృతిని తన దారిలోకి తీసుకురావాలని అనుకుంటుంది. శృతి కి ఫోన్ చేస్తుంది.. శృతి నేను బాలు ఉండగా ఆ ఇంట్లోకి చచ్చిన రాను అని సమాధానం చెబుతుంది. ప్రభావతి ఎంత సద్ది చెప్పాలని చూసినా శృతి మాత్రం నేను రానంటే రాను కావాలంటే వీడియో కాల్ చేస్తాను మాట్లాడండి అని అంటుంది. ఆ శోభ సురేంద్ర పక్క ప్లాన్ తోనే రవి శృతిని అక్కడికి తీసుకెళ్లిపోయారు ఇంకా పంపిస్తారని నమ్మకాలు నాకైతే లేవని కామాక్షి అంటుంది. ఆ మాటతో దిగులు పెట్టుకున్న ప్రభావతి రవి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
రాత్రి రవి పేరుతో కొరియర్ వచ్చిందని కొరియర్ బాయ్ అనగానే.. సత్యం రవిని పిలవరా కొరియర్ వచ్చిందంట అని అంటాడు. ఇంట్లో లేడు కదా నాన్న.. అవును కదా ఆ సంగతి నేను మర్చిపోయాను అని సత్యం అంటాడు. ప్రభావతి రవి వచ్చాడా ఏడి ఎక్కడ అని వెతుకుతుంది. రవి కాదమ్మా రవి పేరుతో కొరియర్ వచ్చింది అని మనోజ్ అంటాడు. ఈ బాలు గాడి వల్లే నా కుటుంబం రెండు ముక్కలైంది అని ప్రభావతి రెచ్చిపోతుంది. మీనాని దొంగ అన్నప్పుడు నువ్వు ఇంత బాధ పడలేదే. ఇంటి కోడలి దొంగ అంటే నువ్వు ఇలా ఒప్పుకుంటావా అని బాలు అంటాడు.
నీ కోడల్ని దొంగ అని అవతలి వ్యక్తి అవమానిస్తుంటే నువ్వు మాత్రం అతని ఏమనద్దు అతని గొప్పవాడు పెద్దవాడు అంటున్నావు.. ఇంట్లో ఉన్న మా మధ్య ప్రేమలేకుండా పోవడానికి కారణం నువ్వే అని బాలు ప్రభావతిపై విరుచుకుపడతాడు. ఆ మాట వినగానే కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రభావతి. చూశారా అండి ఏం మాట్లాడుతున్నారు ఇంట్లో వీళ్ళ మధ్య ప్రేమ లేకపోవడానికి నేనే కారణం అంటున్నాడు అని అడుగుతుంది. దానికి సత్యం వాడు అన్నదంట తప్పేముంది. నువ్వు ఇలా తేడాలు చూపించడం వల్లే కదా వాళ్ళ మధ్య ప్రేమలు లేకుండా పోయింది అని సత్యం అంటాడు.
మీరు కూడా నన్నే అంటున్నారని ప్రభావతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఒక కొడుకు ఇది ఒక కొడుకు అది అంటూ నువ్వు తేడాలు చూపించడం వల్లే వాళ్ల మధ్య ప్రేమలు లేకుండా పోయాయని క్లాస్ పీకుతాడు.. అందర్నీ సమానంగా చూస్తే ఇలాంటి బాధలు వచ్చేవి కాదు కదా వీళ్ళ మధ్యలో వీళ్ళకే గొడవలు జరిగేవి కాదు కదా అని సత్యం అంటాడు. ఏ రోజైనా కన్నతల్లిగా వాడి మీద ప్రేమ చూపించావా..? ఎంతసేపు వాడిని అక్కడికి రాకూడదు ఇక్కడికి రాకూడదు అని కండిషన్స్ పెడతావే.. కానీ వాడు నీ కొడుకు అన్న సంగతి నువ్వు ఎందుకు మర్చిపోయావు అని సత్యం అంటాడు..
Also Read :రెడీ పెళ్లికి రెడీ అవుతున్న బుల్లితెర నటి.. ఇదిగో క్లారిటీ ఇచ్చేసిందిగా..!
అదంతా నాకు తెలియదు ఇప్పుడు రవి శృతి ఈ ఇంటికి రావాలి. వాడి ఇంటికి రావలసిన బాధ్యత వీడి మీదే ఉంది. వీడివల్లే ఇంట్లోంచి బయటికి వెళ్లిన నా కొడుకు కోడలు మళ్లీ వీడి వల్లే ఇంటికి తీసుకురావాలి. ఏం చేస్తారో నాకు తెలీదు నాకు మాత్రం నా కొడుకు కోడలు నా ఇంట్లో ఉండాలి అని ప్రభావతి కండిషన్ పెడుతుంది. ఒకవేళ రవి శృతి ఈ ఇంటికి రాకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాలని మీరు తట్టుకోలేరు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఇక రోహిణి రవి శృతి వల్ల వాళ్ళ నాన్న గురించి అడగరని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…