BigTV English

Congress Senior Leaders: మారిపోయిన కాంగ్రెస్ సీనియర్లు.. అందుకేనా?

Congress Senior Leaders: మారిపోయిన కాంగ్రెస్ సీనియర్లు.. అందుకేనా?

Congress Senior Leaders: నల్గొండ జిల్లా.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అక్కడున్న సీనియర్ లీడర్లంతా.. జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండటంతో.. దశాబ్దాలుగా నల్గొండ బెల్ట్.. కాంగ్రెస్ కల్ట్ అనే టాక్ ఉంది. జానారెడ్డి, ఉత్తమ్, గుత్తా, కోమటిరెడ్డి బ్రదర్స్.. ఇలా కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలంతా నల్గొండ వాళ్లే. కానీ.. వీళ్లు ఎప్పుడు ఒకటవుతారో.. ఎప్పుడు వీరి మధ్య విభేదాలు రగులుతాయో.. ఎందుకు గొడవ పడతారో.. ఎవ్వరికీ తెలియదు. కడుపులో కత్తులు పెట్టుకొని.. పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారనే చర్చ ఎప్పట్నుంచో ఉంది. అయితే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం నల్గొండలో పొలిటికల్ సీన్ మారిందనే టాక్ వినిపిస్తోంది. ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మొత్తం మార్చేశారంటున్నారు. నల్గొండ కాంగ్రెస్‌పై జనంలో ఇప్పుడున్న చర్చేంటి?


నల్గొండ జిల్లా కేరాఫ్ కాంగ్రెస్ అనే మాట

రాజకీయాలపరంగా నల్గొండ ప్రస్తావన ఎప్పుడొచ్చినా.. ఆ జిల్లా కేరాఫ్ కాంగ్రెస్ అనే మాటొస్తుంది. సీనియర్లంతా అక్కడే ఉండటం.. జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో వారే కీలకంగా ఉండటంతో.. దశాబ్దాలుగా నల్గొండ అంటే కాంగ్రెస్ అనే ముద్ర పడిపోయింది. కానీ.. గత రెండు ఎన్నికల్లో నల్గొండలో కాంగ్రెస్ పేరు పెద్దగా వినిపించలేదు. కానీ.. ఇప్పుడలా కాదు.. ఒక్క సీటు తప్ప మొత్తం కాంగ్రెస్ స్వీప్ చేసేసింది. పైగా.. జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రులుగా అయ్యాక.. గ్రూపు విభేదాలను పక్కనపెట్టి.. ఒకే తాటిమీదకొస్తున్నారనే చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.


ఉత్తమ్ రివ్యూ మీటింగ్‌కు హాజరవుతున్న ఎమ్మెల్యేలు

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి.. సూర్యాపేట జిల్లా మినహా.. నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలతో ఆయనకు సంబంధం ఉండేది కాదట. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రివ్యూలు పెట్టినా.. చాలా వరకు ఎమ్మెల్యేలు హాజరయ్యే వారు కాదట. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకే వేదికపై కనిపించింది చాలా తక్కువ. కానీ.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్. ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ రివ్యూ మీటింగ్‌ పెడితే.. ఎమ్మెల్యేలంతా హాజరవుతున్నారు. ఇరిగేషన్ అనేది జిల్లాలో అందరికీ ముఖ్యమైన అంశం కావడంతో.. తమ తమ నియోజకవర్గాల్లో పెండింగ్ ఇరిగేషన్ పనులన్నింటిని మంత్రి ముందు ఉంచి.. పనులు చేయించుకుంటున్నారట. గత పదేళ్లలో ఈ పరిస్థితి ఉండేది కాదని.. ఇప్పుడు సీఎం రేవంత్‌తో సంబంధం లేకుండానే నేరుగా మంత్రి ఉత్తమ్ దగ్గరకు వెళ్లి జీవోలు తెచ్చుకుంటున్నారట.

Also Read: మైనింగ్ మాఫియా! నెల్లూరులో అసలేం జరుగుతుంది?

మంత్రి ఉత్తమ్ చొరవతో పనులు చేయిస్తున్న కోమటిరెడ్డి

ఇక.. నల్గొండ జిల్లాలో బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు కోమటిరెడ్డి సొంత గ్రామంలో ఉంది. దానికి సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉండటంతో.. ఆయన కూడా ఉత్తమ్ చొరవతో పనులు పూర్తి చేయిస్తున్నారట. జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు కూడా మంత్రిని కలిసి తమ నియోజకవర్గాల్లోని పనులకు అనుమతులు తెచ్చుకుంటున్నారట. మంత్రి కోమటిరెడ్డి కూడా విభేదాలను వీడి ఉత్తమ్ రివ్యూలో పాల్గొని.. నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉందనే సంకేతాన్ని పంపుతున్నారు. ఇందుకు.. మిర్యాలగూడలో జరిగిన రివ్యూ మీటింగే బిగ్ ఎగ్జాంపుల్. మంత్రులిద్దరూ.. ఒకరినొకరు టైగర్ అని సంబోధించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరూ కలిసి హెలికాప్టర్‌లో పర్యటనలు చేయడం కూడా క్యాడర్‌లో జోష్ నింపుతోంది. మొత్తంగా.. నల్గొండ నేతలంతా విభేదాలను పక్కనపెట్టి.. విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు ముందుకు వస్తుండటంపై.. కాంగ్రెస్ క్యాడర్ కూడా ఫుల్ ఖుషీలో ఉందట. ఇదిలాగే కంటిన్యూ చేయాలనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో సాగుతోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×