E-Paper
Advertisement

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!
Advertisement

దశాబ్దకాలంలో ఢిల్లీ కేంద్రంగా పురుడు పోసుకున్న రెండు ప్రజా ఉద్యమాలు.. జాతీయ రాజకీయాలను కీలక మలుపు తిప్పుతున్నాయి. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం.. యూపీఏను దిగిపోయేలా, బీజేపీ సర్కార్‌ వచ్చేలా ఊతమిస్తే.. ప్రస్తుత కాక్రోచ్‌ జనతా పార్టీ బీజేపీ ఎన్డీయే కూటమి పాలనకు వ్యతిరేకంగా ముందుకు సాగుతోంది.

ఇదిప్పుడు ఇండీ కూటమికి పరోక్షంగా బలాన్నిస్తున్నది. అచ్చంగా దశాబ్దకాలం క్రితం అన్నా హజారే పాత్రనే ఇప్పుడు సీజేపీ కూడా పోషించబోతుందా? ఆ స్థాయిలో సీజేపీకి జనం మద్దతు లభిస్తున్నదా? జెన్ జీ మొత్తం దీనికి తోడుగా నిలుస్తున్నదా? అనే చర్చ కూడా మొదలైంది. అయితే, తాజాగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తాము రాజకీయ పార్టీగా ఏర్పాటు కాబోమని, ఇలాగే స్వతంత్ర సంస్థగా ఉంటూ యువతలో నైతిక విశ్వాసాన్ని పోద్రి చేసేలా ముందుకు సాగుతామని ప్రకటించారు.

Advertisement

పాలకులెవరున్నా.. ప్రజా ఉద్యమాల ద్వారా నిలదీయడం, యువతకు ఉపాధి, ఉద్యోగాల అంశంలో నిర్విరామ పోరాటాలు నిర్మించడమే తమ ధ్యేయమన్నారు. ఈ క్రమంలోనే మరోమారు అన్నా హజారేను గుర్తు చేసుకుంటున్నారు దేశ జనం.  2011లో యూపీఏ సర్కార్‌పై జన్ లోక్‌పాల్ చట్టం కోసం పోరాడి, అవినీతి రహిత పాలనను కోరుతూ ఆయన చేసిన పోరాటం దేశాన్ని కదిలించింది. అప్పటి ఢిల్లీ పీఠాన్ని గడగడలాడింది. లోక్‌పాల్ బిల్లుకు చట్టబద్దత తెచ్చేలా ఆయన పోరాట రూపం అలుపెరగకుండా సాగింది.

ఇది బీజేపీకి ఎంతో ఉపయోగపడింది. యూపీఏ పోయి.. ఎన్డీయే కూటమి రావడానికి అన్నా హజారే ఉద్యమం కీ రోల్‌ పోషించింది. అయితే, లోక్‌పాల్‌ సంస్థను రాజకీయ రహితంగానే ఉంచాలనుకున్నారు. ప్రజాపక్షన నిరంతరం పోరాడే ప్రెజర్ గ్రూప్‌గానే ఉంచాలనుకున్నాడు హజారే. కానీ అన్నా.. అనుచరుడిగా ఉన్న అర్వింద్ కేజ్రీవాల్‌ మాత్రం వ్యవస్థను మార్చాలంటే రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగాలని తను ‘ఆప్‌’ పార్టీగా ఏర్పడి చీలిపోయాడు. ఆ తరువాత అన్నా హజారే క్రమంగా తెరమరుగయ్యాడు.

Advertisement

దీన్ని ఓ పాఠంగా తీసుకుంటున్నది బొద్దింక పార్టీ. డిజిటల్‌ ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన కాక్రోచ్‌ పార్టీ.. ఎప్పటికీ రాజకీయ పార్టీగా మారబోదని ప్రకటించేసింది. స్వతంత్రంగా ఉండి ప్రజా పోరాటాలు నిర్మించడం ద్వారానే యువతలో నైతిక విశ్వసనీయతను పెంచుకోవచ్చనే దానికి కట్టుబడి ఉంది సీజేపీ.

రాజకీయ పార్టీగా ఏర్పడిన తరువాత దీన్ని విచ్చిన్నం చేయడానికి జాతీయ రాజకీయాల్లో ఈడీ, సీబీఐ పాత్రల తీరును కూడా ఉదహరిస్తున్నారు జెన్‌ జీ యువత. తమకు పాలకులు భయపడాలన్నా.. అనుకున్నది సాధించాలన్నా.. ప్రజాపక్షాన ఒత్తిడి సమూహంగానే, ప్రెజర్ గ్రూప్‌గానే ఉండాలని తీర్మానించుకున్నారు.

దీంతో చాలా మందికి దీనిపై ఉన్న ఊహాగానాలు పటాపంచలయ్యాయి. ప్రకాశ్‌ రాజ్‌ లాంటి నేతలు ఈ పార్టీ ద్వారా యాక్టివ్‌గా ఉంటున్నారు. సీజేపీ నుంచే పోటీ చేస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న తరుణంలో సీజేపీ నుంచి కీలక ప్రకటన వచ్చింది. సేమ్‌.. అన్నా హజారే లాంటి పాత్రే సీజేపీ పోషిస్తోంది. అప్పుడు యూపీఏ గడగడ లాడింది. ఇప్పుడు ఎన్డీయే గజ్జుమంటున్నది. అప్పుడు ఆప్‌ ఏర్పడి.. అన్నా హజారే మాయమయ్యాడు. ఇప్పుడు మేమే ఉంటాం.. వచ్చేది యూపీఏనైనా దాని మెడలూ వంచుతామని డిసైడ్‌ అయ్యింది సీజేపీ. భవిష్యత్‌లో ఏం జరగనుందో చూడాలి మరి..!

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

Big Stories

Advertisement
×