E-Paper
Advertisement

డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?

డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?
Advertisement

Denza D9 Unveiled for India:  చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ BYD ఆధ్వర్యంలోని డెంజా బ్రాండ్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. లగ్జరీ MPVగా గుర్తింపు పొందిన డెంజా D9ను 2026 నవంబర్ లో భారత్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. కంపెనీ ఇండియన్ సోషల్ మీడియా ఛానల్స్‌ లో ఈ కారును టీజ్ చేయడంతో కొత్త మోడల్‌పై ఆసక్తి పెరిగింది. విలాసవంతమైన క్యాబిన్, అడ్వాన్స్‌ డ్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఈ MPV ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు.

లగ్జరీ లుక్‌తో ఆకట్టుకునే డిజైన్

డెంజా D9 ఐదు మీటర్లకు పైగా పొడవుతో ఉండే లగ్జరీ MPV. ముందు భాగంలో పెద్ద గ్రిల్, క్రోమ్ ఫినిషింగ్, స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్స్ ఆకట్టుకుంటాయి. సైడ్ ప్రొఫైల్‌లో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్లైడింగ్ రియర్ డోర్లు కనిపిస్తాయి. వెనుకవైపు కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్‌తో ప్రీమియం లుక్‌ను అందించారు.

విలాసవంతమైన 7-సీటర్ క్యాబిన్

Advertisement

డెంజా D9లో ఏడు సీట్ల లేఅవుట్ ఉండనుంది. ముఖ్యంగా రెండో వరుసలో లాంజ్ తరహా కెప్టెన్ సీట్లు ఉంటాయి. వీటిని రిక్లైన్ చేసుకోవడంతో పాటు పవర్డ్ ఒట్టోమన్ సదుపాయంతో మరింత సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్లు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. క్యాబిన్‌లో లెదరెట్ అప్హోల్స్టరీ, వుడెన్ ఫినిషింగ్, యాంబియంట్ లైటింగ్ లాంటి ఫీచర్లు లగ్జరీ అనుభూతిని పెంచుతాయి.

పెద్ద స్క్రీన్.. ప్రీమియం ఫీచర్లు

గ్లోబల్ మోడల్‌ లో 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 12-అంగుళాల AR హెడ్‌అప్ డిస్‌ ప్లే, 14 స్పీకర్ల డైనాడియో ఆడియో సిస్టమ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. మూడు వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్లు, పనోరమిక్ గ్లాస్ రూఫ్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ కూడా లభిస్తాయి. అయితే, ఇండియా వెర్షన్‌లో ఏయే ఫీచర్లు ఉంటాయనేది అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత

Advertisement

డెంజా D9లో 8 ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి సేఫ్టీ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అలాగే అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి Level 2 ADAS ఫీచర్లు కూడా గ్లోబల్ మోడల్‌లో ఉన్నాయి.

ఎలక్ట్రిక్ పవర్.. ధర ఎంత?

భారత్‌లో డెంజా D9 పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనే విడుదలయ్యే అవకాశం ఉంది. గ్లోబల్ మోడల్‌లో 103kWh బ్యాటరీతో FWD, AWD ఆప్షన్లు ఉన్నాయి. వెర్షన్‌ను బట్టి 313PS నుంచి 373PS వరకు పవర్, 580–600 కిలోమీటర్ల వరకు క్లెయిమ్డ్ NEDC రేంజ్ అందిస్తుంది. భారత మోడల్‌కు సంబంధించిన కచ్చితమైన స్పెసిఫికేషన్లు తెలియాల్సి ఉంది. ఈ లగ్జరీ MPV ఎక్స్-షోరూమ్ ధర రూ.80–85 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. మార్కెట్లోకి వస్తే MG M9, టయోటా వెల్‌ఫైర్ వంటి లగ్జరీ MPVలకు పోటీ ఇవ్వనుంది.

Read Also: కొత్త కలర్, సరికొత్త ఫీచర్లు.. MG విండ్సర్ EV కొత్త ఎడిషన్ వచ్చేసింది!

Tags

Related News

హ్యుందాయ్ బేయాన్ N లైన్ వచ్చేసింది.. టర్బో పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా!

కవాసకి వెర్సిస్ 900 వచ్చేసింది, భారత్‌లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

భారత్‌ పై విన్‌ఫాస్ట్ ఫుల్ ఫోకస్.. తెలంగాణ, ఏపీలోనూ షోరూమ్‌లు!

కొత్త కలర్, సరికొత్త ఫీచర్లు.. MG విండ్సర్ EV కొత్త ఎడిషన్ వచ్చేసింది!

మహీంద్రా XUV 3XO CNG టీజర్ విడుదల.. అక్టోబర్ 15న ఆవిష్కరణ!

జస్ట్ 150 యూనిట్స్.. BYD సీలియన్ 7 కొత్త ఎడిషన్ వచ్చేసింది!

సిట్రోయెన్ నుంచి చౌకైన ఎలక్ట్రిక్ కారు.. లుక్ ఏంది భయ్యా ఇంత బాగుంది!

Big Stories

Advertisement
×