IBM H1B Visa: జస్ట్ ఇమాజిన్.. మీరు అమెరికాలో మంచి జాబ్ చేస్తున్నారు. లక్షల్లో జీతం వస్తోంది. ఏళ్ల తరబడి కష్టపడి H-1B వీసా తెచ్చుకున్నారు. గ్రీన్ కార్డ్ కోసం కూడా ఎదురుచూస్తున్నారు. కానీ ఒకరోజు మీ కంపెనీ వచ్చి.. మీరు ఇకపై అమెరికాలో పనిచేయాలంటే కుదరదు. ఇండియాకు వెళ్లి పని చేయండి.. లేదంటే ఉద్యోగం వదిలేయండి అని చెబితే?.. కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టు.. ఏదో ఊబిలో కూరుకుపోతున్న ఫీల్ వస్తుంది కదా. కానీ ఇప్పుడు ఇదే జరిగింది. IBMలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు ఇప్పుడు ఇదే సిచ్యూవేషన్లో ఉన్నారు. అంతేకాదు.. అమెరికా నుంచి ఇండియాకు వస్తే జీతంలో ఏకంగా 80 శాతం వరకు కోత పడే అవకాశం కూడా ఉంది. అసలు IBM ఎందుకిలా చేస్తోంది? ఉద్యోగులకు కంపెనీ ఇచ్చిన ఆప్షన్లు ఏంటి? ముఖ్యంగా ఇండియాకు తిరిగొస్తే వాళ్ల పరిస్థితి ఎలా ఉండబోతోంది?
వీసా, గ్రీన్ కార్డ్ ఇవ్వడాన్ని నిలిపేయాలని డిసైడ్..
ముందుగా అసలు విషయం ఏంటో చూద్దాం. IBM తన కన్సల్టింగ్ డివిజన్లోని చాలా పొజిషన్లకు అమెరికా నుంచి కొత్తగా వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ ఇవ్వడాన్ని నిలిపేయాలని డిసైడ్ అయ్యింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇది కేవలం కొత్తగా ఉద్యోగంలో చేరేవాళ్లకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇప్పటికే అమెరికాలో IBMలో పనిచేస్తున్న H-1B వీసా హోల్డర్లు, గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న కొంతమంది ఉద్యోగులు కూడా ఈ నిర్ణయం వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు.
3 వారాల డెడ్‌లైన్!
వీళ్లకు కంపెనీ కేవలం మూడు వారాల టైమ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఆ మూడు వారాల్లో ఏం చేయాలి? ఒకటి.. అమెరికా వదిలి మరో దేశంలో, ముఖ్యంగా ఇండియాలో ఉన్న IBM పొజిషన్‌కు వెళ్లాలి. రెండు.. ఆ ట్రాన్స్‌ఫర్‌కు నో చెప్పేసి.. జాబ్‌కు రిజైన్ చేయాలి. ఒకవేళ ఉద్యోగాన్ని వదులుకుంటే మూడు నెలల సెవెరెన్స్ ప్యాకేజీ ఇస్తామంటోంది IBM. డిసెంబర్ 31, 2026ను వారి లాస్ట్ వర్కింగ్‌డేగా డిసైడ్ చేశారు.
అమెరికా నుంచి ఎక్కడికి వెళ్లాలి..?
ఇప్పుడు ఇక్కడ మరో విషయం ఉంది. IBM ఉద్యోగులు అమెరికా నుంచి ఎక్కడికి వెళ్లాలి? దీనికి ఆన్సర్ ఇండియా. నవంబర్ 19న IBM కెరీర్స్ పోర్టల్‌లో అమెరికా బయట ఉన్న కన్సల్టింగ్ ఉద్యోగాల నెంబర్ 1,278గా ఉంది. వాటిలో ఏకంగా 1,125 ఉద్యోగాలు ఇండియాలోనే ఉన్నాయి. సింగపూర్‌లో 23, యూకేలో 18 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. అమెరికాలో కూడా 89 కన్సల్టింగ్ ఓపెనింగ్స్ ఉన్నట్లు సమాచారం. అంటే విదేశాల్లో ఉద్యోగాల కోసం చూస్తున్న IBM ఉద్యోగులకు ఇండియా మెయిన్ ఆప్షన్‌గా కనిపిస్తోంది.
జీతంలో భారీ కోత తప్పదా?
కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అమెరికాలో సంపాదించే జీతంతో పోలిస్తే ఇండియాలో జీతం చాలా తక్కువగా ఉండొచ్చనే టెన్షన్ ఉద్యోగులను నిద్రపోనివ్వడం లేదు. Blind అనే అనామక ఉద్యోగుల ఫోరమ్‌లో IBM ఉద్యోగిగా చెప్పుకున్న ఒక వ్యక్తి.. ఇండియాకు షిఫ్ట్ అయితే తన జీతం దాదాపు 80 శాతం తగ్గిపోవచ్చని చెప్పడంతో ఈ భయాలు ఇంకా పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఏడాదికి 100 డాలర్లు సంపాదిస్తున్నారని అనుకుంటే, అదే ఉద్యోగాన్ని ఇండియాలో కొనసాగించినప్పుడు 20 డాలర్లకు సమానమైన జీతం మాత్రమే వచ్చే చాన్స ఉంది. అయితే ఈ జీతం కోత అనేది ఒక ఎంప్లాయి చెప్పిన విషయం. కంపెనీ మాత్రం అఫిషియల్‌గా ఇంకా ఏం చెప్పలేదు. అయినా సరే.. అమెరికాలో ఏళ్ల తరబడి పనిచేసి, అక్కడి లైఫ్‌స్టైల్‌కి అలవాటుపడిన ఉద్యోగులకు ఇది చాలా పెద్ద సమస్యే. ఇప్పుడు ఈ న్యూస్ మన ఇండియన్స్‌కు ఎందుకు అంత ముఖ్యమో చూద్దాం.
మన ఇండియన్స్ కు ఎందుకు అంత ముఖ్యం..
అమెరికాలో H-1B వీసా తీసుకునే వారిలో దాదాపు 75 శాతం మంది మనవాళ్లే. ఇక గ్రీన్ కార్డ్ విషయానికి వస్తే.. ముఖ్యంగా ఇండియన్స్‌కు కొన్ని కేటగిరీల్లో దశాబ్దాల తరబడి వెయిటింగ్ ఉండొచ్చు. అంటే ఒక భారతీయ ఉద్యోగి అమెరికాలో పదేళ్లు, పదిహేనేళ్లు పనిచేసినా.. ఇంకా గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తుండొచ్చు. అలాంటి టైమ్‌లో ఉద్యోగం మారడం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే H-1B వీసా అనేది మీ ఉద్యోగానికి, మీ ఎంప్లాయర్ స్పాన్సర్షిప్కు లింక్ అయి ఉంటుంది. ఉన్న ఉద్యోగం పోతే మరో కంపెనీ వెతుక్కోవాలి. ఆ కంపెనీ కూడా వీసా స్పాన్సర్ చేయాలి. అది కుదరకపోతే అమెరికాలో ఉండే అవకాశమే ప్రశ్నార్థకంగా మారుతుంది.
IBM ఉద్యోగుల ముందు మూడు దారులు
ఇండియాకు వచ్చి తక్కువ జీతానికి పనిచేయడం.. లేదా మరో అమెరికన్ కంపెనీలో స్పాన్సర్షిప్ ఉన్న ఉద్యోగం వెతుక్కోవడం.. లేదా ఉద్యోగాన్ని వదిలేసి అమెరికా నుంచి బయటకు రావడం. ఇదంతా జరుగుతున్న టైమ్‌లో మన ట్రంప్‌గారి పుణ్యమా అని వేరే దేశాల వారికి ఉద్యోగాలు దక్కే అవకాశాలే తగ్గిపోతున్నాయి. 2025 సెప్టెంబర్‌లో ట్రంప్ ప్రభుత్వం కొన్ని కొత్త H-1B పిటిషన్లపై 1,00,000 డాలర్ల ప్రత్యేక ఫీజు అంటూ అనౌన్స్ చేశారు. ఈ డెసిషన్‌పై కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా వచ్చాయి.
H-1B లాటరీ విధానంలో మార్పులు..
అలాగే ఎక్కువ జీతాలు పొందే ఉద్యోగులకు ప్రాధాన్యత ఇచ్చేలా H-1B లాటరీ విధానంలో మార్పులను కూడా ప్రతిపాదించింది. సో.. ప్రస్తుతం అమెరికాలో కొత్త జాబ్ దొరకడం అనేది అంత ఈజీ అయితే కాదు. అమెరికాకు వెళ్లడం ఒక కల కావచ్చు. కానీ అక్కడ స్థిరపడటం, ఉద్యోగాన్ని కంటిన్యూ చేయడం ఇప్పుడు చాలామందికి పెద్ద సవాలుగా మారుతోంది. ఒకవైపు అమెరికన్ డ్రీమ్.. మరోవైపు జాబ్ సెక్యూరిటీ, సాలరీ, ఫ్యామిలీ ఫ్యూచర్. ఇప్పుడు మరో భయం ఏంటంటే.. IBM లాంటి కంపెనీనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే.. ఇదే బాటలో మిగతా కంపెనీలు కూడా నడిస్తే.. అప్పుడు చాలా మంది ఇండియన్స్‌కు మాత్రం చిక్కులు తప్పవనే చెప్పాలి.
Also Read:తన కూతురికి ఇండియా అని పేరు పెట్టిన విదేశీ క్రికెటర్.. ఎందుకో తెలుసా?