2026 Hyundai Bayon N Line: ప్యారిస్ మోటార్ షో2026లో హ్యుందాయ్ కొత్త బేయాన్ N లైన్ మోడల్‌ను ఆవిష్కరించింది. స్పోర్టీ డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, ఆధునిక ఫీచర్లు, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో ఈ SUV ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదే సమయంలో ఇండియా-స్పెక్ బేయాన్ స్టాండర్డ్ వెర్షన్ గా పరిచయమైంది. యూరప్‌లో అందుబాటులోకి రానున్న N లైన్ మాత్రం మరింత స్పోర్టీ లుక్‌తో పాటు అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది.
స్టాండర్డ్ బేయాన్ తో పోలిస్తే N లైన్ ఎక్స్ టీరియర్లో పలు మార్పులు కనిపిస్తాయి. ముందు భాగంలో షార్ప్ డిజైన్ ఎలిమెంట్స్, గన్మెటల్ ఫినిషింగ్‌తో కూడిన యాక్సెంట్స్, బాడీ కలర్ హెడ్‌ల్యాంప్ సరౌండ్స్ ప్రత్యేకంగా నిలుస్తాయి. నంబర్ ప్లేట్ పక్కన N లైన్ బ్యాడ్జ్ కూడా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్‌లో బేయాన్ N లైన్ మరింత స్పోర్టీగా కనిపిస్తుంది. ఇందులో 18-అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ అందించారు. స్టాండర్డ్ వెర్షన్లో 17 అంగుళాల వీల్స్ ఉంటాయి. బ్లాక్ కలర్ ORVMలు, పెద్ద రియర్ స్పాయిలర్ దీని లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. వెనుక వైపు ట్విన్ ఎగ్జాస్ట్ పైపులతో కూడిన స్పోర్టీ బంపర్ ప్రత్యేకతగా నిలుస్తుంది.
క్యాబిన్‌లోనూ N లైన్ ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్ బ్లాక్ ఇంటీరియర్‌కు రెడ్ కలర్ యాక్సెంట్స్ స్పోర్టీ లుక్‌ను అందిస్తాయి. స్టీరింగ్ వీల్, గేర్ నాబ్, ఏసీ వెంట్స్, సీట్లపై రెడ్ స్టిచింగ్ ఆకట్టుకుంటాయి. అల్కాంటారా ఫినిషింగ్ తో కూడిన సీట్లు, అదనపు సైడ్ సపోర్ట్ డ్రైవింగ్ టైమ్ లో చక్కటి ఎక్స్ పీరియెన్స్ ను అందించేలా రూపొందించారు.
ఫీచర్ల విషయానికి వస్తే.. డ్యూయల్ 12.3-అంగుళాల డిస్ప్లేలు, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, బోస్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఛార్జర్, సన్‌రూఫ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. N లైన్లో హీటెడ్ స్టీరింగ్ వీల్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ముందు, బ్యాక్ హీటెడ్ సీట్లు కూడా లభిస్తాయి. సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, Level 2 ADAS, బ్లైండ్ వ్యూ మానిటర్, 360 డిగ్రీ కెమెరా, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ లాంటి ఫీచర్లు అందించారు.
బేయాన్ N లైన్లో రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 90 PS లేదంటే 115 PS పవర్ ను అందిస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదంటే 7 స్పీడ్ DCT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. రెండోది 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన స్ట్రాంగ్ హైబ్రిడ్ సెటప్. ఇది 138 PS పవర్, 265 Nm టార్క్ ను అందిస్తుంది. ఈ ఇంజిన్‌కు 6 స్పీడ్ DCT గేర్‌బాక్స్ ను యాడ్ చేశారు. రెండు వెర్షన్లలోనూ ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది. అయితే, దీని ధర, అయకాలకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడైన తర్వాతే స్పష్టత రానుంది.
Read Also: డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?