E-Paper
Advertisement

తగ్గాడా? వ్యూహం మార్చాడా? పొలిటికల్ రీ-ఎంట్రీకి వంశీ బిగ్ ప్లాన్!

తగ్గాడా? వ్యూహం మార్చాడా? పొలిటికల్ రీ-ఎంట్రీకి వంశీ బిగ్ ప్లాన్!
Advertisement

Vallabhaneni Vamsi: గ‌న్నవ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ మ‌ళ్లీ పాత‌గూటికి చేర‌బోతున్నారా? జైలు నుంచి బయటకు వ‌చ్చాక‌ రాజ‌కీయాల‌కు దూరంగా వున్న ఆయ‌న లేటెస్ట్‌గా లేఖ‌ల‌తో చ‌ర్చల్లోకి వచ్చారు. టీడీపీపై నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆ పార్టీ పై ఘాటు విమ‌ర్శలు చేసిన ఇప్పుడు రూటు మార్చారా? సీఎం చంద్రబాబుకు లేఖ‌లు రాయ‌డం రీ ఎంట్రీ వ్యూహ‌మా?

చంద్రబాబుపై తీవ్ర విమర్శలు..

Advertisement

వ‌ల్లభ‌నేని వంశీ ఒన్స్ అపానే టైమ్ ఫైర్‌బ్రాండ్‌. రాజ‌కీయంగా టీడీపీలో పుట్టి పెరిగి.. ఆపై పార్టీ మారారు. టీడీపీపైనే కాదు ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైన తీవ్ర విమ‌ర్శలు చేశారు. కాలం మారింది. కేసులు వెంటాడాయి. జైలుకెళ్లారు. బెయిల్‌పై బయటకు వచ్చాక చాలా సైలెంట్ మోడ్‌లో ఉండిపోయారు. మీడియాలో త‌ళుక్కుమ‌న‌లేదు. పొలిటిక‌ల్ ఫ్రేమ్‌లోనూ క‌న్పించ‌లేదు కానీ, గత కొద్ది రోజులుగా వల్లభనేని వంశీ వైఖరిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. సీఎం చంద్రబాబుకు వంశీ లేఖ‌లు రాయ‌డం స‌రికొత్త చ‌ర్చకు తావిచ్చింది.

డైలమాలో పడ్డ టీడీపీ, వైసీపీ నేతలు..

Advertisement

జ‌స్ట్‌ లెట‌ర్ల‌తో స‌రిపెట్టలేదు. ప్రజా సమస్యలకు సంబంధించి త‌న లేఖల్లోని అంశాలపై స్పష్టత ఇచ్చేందుకు అవ‌స‌ర‌మైతే సీఎంను నేరుగా క‌లుస్తాన‌న్నారు వంశీ. ఆ కామెంట్స్ వెనుక ఉద్దేశమేంటి? ముఖ్యమంత్రికి వంశీ లేఖాయ‌ణం టీడీపీ,వైసీపీ నేతలను కూడా డైలమాలో ప‌డేసింది.

Also Read: చింతూరు ఏజన్సీలో విషాదం.. సోకిలేరు వాగులో పడి ఇద్దరు యువకులు మృతి

పొలిటికల్ రీ ఎంట్రీ ఎటువైపు..?

రాబోయే రోజుల్లో చట్టపరమైన సమస్యల నుంచి గ‌ట్టెక్కేందుకే ఓ మెట్టు త‌గ్గాల‌ని ఇలా మెత్తబడ్డారా? లేక గ‌న్నవ‌రంలో తన పట్టును నిలుపుకునే వ్యూహ‌మా? వంశీ యాక్టివ్ మోడ్‌లోకి వ‌చ్చారు స‌రే. పొలిటిక‌ల్ రీ-ఎంట్రీ ఎటువైపు? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. టీడీపీ వర్గాలు మాత్రం వంశీ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అయితే, పొలిటికల్ రీ-ఎంట్రీ కోసం వంశీ ఎంచుకున్న ఈ లేఖల వ్యూహం ఆయనకు ఏ మేరకు కలసివస్తుందో, రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో వేచి చూడాలి.

Related News

గాంధీ భవన్‌లో ‘రచ్చ’.. ఢిల్లీలో ‘ఆల్ ఈజ్ వెల్’!

హైడ్రా ఆగ‌దు.. మీ ఆట‌లు సాగ‌వు! రంగ‌నాథే ఉంట‌డు.. క‌బ్జాదారుల ప‌ని ప‌డ‌త‌డు!

నేరెళ్ల నెత్తుటి నేల సాక్షిగా కేటీఆర్‌పై తొమ్మిది అస్త్రాలు.. నిల‌దీసిన క‌విత‌.. వ‌దిలిపెట్ట‌బోమ‌ని శ‌ప‌థం..!

ప‌దేళ్ల పాపాల పాల‌న‌.. ఆ కుటుంబంలో పుట్టినందుకు ప‌శ్చాత్తాపం! నేరెళ్ల బాధిత కుటుంబాల‌కు క్ష‌మాప‌ణ‌..

రేవంత్‌పై బీజేపీ బొద్దింక‌ల అస్త్రం.. రాజీనామా, విద్యాశాఖ మంత్రి.. స‌ర్కార్‌పై గురి!

రంగ‌నాథ్‌కే రేవంత్ అండ‌.. ఎందుకు? ఆయ‌నే కావాలంటున్న స‌ర్కార్‌..!

స‌రిలేరు మీకెవ్వ‌రు.. బీజేపీని అడుగు ప‌ట్టించేందుకు మీరు చాలు నాయ‌కా..!

Big Stories

Advertisement
×