E-Paper
Advertisement

ఆకాశం నుంచి కురిసే ఆసిడ్ వర్షం… చివరి వరకు టెన్షన్ పెట్టే సర్వైవల్ థ్రిల్లర్

ఆకాశం నుంచి కురిసే ఆసిడ్ వర్షం… చివరి వరకు టెన్షన్ పెట్టే సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

Survival Thriller: వర్షం అంటే అందరికీ ఇష్టం. కానీ అదే వర్షం మనిషి శరీరంపై పడిన క్షణాల్లోనే మాంసాన్ని కాల్చేస్తే? ఇళ్లు, కార్లు, చెట్లు, వంతెనలు అన్నీ కరిగిపోతుంటే? అలాంటి భయంకరమైన ఆలోచనతో తెరకెక్కిన ఫ్రెంచ్ డిజాస్టర్ సర్వైవల్ థ్రిల్లర్ ‘Acide’. ప్రకృతి విపత్తు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠను కొనసాగిస్తూ, వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే ?

కథలోకి వెళ్తే…

మిచల్ అనే వ్యక్తి చట్టపరమైన సమస్యల కారణంగా హోమ్ అరెస్ట్‌లో జీవిస్తుంటాడు. మరోవైపు అతని భార్య ఎలిస్ అతనికి దూరమై కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. వారి కూతురు సెల్మా బోర్డింగ్ స్కూల్‌లో చదువుతూ తల్లిదండ్రులకు దూరంగా ఉంటుంది. కుటుంబం ఇప్పటికే విడిపోయినా, తమ కూతురిపై ఇద్దరికీ ఉన్న ప్రేమ మాత్రం మారదు. అంతలో ప్రపంచవ్యాప్తంగా ఊహించని ప్రకృతి విపత్తు మొదలవుతుంది. ఆకాశం ఒక్కసారిగా నల్లటి మేఘాలతో కమ్ముకుపోతుంది. మొదట అందరూ సాధారణ వర్షమే అనుకుంటారు. కానీ కొన్ని క్షణాల్లోనే భయంకరమైన నిజం బయటపడుతుంది. ఆకాశం నుంచి కురుస్తున్నది నీరు కాదు… అత్యంత ప్రమాదకరమైన యాసిడ్ వర్షం.

Advertisement

ఆ వర్షపు చుక్కలు మనిషి శరీరంపై పడితే చర్మం కరిగిపోతుంది. కార్లు, ఇళ్లు, విద్యుత్ స్తంభాలు, వంతెనలు కూడా దాని తీవ్రతకు దెబ్బతింటాయి. రోడ్లపై ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీసే ప్రజలు ఒక్కొక్కరుగా కుప్పకూలిపోతుంటారు. క్షణాల్లో నగరాలు భయంతో వణికిపోతాయి. ఈ విపత్తు గురించి తెలుసుకున్న మిచల్ తన హోమ్ అరెస్ట్‌ను లెక్కచేయకుండా కూతురు సెల్మాను కాపాడేందుకు బయలుదేరుతాడు. అదే సమయంలో ఎలిస్ కూడా తన కూతురి కోసం పరుగెత్తుతుంది. విడిపోయిన భార్యాభర్తలు మరోసారి ఒక్కటై సెల్మాను రక్షించడానికి ప్రాణాలకే తెగిస్తారు.

ముగ్గురూ ఒక వ్యాన్‌లో సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కానీ ప్రయాణం అంత సులభంగా ఉండదు. ఎప్పుడు వర్షం మొదలవుతుందో తెలియదు. ఎక్కడ భవనం కూలిపోతుందో అర్థం కాదు. ఒకవైపు ఆసిడ్ వర్షం… మరోవైపు భయంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే జనాలు… ప్రతి క్షణం ప్రాణాలకు ముప్పే. చిన్న తప్పు చేసినా చాలు… మరణం వెంటాడుతుంది. వర్షం ఆగిన తర్వాత కూడా నేలపై పేరుకున్న ద్రవం ప్రమాదకరంగానే ఉంటుంది. కూతురిని కాపాడుకోవడానికి మిచల్ చేసే సాహసాలు, తండ్రి ప్రేమ, కుటుంబ బంధం కథకు మరింత భావోద్వేగాన్ని జోడిస్తాయి.

Advertisement

చివరికి మిచల్ తన కూతురిని సురక్షితంగా బయటకు తీసుకెళ్లగలిగాడా? ఈ యాసిడ్ విపత్తు నుంచి వాళ్లు తప్పించుకున్నారా? ప్రపంచాన్ని కబళించిన ఈ భయంకర పరిస్థితికి పరిష్కారం దొరికిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ మూవీ.

తెలుగులో ఉందా లేదా?

‘యాసిడ్’ చిత్రంలో గుయిలౌమ్ కానెట్, లైటిషియా దోష్, పేషెన్స్ మున్షెన్‌బాచ్ ప్రధాన పాత్రల్లో నటించారు. జస్ట్ ఫిలిప్పోట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రకృతి విపత్తును అత్యంత సహజంగా చూపించిన డిజాస్టర్ థ్రిల్లర్‌గా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌తో Prime Video, Jio Hotstar ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. ప్రకృతి విపత్తులు, సర్వైవల్ థ్రిల్లర్లు ఇష్టపడే వారికి ‘యాసిడ్’ మస్ట్ వాచ్ సినిమా. ప్రతి వర్షపు చుక్క కూడా మరణాన్ని మోసుకొచ్చే ఈ కథ చివరి వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తుంది.

Read Also: కొద్ది గంటల్లోనే సముద్రంలో మునిగిపోయే ద్వీపం… సస్పెన్స్ తో మెంటలెక్కించే సై-ఫై అడ్వెంచర్ మిస్టరీ

Related News

దేశ స్వాతంత్ర్యం కోసం ఊపిరి వదిలిన వీరుల గాథ… నరనరాల్లో దేశభక్తిని రగిలించే పవర్ ఫుల్ ఎపిక్ సిరీస్

ఐఏఎస్ ఆఫీసర్ తీర్చుకున్న షాకింగ్ ప్రతికారం… ఊహకందని పొలిటికల్ రివేంజ్ థ్రిల్లర్

ఖాకీ డ్రెస్‌కి, క్రైమ్ సామ్రాజ్యానికి మధ్య సాగే రక్తపాతం… ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ అండ్ మైండ్ గేమ్ థ్రిల్లర్

వింత వైరస్ దాడితో సర్వనాశనమైన ప్రపంచం… తెలుగులోనే ఈ స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

విలన్‌తో అమాయకపు అమ్మాయి బాడీ స్వ్యాప్… భయపెట్టే కామెడీ రోలర్‌కోస్టర్ రైడ్

సినిమా ప్రపంచం వెనుక ఉన్న అసలు రంగులు… నవ్వులతో పాటు కన్నీళ్లు పెట్టించే వినోదాత్మక ప్రయాణం

జోజు జార్జ్ ఊచకోత తెలుగులోనే… నిమిషానికో మలుపు ఉన్న మలయాళం హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్

ప్రేయసిని మర్చిపోవడానికి వెళ్లిన హీరోకు షాకింగ్ ట్విస్ట్… ట్రెక్కింగ్‌లో ఎక్స్ ఎంట్రీతో ఊహించని మలుపు

Big Stories

Advertisement
×