BigTV English

Perni Nani Family: అడ్డంగా దొరికినా కుటుంబంపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు?

Perni Nani Family: అడ్డంగా దొరికినా కుటుంబంపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు?

Perni Nani Family: మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం కుంభకోణంలో తవ్వే కొద్దీ విస్తుబోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటి వరకు మాయమైన బియ్యం బస్తాలు ఒక లెక్క అయితే.. నెల తిరిగే సరికి ఆ లెక్క డబుల్ అయింది. తాజాగా పూర్తి అయిన విచారణలో పేర్ని నాని కుటుంబ గోదాములో మాయమైన బియ్యం బస్తాల లెక్కలతో అధికారులు ఆశ్చర్య పోతున్నారంట. మొత్తం లెక్క తేల్చడానికి అధికారులకు నెల రోజుల సమయం పట్టిందంటే ఏ స్థాయిలో స్కాం జరిగిందో అర్థమవుతుంది. ఇంత జరుగుతున్న ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన మచిలీపట్నం గోడౌన్‌లో మాయమైన రేషన్‌ బియ్యం బస్తాల లెక్క తేలింది. మొదట్లో పేర్ని నాని సతీమణి జయసుధ పేరిట నిర్మించిన గోడౌన్ నుంచి 3,708 బస్తాల రేషన్ బియ్యం మాయమైందన్నారు. తర్వాత పది రోజులకు 4,840 బస్తాలు మాయమయ్యాయని అధికారులు ప్రకటించారు. నెల గడిచే సరికి ఆ లెక్క ఏకంగా 7,577 బస్తాలుగా తేలి, అధికారులకే షాక్ ఇచ్చిందంట. ఆ లెక్క తేల్చడానికి అధికారులకు నెల రోజులు పట్టిందంటే పేర్ని నాని ఏస్థాయిలో కుంభకోణం నడిపించారో అర్థమవుతుంది.

తమ గోడౌన్‌లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం తగ్గాయంటూ పేర్ని నాని కుటుంబసభ్యులు గత నెల 26న లేఖ రాస్తే.. ఆ తగ్గిన బియ్యం లెక్కలు తేల్చడానికి సరిగ్గా నెల రోజులు పట్టింది. బియ్యం మాయం ఘటనపై పోలీసులు ఈ నెల 10న కేసు పెట్టారు. అంటే రెండున్నర వారాలు గడిచిపోయింది. అయినా ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయలేదు. పైగా పోలీసు అధికారులే పేర్ని నాని కుటుంబం పారిపోయే అవకాశం ఇచ్చింది. ఎక్కడున్నారో తెలియని పేర్ని నాని, ఆయన కొడుకు పేర్ని కిట్టు, భార్య జయసుధలు ఎంచక్కా కోర్టుల్లో పిటీషన్లు వేస్తూ బెయిల్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు.


గత ప్రభుత్వంలో తమను వెంటాడి వేధించిన మాజీ పేర్ని నాని కుటుంబ అక్రమాలు బయటపడినా.. మచిలీపట్నం ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర, ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుపైనా కూటమి కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికే రేషన్‌ బియ్యంపై రాజకీయం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై మాజీ సీఎం జగన్‌ విరుచుకుపడుతున్నారు. ఈ విమర్శలకు అధికార కూటమి నుంచి దీటుగా ప్రతిస్పందన రావట్లేదన్న చర్చ కార్యకర్తల్లో జరుగుతోంది.

కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం దందాపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన ఘటన మరిచిపోక ముందే తమ గోడౌన్‌లో 187 టన్నుల బియ్యం తగ్గాయని.. అందుకు సంబంధించిన లెక్కలు ఎంతో చెప్తే చెల్లిస్తామని గోడౌన్ యజమాని పేర్ని నాని భార్య పేర్ని జయసుధ కృష్ణా జిల్లా జెసి గీతాంజలి శర్మకు లేఖ రాసి, పెనాల్టీ చెల్లించారు. రెండు విడతలుగా కోటి డెబ్బై లక్షల రూపాయలు పెనాల్టీ చెల్లించిన పేర్ని నాని కుటుంబం చేసిన తప్పును ఒప్పుకున్నట్లైంది. అయినా వారిపై చర్యలు లేవు. మచిలీపట్నంలో పేర్ని నాని రాజకీయ ప్రత్యర్థి అయిన మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం ఆయన్ని వదిలిపెట్టేది లేదని స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.

Also Read:  షర్మిల టీమ్‌లోకి జగన్ బ్యాచ్! రంగంలోకి రాహుల్

పోలీసుల నోటీసులపై పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆమె కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. 15 రోజులుగా పేర్ని నాని భార్య జయసుధ అజ్ఞాతంలోనే ఉన్నారు. కేసు దర్యాప్తుగా సహకరించాల్సిందిగా తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే మచిలీపట్నంలోని మాజీ మంత్రి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించి వచ్చారు. అయితే ఈ తతంగం నడుస్తుండగానే పేర్ని నాని తన నివాసంలో ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశంగా మారింది. పెనాల్టీ కట్టేయడంతో ఇక కేసు నుంచి బయట పడవచ్చన్న ధీమాతోనే ఆయన బయటకు వచ్చారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే పేర్ని నానిని వదిలి పెట్టమంటున్న మంత్రి కొల్లు రవీంద్ర మంత్రిగా ఉండి కూడా ఆయన బయటకు వచ్చినప్పుడు అరెస్ట్ చేయించకపోవడం విమర్శల పాలవుతుంది.

గోడౌన్లలో బియ్యం మాయమైన విషయం తెలియగానే రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాల్సిన కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం… ఉన్నతస్థాయి ఆదేశాల కోసం ఎదురుచూస్తూ మిన్న కుండిపోయింది. కృష్ణా జిల్లాకు చెందిన కూటమి నేతలతో పేర్ని నానికి ఉన్న స్నేహ, వ్యాపార సంబంధాలూ కేసు సాగదీతకు కారణమన్న వాదన వినిపిస్తోంది. పేర్ని కుటుంబసభ్యులు లేఖ రాసిన వారం తర్వాత.. అంటే డిసెంబరు 4న అధికారులు గోదామును తనిఖీ చేశారు. 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లోగా పేర్ని నాని కుటుంబం పారిపోయింది. అరెస్టులో జాప్యంపై కూటమి శ్రేణుల విమర్శలతో తూతూమంత్రంగానే చర్యలు మొదలయ్యాయి.

రేషన్‌ బియ్యం మాయమైన వ్యవహారంలో.. దాని విలువను లెక్కగట్టి జరిమానా సహా బాధ్యుల నుంచి సొమ్ము వసూలు చేస్తున్నారు. ఆ లెక్కన పేర్ని నాని కుటుంబం మరో కోటిన్నరకు పైగానే పెనాల్టీ చెల్లించాలి. అయితే మాయమైన రేషన్‌ బియ్యం ఎక్కడికి చేరిందనేది పోలీసులు తేల్చడం లేదు. ఎప్పుడు, ఎక్కడికి తరలించారు? ఈ రేషన్‌ మాఫియాను నడిపించేవారెవరు అనేది తేలాల్సి ఉంది. అయితే పోలీసులు, పౌరసరఫరాలశాఖ అధికారుల తీరు చూస్తుంటే.. ఇవన్నీ పట్టించుకుంటున్నట్లే లేదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం పేర్ని నాని లెక్కలు తేలుస్తుందో లేదో చూడాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×