Intinti Ramayanam Today Episode December 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ ఇంటికి రాగానే తన బామ్మర్ది అక్షయ్ గురించి నిజం చెప్తాడని ఆలోచిస్తుంటాడు అంతలోకే అతనికి గుండెపోటు వస్తుంది. పార్వతి టాబ్లెట్స్ ఇవ్వగానే నొప్పి తగ్గిపోతుంది అని అంటాడు కానీ ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతుంటారు హాస్పిటల్ కి వెళ్దాం అని అడగ్గాని నాకు నొప్పి తగ్గింది. మీకన్నా నా బర్త్ డే ఫంక్షన్ ఇంపార్టెంట్ కాదు నాన్న అని అక్షయ్ అంటాడు.. ఏం కాలేదని చెప్పాను కదా వెళ్లి మీ పనులు మీరు చూసుకోండి అనేసి రాజేంద్రప్రసాద్ అంటాడు.. ఇంట్లో బర్త్ డే వేడుకలను గ్రాండ్గా ఏర్పాటు చేస్తారు. ఇక పార్వతి భోజనాలు దగ్గరికి వెళ్లి భోజనాలు అందరూ మెచ్చుకునేలా ఉండాలి ఎక్కడ మాట రాకుండా చూసుకోవాలనేసి అంటుంది.. రాజేంద్రప్రసాద్ తన ఫ్రెండ్స్ అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడే తన బామ్మర్ది దయాకర్ ఇంటికి వస్తాడు. రాజేంద్రప్రసాద్ అతను దగ్గరికెళ్ళి నువ్వు ఎందుకు వచ్చావు అని గొడవ పెట్టుకుంటాడు. ఇచ్చిన ఐదు లక్షలు భోజనాలకి సరిపోయే బావ.. కొట్టావు కదా పన్ను ఊడిపోయింది.. రెండు లక్షలు అవుతాయని డాక్టర్ చెప్పాడు.. రాజేంద్రప్రసాద్ తన మెడలోని గోల్డ్ చైన్ తనకి ఇస్తాడు అయితే బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతున్న పల్లవి వీళ్ళిద్దరిని చూస్తుంది. లోపలికి వస్తాడు దయాకర్.. ఇంట్లో వాళ్ళందరూ ఎవరు అని అడిగితే రాజేంద్రప్రసాద్ తన ఫ్రెండ్ అని చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంట్లో అక్షయ్ బర్త్డే వేడుకల్ని గ్రాండ్గా ఏర్పాటు చేస్తారు అందరూ సంతోషంగా సరదాగా ఉంటారు. దయాకర్ వెళ్లిపోయిన తర్వాత కమల్ అందరూ డాన్స్ చేయాలని అడుగుతారు. పల్లవి కమల్ డాన్స్ చేస్తారు. అలాగే అక్షయ్ అవని కూడా డాన్స్ చేస్తారు. పల్లవి భానుమతి ఇద్దరు కుళ్ళుకొంటారు.. ఇక కేక్ కటింగ్ చేయాలని కేకులు తెప్పిస్తారు. ముందుగా అవని కేక్ తెప్పించి పెడుతుంది. అలాగే పార్వతి కూడా కేక్ తెచ్చిస్తుంది. కమల్ అమ్మ కేకులు కట్ చేస్తావా వదిన కేకును కట్ చేస్తావా అనగానే ప్రపంచంలోకెల్లా అందుకని ఎక్కువ నాకు అమ్మే అమ్మ తర్వాత ఏదైనా అనేసి అమ్మ తెచ్చిన కేకే నేను కట్ చేస్తాను అని అంటాడు.
అందరికీ కేక్ తినిపిస్తాడు. బర్త్డే వేడుకల్ని మొత్తానికి పార్వతి అనుకున్నట్లు గ్రాండ్ గా చేస్తుంది. ఫంక్షన్లో అక్షయ్ తన గురించి చెప్పిన విషయాల్ని గుర్తు చేసుకొని పార్వతి మురిసిపోతుంది. తన కొడుకుకు తనపై ఉన్న ప్రేమను గుర్తు చేసుకొని సంతోషంగా ఫీల్ అవుతుంది. అప్పుడే అవని అక్కడికి వచ్చి అత్తయ్య మీరు కేక్ తెప్పిస్తున్నారని నాకు తెలియదు అందుకే నేను కేక్ తెప్పించాను నన్ను క్షమించండి అనేసి అడుగుతుంది. నేను ప్రతి ఏ అది అక్షయ్ బర్త్డే నీ గ్రాండ్గా చేస్తానని తెలుసు కానీ నువ్వు ఏడాది నాకు ఛాన్స్ ఇవ్వకుండానే చేశావు నా కొడుకుని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా అనేసి అడుగుతుంది. నేను మీ కొడుకుని మీకెందుకు దూరం చేస్తా అత్తయ్య నా గురించి తెలిసే మీరు ఇలా అంటున్నారా అని అడుగుతుంది. దానికి పార్వతి ఒకప్పుడు నాకు తెలిసిన అవని వేరు ఇప్పుడు తెలుసుకున్న అవని వేరు ఇప్పుడు నా కొడుకుని నాకు దూరం చేయాలని ఆలోచిస్తుంది అనేసి అంటుంది మీ కొడుకుని మీకు దూరం చేస్తే నాకేం వస్తుంది అత్తయ్య అని అవని అంటే నా మీద మీరు గాజులు ఇచ్చానని, డబ్బులు లాకర్ లో ఉన్న సంగతి కూడా నాకు తెలియదు అత్తయ్య అవి ఎలా వచ్చాయో నాకు తెలియదు ఈ రెండు విషయాలు మీరు కోపంగా ఉన్నట్టున్నారు నేను ఎన్నిసార్లు క్షమించమని అడిగినా కూడా నాతో మాట్లాడడానికి కూడా మీరు ఇష్టపడట్లేదు అనేసి అనగానే అక్కడి నుంచి పార్వతి వెళ్ళిపోతుంది. అవని పల్లవి బామ్మ ఇద్దరు కలిసి కావాలని అత్తయ్య దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేయాలని చూశారు..
ఇక బర్తడే కి అక్షయ్ కు కార్ తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇస్తుంది పార్వతి. అమ్మ నీకోసం పాతిక లక్షలు పెట్టి కార్ బుక్ చేసింది నీకు వెంటనే కార్ ఇవ్వాలని అనుకుంది కార్ చాలా బాగుంది అన్నయ్య అనేసి అక్షయ్ ని అడుగుతారు. ఇక అవని పల్లవి చేసిన ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..