BigTV English

BRS Plenary Meeting: బీఆర్ఎస్ ప్లీనరీ కమిటీలు ఎప్పుడు?

BRS Plenary Meeting: బీఆర్ఎస్ ప్లీనరీ కమిటీలు ఎప్పుడు?

రజతోత్సవాలు ఏడాది పాటు నిర్వహిస్తామన్న కేసీఆర్

గులాబీపార్టీ స్థాపించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా పార్టీ రజతోత్సవాలను ఏడాదిపాటు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 19న తెలంగాణ భవన్ లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ ఆ విషయం ప్రకటించారు. ప్లీనరీ ఏర్పాట్లపై కమిటీని వారం రోజుల్లో ప్రకటిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పక్షం రోజులైనా కమిటీపై క్లారిటీ రాలేదు. అసలు కమిటీ వేస్తారా? వేయరా? అనే సందేహం పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమకారులకు, పార్టీ ముఖ్యులతో కమిటీ వేస్తామని చెప్పిన కేటీఆర్ ఆ అంశంపై మళ్లీ నోరుమెదపడం లేదు. వచ్చే నెల 27వ తేదీన ప్లీనరీ ఉండటంతో ఇంకా చాలా గడువు ఉందనా? లేకుంటే మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్నది అర్థం కాకుండా తయారైంది.


పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నవారికి అవకాశం ఇస్తారా?

పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నవారికి ఈ ప్లీనరి కమిటీలోనైనా అవకాశం కల్పిస్తారా? కేవలం మాటలతోనే మమ అనిపిస్తారా? అనే చర్చ సైతం జరుగుతుంది. ఇప్పటివరకు పార్టీ కమిటీల్లో సైతం అవకాశం ఇవ్వలేదని, ఇప్పుడన్నా అవకాశం ఇస్తారని వారు ఆశిస్తున్నారు. గతంలో పార్టీలో పనిచేసేవారికి అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ వలస నేతలకే పెద్దపీట వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడైనా పార్టీలో కొనసాగుతున్న వారిని గుర్తిస్తారా? లేదా? అన్న చర్చ జోరుగా సాగుతుంది. కేసీఆర్ పార్టీకి కష్టం కాలం వచ్చినప్పుడే కార్యకర్తలు, నేతలు గుర్తుకు వస్తారని ఆ తర్వాత వారిని పట్టించుకోరనే అపవాదు ఉంది.

హరీష్ రావు ప్రస్తావన తీసుకురాని కేటీఆర్

ప్లీనరీపై తండ్రి కొడుకుల వ్యాఖ్యల్లో గ్యాప్ కనిపించింది. ఒకరు చెప్పిన అంశాలకు, మరొకరు మీడియా ముందు చెప్పిన మాటలకు పొంతన కరువైంది. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రజతోత్సవాల కమిటీ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగిస్తున్నామని, ఆయనే మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కో-ఆర్డినేషన్ కమిటీలు వేస్తారని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మండలాల్లోని గ్రామాలను మూడు కమిటీలుగా వేస్తారని , కమిటీ బాధ్యులు ప్లీనరితో పాటు పార్టీ బలోపేతానికి పాటుపడతారని పేర్కొన్నారు.

హరీష్ రావుకే అప్పగించాలంటున్న సీనియర్లు

అయితే అదే రోజు మీడియా ముందుకు వచ్చిన కేటీఆర్ మాత్రం రజరోత్సవాలకు సంబంధించి కమిటీలను వారం రోజుల్లో వేస్తామని ప్రకటించారు. మీడియా ముందు ఆయన అసలు హరీష్ రావు ప్రస్తావన తేకపోవడంతో పార్టీలోనే ఇంకా చర్చ జరుగుతుంది. కేసీఆర్ చెప్పిన మాటను కేటీఆర్ ఎందుకు చెప్పలేదు… ఏమైనా అభిప్రాయ బేధాలు తలెత్తాయా?.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ రజతోత్సవాలు విజయవంతం కావాలంటే హరీష్ రావుకు అప్పగిస్తేనే బాగుంటుందని పలువురు సీనియర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి చివరికి కేసీఆర్ డెసిషన్ ఎలా ఉంటుందో చూడాలి.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×