BigTV English

CM Chandrababu: తిరుపతి టీడీపీ ఇన్‌చార్జ్‌ అతనేనా?

CM Chandrababu: తిరుపతి టీడీపీ ఇన్‌చార్జ్‌ అతనేనా?

CM Chandrababu: తిరుపతి టిడిపి అనాథగా మారిందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇన్చార్జ్ ఎవరనేది అధిష్టానం ప్రకటించక పోవడంతో పాటు ఇప్పటికి వరకు ఇన్చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు ఎలాంటి పవర్స్ ఇవ్వలేదు. దానికి తోడు అమెకు మరో పదవి ఇవ్వడంతో తాజాగా ఇన్‌చార్జ్ పదవి కోసం నలుగురు రేసులోకి వచ్చారు. వారిలో ఎవరిని పార్టీ ఎంపిక చేస్తుంది అన్నది తిరుపతి టిడిపి వర్గాలతో పాటు ప్రతిపక్షంలో కూడా చర్చనీయాంశంగా మారింది


గత ఎన్నికల్లో తిరుపతిని జనసేనకు కేటాయించిన టీడీపీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి పాదాల చెంత విస్తరించి ఉన్న తిరుపతి ఎప్పుడు అత్యంత కీలక నియోజకవర్గం . ముఖ్యంగా వీవీఐపీలు నిరంతరం వచ్చే ప్రాంతం కావడంతో ఇక్కడ స్థానిక ప్రజా ప్రతినిధితో పాటు పార్టీ ఇన్చార్జ్‌లకు సైతం అంతే ప్రాధాన్యత ఉంటుంది. 2024 ఎన్నికల్లో టీడీపీ తన మిత్ర పక్షం జనసేనకు ఈ స్థానం కేటాయించడంతో అక్కడ టిడిపి ఇన్చార్జ్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఇప్పటి వరకు టీడీపీ ఇన్చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు వయోభారంతో పాటు ప్రతిపక్షం నుంచి యువకుడు ఇన్చార్జ్‌గా ఉండటంతో ఎత్తుకు పై ఎత్తులు వేయలేని స్థితి..


సుగుణమ్మకు గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి

దానికి తోడు చాపకింద నీరులా జనసేన వైసీపీలోని అసమ్మతి వాదులను పార్టీలో చేర్చుకుని బలపడ్డానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా భర్తీ అయిన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులలో సుగుణమ్మకు గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి పక్కన పెట్టారు. దాంతో పాటు వచ్చే మేయర్ ఎన్నికలలో ఆమె మనవరాలికి ప్రాధాన్యత ఇస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికలలో టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించిన ఊకా విజయ్‌కూమార్ కు కూడా అర్బన్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ పదవి దక్కడంతో ఆయన కూడా ఇన్చార్జ్ రేసు నుంచి తప్పుకున్నట్లైంది.

తిరుపతి ఇన్చార్జ్ పదవి కోసం టీడీపీ సీనియర్ల ప్రయత్నాలు

తాజాగా ఇప్పుడు ఇన్చార్జి పదవి కీలకంగా మారడంతో తిరుపతిలోని పార్టీ సీనియర్లు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మాస్ లీడర్ గా గుర్తింపు ఉన్న జెబీ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి కూమారుడు మబ్బు దేవనారాయణరెడ్డితో పాటు విద్యాసంస్థల అధినేత ప్రణీత్, డాక్టర్ బాల సుబ్రమణ్యం లు తిరుపతి టీడీపీ ఇన్చార్జ్ పదవి కోసం లాబీయింగ్ చేసుకుంటున్నారంట. వారిలో కొందరు తుడా చైర్మన్ కోసం ప్రయత్నాలు సాగించినప్పటికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తుడా చైర్మన్‌గా డాలర్స్ దివాకర్ రెడ్డికి అవకాశం కల్పించారు. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మహానాడుకు ముందే ఇన్చార్జిని ప్రకటిస్తారని అంటున్నారు..

చంద్రబాబు, లోకేష్‌లు వచ్చినప్పుడు హడావుడి చేస్తున్న నేతలు

గత 11 నెలలుగా తిరుపతి టీడీపీ క్యాడర్ నిస్తేజంగా ఉంది. ఎవరికి వారు నాయకులుగా వ్యవహరిస్తుండటంతో సభ్యత్వ నమోదులో వెనుకబడింది. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి వచ్చినప్పుడు మాత్రము నాయకులు హడావుడి చేయడం, తర్వాత కనిపించడం లేదనే వాదన ఉంది. ఇలాంటి స్థితిలో పార్టీ క్యాడర్‌తో నిరంతరం సంబంధాలు నెరిపే నేత అవసరం ఉందంటున్నాయి టీడీపీ శ్రేణులు. లేక పోతే తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికల సమయంలో ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందంటున్నారు. ఇటీవల జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికలలో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు చివరి నిమిషంలో తిరుపతి, చంద్రగిరి నాయకులు ఎంటర్ అయి ఫలితాన్ని టీడీపీకి అనుకూలంగా మార్చారు. మొదటి రోజే ఎన్నిక జరిగిఉంటే ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థి విజయం సాధించేవారన్న టాక్ ఉంది.

Also Read: ధనుంజయ రెడ్డి అరెస్ట్ నెక్స్ట్ ఎవరు?

జేబీ శ్రీనివాస్ , మబ్బ దేవనారాయణరెడ్డి వైపు జిల్లా ఇన్చార్జ్ మంత్రి మొగ్గు

జేబీ శ్రీనివాస్ , మబ్బ దేవనారాయణరెడ్డి పట్ల జిల్లా ఇన్చార్జ్ మంత్రితో పాటు స్థానిక పార్లమెంటు అధ్యక్షుడు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వారిద్దరికీ బలమైన క్యాడర్ ఉండటం, మాస్ లీడర్స్ అవ్వడం కలిసి వస్తుందంటున్నారు. ప్రణీత్ కు విద్యాసంస్థలతో పాటు, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడుతో సత్సంబంధాలు, చంద్రబాబు కుటుంబ సభ్యులతో ఉన్న పరిచయాలు కలసి వస్తాయని అంటున్నారు. బాల సుబ్రమణ్యం పార్టీలోని కీలక వ్యక్తులతో నిరంతరం టచ్లో ఉండటంతో పాటు, సర్వే టీమ్స్‌తో పరిచయాలు ప్లస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే 2029 ఎన్నికలకు పార్టీని సమర్థవంతంగా రెడీ చేసే ఇన్చార్జ్ కావాలని తిరుపతి టీడీపీ క్యాడర్ కోరుతోంది. తిరుపతిలో వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్యామీలీ తిరిగి యాక్టివ్ అయ్యింది. ఏదో ఓక విషయం మీద ప్రజల్లోకి వెళుతూ తమ ఉనికిని పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి స్థితిలో ఇక్కడ ప్రత్యర్ధులను ధీటుగా ఎదుర్కొనే నాయకుడు అవసరమని క్యాడర్ అంటోంది.

చిత్తూరు, తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు ఇద్దరికీ నామినేటేడ్ పదవులు

తిరుపతిలో బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ బలిజ సామాజిక వర్గానికి చెందిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆ సామాజిక వర్గానికి అవకాశం వస్తుందని అంటున్నారు. దానికితోడు నియోజకవర్గ పునర్విభజన మీద చాలా మంది అశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గ నాయకులకు అక్కడ అవకాశం వస్తుందని అంటున్నారు.మరోవైపు మహానాడుకు ముందు జిల్లా అధ్యక్షులను సైతం మార్చి వేసి ఎమ్మెల్యేలకు కాని సీనియర్ నాయకులకు కాని అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. చిత్తూరు , తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు ఇద్దరికీ నామినేటేడ్ పదవులు రావడంతో వారిని కూడా మారుస్తారని అంటున్నారు. మరి చూడాలి టీడీపీ అధిష్టానం ఆశావహుల్లో ఎవరిపై నమ్మకం ఉంచుతుందో.

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×