Food For Liver Health: మన కాలేయం శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఇది శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడం, జీర్ణక్రియకు సహాయపడటం, పోషకాలను నిల్వ చేయడం వంటి అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా లేకపోతే శరీరం యొక్క మొత్తం పనితీరు ప్రభావితం అవుతుంది. అందుకే.. మన జీవితంలో కొన్ని టిప్స్ తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా ప్రతి రోజు ఉదయం మనం కాలేయ ఆరోగ్యానికి మేలు చేసే కొన్నిరకాల ఆహారాల పదార్థాలను తప్పకుండా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ టీ:
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా కాటెచిన్స్ అనే సమ్మేళనం కూడా ఇందులో ఉంటుంది. ఇవి కాలేయ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. అంతే కాకుండా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. ప్రతిరోజు ఉదయం ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల కాలేయ వాపు తగ్గి దాని పనితీరు పెరుగుతుంది. అలాగే.. ఈ టీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇది ఫ్యాటీ లివర్ యొక్క అవకాశాలను తగ్గిస్తుంది.
వాల్‌నట్స్:
వాల్‌నట్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, గ్లూటాథియోన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. ఉదయం క్రమం తప్పకుండా కొన్ని వాల్‌నట్‌లను తినడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఫ్యాటీ లివర్ వంటి సమస్యలను నివారిస్తుంది. వాల్‌నట్స్ కాలేయాన్ని బలోపేతం చేయడమే కాకుండా మెదడు, గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
పాలకూర:
ఐరన్,ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పాలకూరలో అధికంగా ఉంటాయి. ఈ మూలకాలు కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా హానికరమైన అంశాల నుండి సురక్షితంగా ఉంచుతాయి. పాలకూరలో ఉండే క్లోరోఫిల్ కాలేయాన్ని డీటాక్స్ చేసి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. అంతే కాకుండా ఉదయం టిఫిన్ సమయంలో పాలకూర సూప్, స్మూతీ లేదా కూరగాయలు తినడం వల్ల కాలేయం చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంటుంది.
వెల్లుల్లి:
వెల్లుల్లిని ఒక ఔషధంగా భావిస్తారు. ఇది సల్ఫర్ సమ్మేళనాలు, సెలీనియం వంటి మూలకాలను కలిగి ఉంటుంది. ఇది కాలేయం యొక్క పనితీరును వేగవంతం చేస్తుంది. అంతే కాకుండా శరీరం నుండి హానికరమైన వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో కొద్దిగా పచ్చి లేదా తేలికగా ఉడికించిన వెల్లుల్లి తినడం వల్ల కాలేయం పనితీరు పెరుగుతుంది. అంతే కాకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది.
Also Read: రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే.. నేచురల్ డ్రింక్స్ ఇవే !
నిమ్మకాయ:
నిమ్మకాయ విటమిన్ సి సమృద్ధిగా ఉండే సిట్రస్ పండు. ఇది అద్భుతమైన డీటాక్స్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. నిమ్మరసం కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల కాలేయం చురుకుగా, ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంచి మార్గం.