BigTV English

No Bullet Trains: అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికీ బుల్లెట్ రైలు లేదు, కారణం ఏంటో తెలుసా?

No Bullet Trains: అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికీ బుల్లెట్ రైలు లేదు, కారణం ఏంటో తెలుసా?

ప్రపంచంలో అగ్రరాజ్యంగా చలామణి అవుతున్న అమెరికా.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో రోజు రోజుకు మరింత పురోగతి సాధించిస్తోంది. అంతరిక్షం నుంచి అణుబాంబుల వరకు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతోంది. అయితే, ఇప్పటికీ ఆ దేశంలో హైస్పీడ్ బుల్లెట్ రైలు లేకపోవడం విశేషం. అమెరికాలో 71 జాతీయ రహదారులు, 5 వేలకు పైగా విమానాశ్రయాలు ఉన్నాయి. కానీ, అమెరికన్లకు ఇప్పటికీ బుల్లెట్ రైలు ప్రయాణానికి దూరంగానే ఉంది.


బుల్లెట రైళ్లలో ముందున్న చైనా

అమెరికాతో పోల్చితే చైనా బుల్లెట్ రైల్ ప్రాజెక్టులలో అందనంత దూరంలో ఉంది. ఇప్పటికే 50,000 కిలో మీటర్లకు పైగా హై స్పీడ్ రైల్వే లైన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూరోపియన్ యూనియన్ సుమారు 8,500 కిలో మీటర్ల పరిధిలో హైస్పీడ్ రైల్వే లైన్లు ఉన్నాయి. చైనా, యూరప్ కంటే అమెరికా ఎందుకు ఈ విషయంలో వెనుబడి ఉంది? అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


అమెరికాలో హైస్పీడ్ రైళ్లు ఎందుకు లేవంటే?

అమెరికాలో 250 కి.మీ/గం, అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే హై-స్పీడ్ రైళ్లు ఇప్పటికీ అమెరికాలో లేవు. నిజానికి అమెరికాలో ప్రజలు రైళ్లలో ప్రయాణించేందుకు పెద్దగా ఇష్టపడరు. కొన్ని ప్రాంతాలలో బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు ప్రజా ఆసక్తి లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హై-స్పీడ్ రైలుకు ప్రాధాన్యత ఇవ్వడంలో అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అమెరికన్లు సుదూర ప్రయాణానికి కార్లు, విమానాలను ఇష్టపడతారు.

రెండు హైస్పీడ్ రైల్వే కారిడార్లను నిర్మిస్తున్న అమెరికా

ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం రెండు హై స్పీడ్ రైలు కారిడార్లను నిర్మిస్తోంది. మరికొన్ని కారిడార్ల నిర్మాణం ప్రణాళికల దశలో ఉంది. అయినప్పటికీ, పురోగతి చాలా నెమ్మదిగా ఉంది. అంతేకాదు, ప్రతిపాదిత ప్రాజెక్ట్ నుంచి నిధులను ఉపసంహరించుకోవాలని అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాలో హైస్పీడ్ రైలు భవిష్యత్తుపై సందేహాన్ని కలిగిస్తోంది. యునైటెడ్ స్టేట్స్ ప్రస్తుతం రెండు హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. ఒకటి కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజిల్స్ లైన్. మరొకటి లాస్ ఏంజిల్స్ నుంచి లాస్ వెగాస్ వరకు నిర్మిస్తున్నారు. అదనంగా, ఒరెగాన్‌ లోని పోర్ట్‌ ల్యాండ్‌ ను వాషింగ్టన్‌లోని సీటెల్‌ కు అనుసంధానిస్తూ, కెనడాలోని వాంకోవర్ వరకు విస్తరించే కొత్త హై-స్పీడ్ రైలు మార్గాన్ని కూడా ప్రణాళికలు కొనసాగుతున్నాయి. టెక్సాస్‌ లోని డల్లాస్, హ్యూస్టన్ మధ్య ఒక ప్రాజెక్ట్ కూడా ప్రతిపాదించబడింది. కానీ ట్రంప్ ఈ ప్రాజెక్టులకు గ్రాంట్‌ ను రద్దు చేయడంతో ఈ ప్రాజెక్టుల భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.

Read Also: ఫ్లైట్ లో ఆ కుక్కలను తీసుకెళ్లొచ్చట, విమాన సంస్థల కీలక నిర్ణయం!

2033 నాటికి పూర్తి కానున్న శాన్ ఫ్రాన్సిస్కో- లాస్ ఏంజిల్స్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టును కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. ఇక లాస్ ఏంజిల్స్ నుంచి లాస్ వెగాస్ వరకు నిర్మించే మార్గాన్ని 2028 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రైవేట్ నిధులతో కొనసాగుతోంది. అయితే, ట్రంప్ తీసుకునే నిర్ణయాల కారణంగా ఈ ప్రాజెక్టుల గత అగమ్యగోచరంగా మారింది.

Read Also:  దేశంలోనే అత్యంత పొడవైన రోప్ వే, లైఫ్ లో ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Related News

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

Big Stories

×