BigTV English

Kaikala: నాడు కళ కోసం, నేడు కాసుల కోసం.. సినిమాలపై కైకాల అభిప్రాయం ఇదే..

Kaikala: నాడు కళ కోసం, నేడు కాసుల కోసం.. సినిమాలపై కైకాల అభిప్రాయం ఇదే..

Kaikala: ‘మహర్షి’.. కైకాల చివరి మూవీ. ఆ తర్వాత కూడా ఆయనకు సినిమా అవకాశాలు వచ్చాయి. ఒంట్లో నటించే శక్తి కూడా ఉంది. అయినా, సినిమాలకు దూరంగా ఉన్నారు సత్యనారాయణ. ఎంతమంది, ఎన్నిసార్లు ఆయన్ను సంప్రదించినా.. ఆ ఆఫర్లను సున్నితంగానే తిరస్కరించేవారు. 700లకు పైగా చిత్రాల్లో నటించిన కైకాల.. సడెన్ గా చిత్రపరిశ్రమ నుంచి ఎందుకు దూరం జరిగినట్టు? ఏంటి రీజన్? వయసు మీద పడటమేనా? ఇంకేదైనా కారణమా?


ఈ ప్రశ్నకు గతంలో ఆయనే స్వయంగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుత సినిమాలు, పరిశ్రమ తీరుపై పెదవి విరిచారు. ఆ రోజుల్లో.. అంటూ గతాన్ని, ప్రస్తుతాన్ని పోల్చి చెప్పారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే…

‘‘పరిస్థితుల వల్ల సినిమాలకు దూరంగా ఉండక తప్పట్లేదు. నాటికీ నేటికీ స్క్రిప్టులు, పాత్రలు, నటీనటుల ప్రవర్తన, గౌరవ మర్యాదలు చూస్తే.. అంత సంతృప్తిగా అనిపించడం లేదు. కథ, కథనం, డైలాగులు, సంగీతం..లాంటి విషయాల్లో పొంతన లేదు. గతంలో పారితోషికం కూడా మాకు, హీరోలకు దాదాపు సమానంగానే ఉండేది. హీరో ఒక సినిమా చేసే లోపు.. మేము మూడు, నాలుగు సినిమాలు చేసేవాళ్లం. దానివల్ల పారితోషికం ఒకేలా ఉండేది. ఇప్పుడు హీరోలు పారితోషికం విపరీతంగా పెంచేస్తున్నారు. నాడు కళ కోసం చూసుకుంటే.. నేడు కాసుల కోసం చూసుకుంటున్నారు. ఇది నచ్చక నటనకు కాస్త దూరమయ్యాను. వరుస సినిమాల్లో చేస్తున్నప్పుడు 4 రోజులు ఎక్కడికైనా పారిపోయి నిద్రపోవాలనుకునే వాడిని. ఇప్పుడు ఆ బాధ లేదు’’ అని కైకాల సత్యనారాయణ గతంలో ఓ ఇంటర్వ్యూల్లో చెప్పారు.


కైకాల మాటలు నిజమే అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. అప్పటి సినిమాలకు ఇప్పటి మూవీస్ కి చాలా చాలా తేడా ఉంది. కాలంతో పాటు అంతా మారిపోయింది. ఇప్పడంతా హీరో సెంట్రిక్. దర్శకుడు, హీరోలదే ఆధిపత్యం. పేరు వారికే, డబ్బులూ వారికే. అందుకే, ఆ తరం నటులు ఇప్పటి సినీ ఇండస్ట్రీలో ఒదగలేకపోతున్నారు. కైకాల లాంటి కొందరు నటులు చివరి దశలో సినిమాలకు దూరంగా ఉండిపోయారు.. ఉండిపోతున్నారు.

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×