Illu Illalu Pillalu ToIlluday Episode August 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. చందు నిద్రపోగానే మెల్లగా బయటకు వచ్చి తలుపుతీస్తుంది. తలుపు తీయగానే బయట ధీరజ్ని చూసి షాక్ అవుతుంది. అయితే ధీరజ్ ఏంటి వదిన నువ్వు ఈ టైంలో డోర్ తీయవు కదా మరి ఏం చేస్తున్నావ్? ఎవరికోసం తీసావ్? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు.. ఆశ్చర్యం కాదు ఆనందం కాదు.. మావయ్య గారు నాకు అప్పగించిన బాధ్యతని నేను నెరవేర్చాలని అనుకుంటున్నాను. ధీరజ్ శ్రీవల్లిని ఏదో టెన్షన్ పడుతున్నారు మీ ముఖం మొత్తం చమటలు పడుతున్నాయి అని అడుగుతాడు. నేనెందుకు టెన్షన్ పడతాను నాకేం అవసరం అని శ్రీవల్లి అంటుంది.
నువ్వు లోపలికి వస్తావా లేక డోర్ వేసుకుని వెళ్లిపోమంటావా అని ధీరజ్ని శ్రీవల్లి అడుగుతుంది. నువ్వు వచ్చి ప్రేమని పిలవడం నేను విన్నాను అందుకే డోర్ తీశాను. ఇక నీ ఇష్టం అని అంటుంది.. ఇంట్లోకి వచ్చేసిన ఆనంద్ రావు శ్రీవల్లికి ఫోన్ చేసి డోర్ తీయమన్నాను కదా అమ్మడు నువ్వు మళ్ళీ డోర్ వేశావ్ ఏంటి అని అంటాడు.. శ్రీవల్లి మళ్లీ వచ్చి డోర్ తీసి మెల్లగా వెళ్ళిపోతుంది. ఆనంద్ రావు ఎలాగోలాగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేస్తాడు. ఎలాగైనా సరే ఇవాళ 10 లక్షలు కొట్టేసి వెళ్లాల్సిందే అని అంటాడు. అయితే ధీరజ్ లోపలికి రాగానే ప్రేమ షాక్ అవుతుంది. మొన్నటి వరకేమో నేను వచ్చేంతవరకు వెయిట్ చేస్తూ ఉన్నావు. ఇప్పుడేమో కొత్త కొత్త పదాలు ప్రేమ దోమ అంటూ మాట్లాడుతున్నావు అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నీళ్ల కోసమని వెళ్లిన నర్మదకు ఎవరో వచ్చినట్లు అనిపిస్తుంది. కచ్చితంగా దొంగలాగే ఉన్నాడు అని గట్టిగా కేకలు వేస్తుంది.. అక్కడే ఉన్న తిరుపతి లేచి దొంగను పట్టుకుంటాడు. దొంగ దొంగ అని ఇద్దరు కలిసి అరవడంతో శ్రీవల్లి టెన్షన్తో మా నాన్న దొరికిపోయాడా ఏంటి అని అనుకుంటుంది.. హాయ్ బాబు ఇలా జరిగిందేంటి మా నాన్న దొరికితే ఇంకేమన్నా ఉందా అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఆనందరావు మాత్రం నర్మద చేతిలోంచి తప్పించుకొని పారిపోతాడు.. అలా తప్పించుకుని వెళ్లిన అన్న ఆనందరావు భద్రావతి ఇంట్లోకి వెళ్తాడు.. భద్రావతి గదిలోకి వెళ్లి కూర్చుంటాడు.
తప్పించుకున్న ఆనంద్ రావు భద్రావతి గదిలో కూర్చుని ఉంటాడు అది ఇడ్లీగా నువ్వు ఏం పరిగెత్తావ్ రా ఈ విధంగా పరిగెత్తే రేస్ లో కూడా నువ్వే గెలుస్తావురా అని అనుకుంటూ ఉంటాడు. అరేయ్ ఎవర్రా అని భద్రవతి అరుస్తుంది. దొంగలా ఉన్నాడే అని లైట్ వేసి పిలుస్తుంది. భద్రాసేన ఇద్దరినీ అరుస్తుంది దొంగ వచ్చాడు అని అంటుంది. వాళ్ళందరూ అలర్ట్ అయ్యి దొంగని పట్టుకుంటారు.. అటు రామరాజు కుటుంబం ఆ దొంగ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. పద ఇక్కడేం కనిపించలేదు అని లోపలికి వెళ్తారు.
భద్ర ఇంట్లో దొరికిపోయిన ఆనంద్ రావు ముసుగు వేసుకొని వాళ్ళ చేత దెబ్బలు తింటాడు. సేన, విశ్వ ఇద్దరు కలిసి వాడి మూసుకుని తీసేస్తారు. నువ్వేంటి ఇంత విచిత్రంగా ఉన్నావు నిన్ను ఎక్కడో చూసినట్లుందే అని అడుగుతారు. భద్ర వీణ్ణి మనము రామరాజు వియ్యంకుడుగా చూసాము అని అంటుంది. కానీ అతను మాత్రం నేను కాదని అంటాడు. తల మీద గన్ను పెట్టడంతో అసలు నిజం కక్కేస్తాడు. అటు దొంగ కోసం వెతుకుతున్న ధీరజ్ సాగర్ వస్తారు ఆ దొంగ ఎక్కడ కనిపించలేదని అంటారు..
అయితే నర్మదకు మాత్రం వల్లి మీద అనుమానం వస్తుంది. ఎవరో వల్లేకి సంబంధించిన వాళ్లే వచ్చారని అనుకుంటుంది. అయితే బీరువాతాలలో ఆ దొంగ చేతుల నుంచి కింద పడ్డాయి అని వల్లికి ఇస్తుంది. బీరువాతాలలో నీ దగ్గర ఉన్న విషయం ఇంట్లో వాళ్లకు తప్ప ఎవరికీ తెలియదు. అంటే ఆ దొంగ చాలా తెలివిగా ఇక్కడ ఉన్నదంతా గమనిస్తూ నీ దగ్గర ఉన్న తాళాలని తీసుకున్నాడు. ఇది ఎవరో కావాలనే చేశారు. తెలిసిన వాళ్లే ఇలా చేసి ఉంటారని నాకు అనుమానంగా ఉంది అని నర్మదా అంటుంది. ఇందాక వెళ్లిన దొంగ మళ్ళీ రాని గ్యారెంటీ లేదు.
Also Read: ఇంట్లోంచి లేచిపోతున్న ప్రణతి, భరత్.. అక్షయ్ ను కూల్ చేసిన అవని… భరత్ ను టార్గెట్ చేసిన పల్లవి..
మనము ఇంకాసేపు ఇక్కడ వెయిట్ చేద్దాం అని నర్మదా అంటుంది. కాసేపట్లో తెల్లారిపోతుంది కదా మేల్కొని ఉండడమే మేలు ఈ దొంగ మళ్ళీ వచ్చినా రావచ్చు అని ధీరజ్ కూడా అంటారు. అవును మనం ఇక్కడే ఉంటే బెటర్ అని అందరూ అంటారు. అయితే అత్తయ్య మామయ్యను కలపడానికి ఇదే మంచి సమయం మనం ఏదో ఒకటి చేయాలి అని ప్రేమ నర్మదా ప్లాన్ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..