Telangana News: గులాబీ పార్టీలో కల్వకుంట్ల కవిత గుబులు కొనసాగుతుందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. అన్న కేటీఆర్‌పై పరోక్షంగా తిరుగుబాటు ఎగరవేసిన కవిత ఎప్పటికప్పుడు ఆ పార్టీకి మింగుడు పడని అంశంగానే తయారవుతున్నారంట. తాజాగా కొంతమంది నేతలను తనపై ఉసిగొల్పుతున్నారంటూ కవిత చేసిన కామెంట్స్ పార్టీలో చర్చినీయంశంగా మారాయట. అసలు కవిత చూట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి? అసలు తమ పార్టీలో ఏం జరుగుతుందో అంతుపట్టక నేతలు తలలు పట్టుకుంటున్నారట. నిజంగానే బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు జరుగుతున్నాయా?
జాగృతి వ్యవస్థాపకురాలిగా తనదైన దూకు ప్రదర్శిస్తున్న కవిత
తెలంగాణ ఆవిర్భావం తర్వాత నిజామాబాద్ ఎంపీగా గెలిచిన కల్వకుంట్ల కవిత తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలిగా తనదైన మార్క్ వేసుకున్నారు. తర్వాత మారిన పరిణామాలతో ఆమె ఎంపీగా పరాజయం పాలైనప్పటికీ తండ్రి కేసీఆర్ ఆమెను స్థానిక సంస్థల కోటాలో ఎమఎల్సిని చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ గారాల పట్టిగా అందరికీ సుపరిచిత్రాలైన ఎమఎల్సి కవితపై ప్రస్తుతం సొంత పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయ అంశము మారాయి.
పొమ్మనకుండా పొగ పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారా?
గులాబీ బాస్ పార్టీ నుంచి ఆయన సొంత కూతురిని బయటకి పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా పొమ్మన లేక పొగబెట్టే విధంగా సొంత కుటుంబం నుంచి చర్యలు స్టార్ట్ అయ్యాయా అందుకే కవిత దూకుడు పెంచారా అని గులాబీ శ్రేణులోని పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు. కవితపై బహిరంగంగానే విమర్శలు చేయడంతో పాటు ఆమెకు లింక్ పెడుతూ కావాలని ఇతర పార్టీల నేతలపై వ్యాఖ్యలు చేస్తున్న ఆ పెద్ద నేత ఎవరనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమె జాగృతి సంస్థ కార్యక్రమాలతో యాక్టివ్ గా ముందుకు వెళ్తూ ఉండడంతోనే కట్టడి చేయాలని బిఆర్ఎస్ లోని పెద్దలు ఆలోచన చేస్తున్నారా లేకుంటే పార్టీ నుంచి బయటకి వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతుందా అనేది ఇప్పుడు చర్చనీయం చెమారిందట. ఆమెను పార్టీ నుండి బయటకి పంపితే ఎవరికీ లాభం అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.
నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్న కవిత
కవిత సొంత జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలకు శ్రీకారం చూడుతూ నిత్యం ప్రజల్లో ఉండేలా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ప్రజా సమస్యలు ఇష్యూలపై కవిత చేస్తున్న ఆంధ్రాలతో తన వాణిని ప్రజలకు వివరిస్తున్న పరిస్థితి. ఇలాంటి తరణంలో ఆమెపై కుట్రాలకు సొంత పార్టీలోని నేతలే తెరదీశారని కవిత మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఒంటరిని చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కవిత ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? బిఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న ఆమెను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఇప్పుడు చర్చనీయ అంశమైంది. ఆమె బీస మహిళా నిరుద్యోగ కులాల సమస్యలతో పాటు ఇరిగేషన్ అంశాలపైన పోరాట బాటపట్టారు. రౌండ్ టేబుల్ సమావేశాలు మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ తీరును ఎడ్డగడుతున్నారు. అయితే ఆమె దూకుడుగా వెళ్తూ ఉండడంతో తమని డామినేట్ చేస్తారని చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు అన్న చర్చ మొదలైంది.
తన కదలికలపై నిఘా పెట్టారంటున్న జాగృతి ప్రెసిడెంట్
కవిత ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు వచ్చి కలిసిపోతున్నారనే వివరాలు సేకరించేందుకు ఓ పెద్ద నేత మనుషులు పెట్టారని వారి వివరాలు సైతం తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. కవిత అయితే వారు ఏం చేస్తున్నారు ఎవరితో భేటీ అవుతున్నారనే వివరాలను తాను సైతం వాటికంటే ముందు తెలుసుకుంటున్నాను అని సమయం వచ్చినప్పుడు వివరాలు అన్ని బయట పెడతానని పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నట్టు కవిత బాంబు పేల్చారు. అయితే ఆమె లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికీ తాను కేసీఆర్ అంత మంచిదాన్ని కాదని నేను భయపడే వ్యక్తిని కాదని పలు సందర్భాల్లోనూ వ్యాఖ్యానించారు. ఎవరి పేర్లు ప్రస్తావించకుండానే పరోక్షంగా పార్టీలోని నేతలపై మండిపడ్డారు. ఆ క్రమంలో ఫైర్ బ్రాండ్ కవితపై నేతలను ఎందుకు ఉసగలుపుతున్నారు అనేది అటు బిఆర్ఎస్ లో ఇటు జాగృత సంస్థలోని నాయకుల్లో చర్చకు దారితీస్తుంది.
కవితను బీఆర్ఎస్‌లో పోటీగా భావిస్తున్న నాయకుడు ఎవరు?
కవిత రాజకీయంగా ఎదుగుదలను ఆ పెద్ద నాయకుడు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? కవితను ఆ నాయకుడు పార్టీలో పోటీగా అని భావిస్తున్నారా అనేది ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలోనూ చర్చకు దారితేస్తుందట. కేసిఆర్ కుటుంబంలోని వ్యక్తి కవితపై విమర్శలు చేయించడంపై మతలబ్ ఏంటి అనేది కూడా ఆడ్ టాపిక్ గా మారింది. కవిత పార్టీకి దూరమైతే ఆ పెద్ద నాయకుడికి వచ్చే లాభం ఏంటి అనే దానిపై పార్టీలోని నేతలు ఆరాధిస్తున్నట్లు సమాచారం. కవిత స్వయంగా తనను ఒంటరి చేసే కుట్ర పార్టీలో జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా కవితపై కుట్రలు జరుగుతున్నాయి అనేది మాత్రం వాస్తవమని ప్రస్తుత పరిణామాలు మాత్రం స్పష్టం చేస్తున్నాయి. అయితే కవిత ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అనేది మాత్రం హాట్ టాపిక్ అయింది.
Story By Venkatesh, Bigtv